వివో X200T: పవర్‌ఫుల్ ఫీచర్స్​తో వస్తున్న కొత్త స్మార్ట్​ఫోన్​..​

వివో ఎక్స్​200టీ స్మార్ట్​ఫోన్​ని సంస్థ లాంచ్​కు రెడీ చేస్తోందని సమాచారం. ఇది 2026 జనవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదొక పవర్‌ఫుల్ ప్రీమియం మిడ్​రేంజ్​ గ్యాడ్జెట్​ అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్​పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Dec 12, 2025, 06:42:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వివో ఎక్స్​200 సిరీస్ అరంగేట్రం చేసినప్పటి నుంచి మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. ఇక ఇప్పుడు, పలు మీడియా నివేదికల ప్రకారం ఈ సిరీస్​లో కొత్త స్మార్ట్​ఫోన్​ లాంచ్​కు రెడీ అవుతోందని తెలుస్తోంది. దాని పేరు వివో ఎక్స్​200టీ. ఫ్లాగ్‌షిప్ పవర్​ని, సరసమైన ధరను బ్యాలెన్స్ చేసే పరికరం కోసం వేచి చూస్తున్న వారికి, ఇది ఒక మంచి ఆప్షన్​ కావచ్చు. ఈ స్మార్ట్​ఫోన్​ గురించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వివో ఎక్స్​200టీ.. (Representative image)
వివో ఎక్స్​200టీ.. (Representative image)

వివో ఎక్స్​200టీ లాంచ్ టైమ్‌లైన్..

టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ అందించిన వివరాల ప్రకారం.. వివో ఎక్స్​200టీ స్మార్ట్‌ఫోన్ 2026 జనవరి నెలాఖరులో భారతదేశంలో విడుదల కానుంది.

2026లో మార్కెట్​లో అనేక కొత్త స్మార్ట్​ఫోన్స్​ లాంచ్​కానున్నాయి. ఈ సమయంలోనే ఈ ఎక్స్​200టీని విడుదల చేయడం వ్యూహాత్మకంగా నిర్ణయం! దీని ద్వారా, ఇటీవల లాంచ్ అయిన ఎక్స్​300 సిరీస్, ఎక్స్​200టీ మోడల్స్‌ మధ్య తగినంత గ్యాప్​ లభిస్తుంది. ఫలితంగా, వివో అమ్మకాలను గరిష్ఠంగా పెంచుకోవచ్చు.

వివో ఎక్స్​200టీ నుంచి ఏంమి ఆశించవచ్చు?

మీడియా నివేదికల్లో అత్యంత ఆసక్తికరమైన సమాచారం ఏంటంటే.. ఈ ఫోన్ పొజీషనింగ్​! ఎక్స్​200టీని "ఎక్స్​200, ఎక్స్​200 ఎఫ్​ఈల కలయిక" గా అభివర్ణిస్తున్నారు.

ఈ హైబ్రిడ్ సిద్ధాంతం నిజమైతే, ఎక్స్​200 ఎఫ్​ఈ నుంచి కాంపాక్ట్, సౌకర్యవంతమైన డిజైన్‌ను, ఎక్స్​200 నుంచి శక్తివంతమైన పెర్ఫార్మెన్స్ డీఎన్​ఏని ఈ ఎక్స్​200టీ తీసుకుంటుంది.

  • 6830ఎంఏహెచ్​ బ్యాటరీతో రియల్​మీ కొత్త స్మార్ట్​ఫోన్​! పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇందులో ZEISS-బ్రాండెడ్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉండే అవకాశం ఉంది. అయితే, ఇది ప్రధానంగా పెర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తుంది.

సాధారణంగా ఉండే 90డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు, ఇందులో పెద్ద బ్యాటరీని ఆశించవచ్చు. బహుశా, ఇది ఎక్స్​​200ఎఫ్​ఈలో ఉన్న బ్యాటరీ పరిమాణానికి దగ్గరగా ఉండొచ్చు.

వివో ఎక్స్​200టీ- ధర..

ఇది ఇటీవల లాంచ్ అయిన ఫ్లాగ్‌షిప్ ఎక్స్​300 సిరీస్ కంటే, అలాగే ఎక్స్​200 కంటే కూడా తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం, వివో సంస్థలో ఎక్స్​200 ఎఫ్​ఈ ఫ్లాగ్‌షిప్‌ రూ. 54,999 ధరతో అందుబాటులో ఉంది. కాబట్టి, వివో ఎక్స్​200టీ ధర కూడా దాదాపు అదే స్థాయిలో లేదా కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉంది.

2026 ప్రారంభంలో ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే, దీని గురించి పూర్తి వివరాలు ఇంకా గోప్యంగా ఉన్నాయి. ఈ ఫోన్ నిజంగా మార్కెట్లోకి వస్తే, ఇది ఒక ఆసక్తికరమైన ఎంపిక అవుతుంది. మీరు ఒక ప్రీమియం మిడ్-రేంజ్ ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే, వివో ఎక్స్​200టీ కోసం మరికొంత కాలం వేచి చూడటం మంచిదేమో!

రానున్న రోజుల్లో ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వంటి వాటిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More