9000ఎంఏహెచ్ బ్యాటరీతో వన్‌ప్లస్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్.. అతి త్వరలో లాంచ్!
వన్‌ప్లస్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ లాంచ్‌కు రెడీ అవుతోంది. ఈ సిరీస్ పేరు టర్బో. ఇందులోని స్మార్ట్‌ఫోన్‌లో 9000ఎంఏహెచ్ బడా బ్యాటరీ ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వన్‌ప్లస్ నుంచి సరికొత్త 'టర్బో' సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు రాబోతున్నాయి! పర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్‌కు పెద్దపీట వేస్తూ తయారవుతున్న ఈ ఫోన్‌ల గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌లు 2026 జనవరిలోనే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది!

వన్‌ప్లస్ ఇప్పటికే 'టర్బో' పేరుతో ఒక కొత్త సిరీస్‌పై పనిచేస్తున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. ఈ సిరీస్ ద్వారా వినియోగదారులకు అత్యుత్తమ గేమింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ని, తిరుగులేని బ్యాటరీ పవర్‌ను అందించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌కి సంబంధించి ఇప్పటివరకు లీకైన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకోండి..
9,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ!
ప్రముఖ టిప్‌స్టర్ 'డిజిటల్ చాట్ స్టేషన్' అందించిన సమాచారం ప్రకారం.. వన్‌ప్లస్ టర్బో స్మార్ట్‌ఫోన్‌లో ఏకంగా 9,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండబోతోంది. ఒప్పో లేదా వన్‌ప్లస్ సంస్థల నుంచి వస్తున్న ఫోన్లలో ఇంత పెద్ద బ్యాటరీ ఉండటం ఇదే మొదటిసారి. చార్జింగ్ వేగాన్ని పెంచడానికి, ఫోన్ వేడెక్కకుండా చూడటానికి ఇందులో 'డ్యూయల్-సెల్' డిజైన్‌ను వాడతారని సమాచారం.
వన్‌ప్లస్ టర్బో స్మార్ట్‌ఫోన్- కీలక ఫీచర్లు (అంచనా)..
కేవలం బ్యాటరీ మాత్రమే కాకుండా, ఈ వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌ఫోన్‌లో మిగతా ఫీచర్లు కూడా అద్భుతంగా ఉంటాయని లీకులు చెబుతున్నాయి. అవి..
డిస్‌ప్లే: 165హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వచ్చే స్క్రీన్ వల్ల గేమింగ్, వీడియోలు చాలా స్మూత్‌గా ఉంటాయి.
ప్రాసెసర్: ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్‌ను వాడే అవకాశం ఉంది.
మరో వేరియంట్: ఇదే సిరీస్‌లో మరో మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ప్రాసెసర్‌తో వచ్చే ఛాన్స్ ఉంది!
వన్‌ప్లస్ టర్బో స్మార్ట్‌ఫోన్- ఎప్పుడు లాంచ్ అవుతుంది?
నివేదికల ప్రకారం.. ఈ టర్బో సిరీస్ 2026 జనవరి మొదటి వారాల్లోనే చైనాలో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే భారత్ సహా ఇతర దేశాల్లో ఎప్పుడు లాంచ్ అవుతుంది? అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
వన్‌ప్లస్ టర్బో స్మార్ట్‌ఫోన్స్- ధర, ఇతర వివరాలు..
వన్‌ప్లస్ టర్బో సిరీస్ ఫోన్లు ప్రస్తుత వన్‌ప్లస్ 15, వన్‌ప్లస్ 15ఆర్ మోడల్స్‌కు అదనంగా వస్తాయి. కంపెనీ వీటిని ఫ్లాగ్‌షిప్ మోడల్స్ కంటే కొంచెం తక్కువ ధరలోనే అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. పర్ఫార్మెన్స్ అంటే ఇష్టపడే యువతను ఆకట్టుకోవడమే లక్ష్యంగా వన్‌ప్లస్ ఈ అడుగులు వేస్తోంది.
వన్‌ప్లస్ 15ఆర్ వర్సెస్ వన్‌ప్లస్ 15..
మరోవైపు వన్‌ప్లస్ 15ఆర్ని సంస్థ ఇటీవలే లాంచ్ చేసింది. అయితే, ఇప్పటికే మార్కెట్లో ఉన్న కంపెనీ టాప్ మోడల్ వన్‌ప్లస్ 15తో పోలిస్తే ఈ కొత్త గ్యాడ్జెట్ ఎంతవరకు మెరుగ్గా ఉంది?
ప్రాసెసర్, పర్ఫార్మెన్స్..
వన్‌ప్లస్ 15: ఈ స్మార్ట్‌ఫోన్‌లో అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ ఉంది. ఇది భారీ గేమ్స్, మల్టీ టాస్కింగ్‌ను చాలా వేగంగా హ్యాండిల్ చేస్తుంది.
వన్‌ప్లస్ 15ఆర్: ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌ను వాడారు. దీనిని మిడ్-రేంజ్, ప్రీమియం ఫోన్ల కోసం రూపొందించారు. పాత మోడళ్లతో పోలిస్తే ఇది 38% మెరుగైన వేగంతో పాటు ఏఐ ప్రాసెసింగ్‌లో 46% వృద్ధిని కనబరుస్తుందని కంపెనీ చెబుతోంది. గేమింగ్ కోసం ఇందులో ప్రత్యేకమైన ‘సీపీయూ షెడ్యూలర్’ కూడా ఉంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


