వివో నుంచి సరికొత్త స్మార్ట్​ఫోన్స్​- ఇండియా లాంచ్​, ధరల వివరాలు..

వివో నుంచి సరికొత్త స్మార్ట్​ఫోన్స్ లాంచ్​కు రెడీ అవుతున్నాయి. అవి వివో వీ70 సిరీస్​ (ఇందులో రెండు గ్యాడ్జెట్స్​ ఉంటాయి), వివో ఎక్స్​200టీ, వివో ఎక్స్​300ఎఫ్​ఈ. వీటి ఇండియా లాంచ్​, ధరలు ఆన్​లైన్​లో లీక్​ అయ్యాయి. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Dec 20, 2025, 16:01:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో తన నెక్ట్స్​ జన్​ స్మార్ట్​ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. 2026 ప్రారంభంలో వివో వీ70 సిరీస్, వివో ఎక్స్​200టీ, వివో ఎక్స్​300 ఎఫ్​ఈ మోడళ్లను కంపెనీ పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఫోన్లు అధికారికంగా లాంచ్ కాకముందే వీటికి సంబంధించిన ధరలు, ఫీచర్లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.

వివో నుంచి కొత్త స్మార్ట్​ఫోన్స్​ వచ్చేస్తున్నాయి.. (Representative image)
వివో నుంచి కొత్త స్మార్ట్​ఫోన్స్​ వచ్చేస్తున్నాయి.. (Representative image)

ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ అందించిన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ల లాంచ్ ఎప్పుడు ఉండవచ్చు? ధరలు ఎలా ఉండబోతున్నాయి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వివో కొత్త స్మార్ట్​ఫోన్స్​- భారత్‌లో లాంచ్ ఎప్పుడు?

లీకైన వివరాల ప్రకారం.. వివో తన వీ70, వీ70 ఎలైట్, ఎక్స్​200టీ మోడళ్లను 2026 జనవరి చివరిలో భారత్‌లో లాంచ్ చేసే అవకాశం ఉంది. అక్కడి నుంచి మరికొంత కాలానికి వివో ఎక్స్​300 ఎఫ్​ఈ స్మార్ట్​ఫోన్​ మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది.

లీకైన ధరల వివరాలు (అంచనా):

టిప్‌స్టర్ సమాచారం ప్రకారం, ఈ ఫోన్ల ధరలు సుమారుగా ఇలా ఉండవచ్చు..

వివో వీ70: రూ. 45,000

వివో వీ70 ఎలైట్: రూ. 50,000

వివో ఎక్స్​200టీ: రూ. 55,000

వివో ఎక్స్​300 ఎఫ్​ఈ: రూ. 60,000

అయితే, ఇవి కేవలం అంచనా ధరలు మాత్రమేనని, ఫోన్ లాంచ్ సమయంలో వీటిలో మార్పులు ఉండవచ్చని గమనించాలి.

వివో కొత్త స్మార్ట్​ఫోన్​- ఫీచర్లు, కలర్​ ఆప్షన్స్​..

కలర్స్​: వివో వీ70 మోడల్ రెడ్ (ఎరుపు), ఎల్లో (పసుపు) రంగుల్లో లభించే అవకాశం ఉంది.

స్టోరేజ్: ఈ ఫోన్ 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఒకే వేరియంట్‌లో రావచ్చని తెలుస్తోంది. అయితే, అంతర్జాతీయంగా (ఎఫ్​సీసీ లిస్టింగ్ ప్రకారం) ఇది 12జీబీ ర్యామ్ వేరియంట్‌లోనూ కనిపించింది.

సాఫ్ట్‌వేర్: ఈ స్మార్ట్​ఫోన్ ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌పై పనిచేస్తుంది. ఇందులో 5జీ, బ్లూటూత్, ఎన్​ఎఫ్​సీ, వై-ఫై వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి.

పవర్ ఫుల్ ప్రాసెసర్: ఇటీవల గీక్‌బెంచ్ లిస్టింగ్‌లో ఈ స్మార్ట్​ఫోన్ 'వీ2538' మోడల్ నంబర్‌తో కనిపించింది. దీని ప్రకారం, ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో రానుంది. సింగిల్ కోర్ టెస్టింగ్‌లో 1,235 పాయింట్లు, మల్టీ కోర్ టెస్టింగ్‌లో 3,920 పాయింట్లను ఈ ఫోన్ సాధించింది. ఇది భారతీయ నాణ్యత ప్రమాణాల సంస్థ (బీఐఎస్​) వెబ్‌సైట్‌లో కూడా కనిపించడంతో భారత్‌లో దీని విడుదల ఖాయమని తెలుస్తోంది.

వివో ఎక్స్​200టీ స్మార్ట్​ఫోన్​ ఎలా ఉండబోతోంది?

మీడియా నివేదికల్లో అత్యంత ఆసక్తికరమైన విషయం.. ఈ ఫోన్ పొజీషనింగ్​! ఎక్స్​200టీని "ఎక్స్​200, ఎక్స్​200 ఎఫ్​ఈల కలయిక" గా సంస్థ తీసుకురావొచ్చని అంచనాలు ఉన్నాయి.

ఇది నిజమైతే.. ఎక్స్​200 ఎఫ్​ఈ నుంచి కాంపాక్ట్, సౌకర్యవంతమైన డిజైన్‌ను, ఎక్స్​200 నుంచి శక్తివంతమైన పెర్ఫార్మెన్స్ డీఎన్​ఏని ఈ ఎక్స్​200టీ తీసుకుంటుంది.

ఇందులో ZEISS-బ్రాండెడ్ ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఇది ప్రధానంగా పెర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యత ఇస్తుంది.

సాధారణంగా ఉండే 90డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు, ఇందులో పెద్ద బ్యాటరీని ఆశించవచ్చు. బహుశా, ఇది ఎక్స్​​200ఎఫ్​ఈలో ఉన్న బ్యాటరీ పరిమాణానికి దగ్గరగా ఉండొచ్చు.

పూర్తి వివరాల తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More