OnePlus 15R vs OnePlus 15 : బ్యాటరీ, కెమెరాలో బెస్ట్​.. ఈ స్మార్ట్​ఫోన్స్​లో ఏది కొనాలి?

వన్‌ప్లస్ 15ఆర్​ వర్సెస్​ వన్‌ప్లస్ 15: ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఎందులో ఫీచర్లు ఎక్కువ? దేని ధర తక్కువ? పర్ఫార్మెన్స్​లో తేడాలు ఏంటి? ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

Published on: Dec 19, 2025, 09:10:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్, తన 'ఆర్​' సిరీస్‌లో సరికొత్త మోడల్ వన్‌ప్లస్ 15ఆర్​ని భారత మార్కెట్లో ఇటీవలే విడుదల చేసింది. గతంలో వచ్చిన వన్‌ప్లస్ 13ఆర్​కి సక్సెసర్​గా వచ్చిన ఈ ఫోన్​లో.. ప్రాసెసర్, బ్యాటరీ, డిస్‌ప్లే విభాగాల్లో కీలక మార్పులు కనిపించాయి. అయితే, ఇప్పటికే మార్కెట్లో ఉన్న కంపెనీ టాప్ మోడల్ వన్‌ప్లస్ 15తో పోలిస్తే ఈ కొత్త గ్యాడ్జెట్​ ఎంతవరకు మెరుగ్గా ఉందో ఇప్పుడు చూద్దాము..

వన్‌ప్లస్ 15ఆర్​ వర్సెస్​ వన్‌ప్లస్ 15 (OnePlus)
వన్‌ప్లస్ 15ఆర్​ వర్సెస్​ వన్‌ప్లస్ 15 (OnePlus)

వన్​ప్లస్​ 15ఆర్​ వర్సెస్​ వన్​ప్లస్​ 15- ప్రాసెసర్, పర్ఫార్మెన్స్..

వన్‌ప్లస్ 15: ఈ స్మార్ట్​ఫోన్​లో అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్‌సెట్ ఉంది. ఇది భారీ గేమ్స్, మల్టీ టాస్కింగ్‌ను చాలా వేగంగా హ్యాండిల్ చేస్తుంది.

వన్‌ప్లస్ 15ఆర్​: ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌ను వాడారు. దీనిని మిడ్-రేంజ్, ప్రీమియం ఫోన్ల కోసం రూపొందించారు. పాత మోడళ్లతో పోలిస్తే ఇది 38% మెరుగైన వేగంతో పాటు ఏఐ ప్రాసెసింగ్‌లో 46% వృద్ధిని కనబరుస్తుందని కంపెనీ చెబుతోంది. గేమింగ్ కోసం ఇందులో ప్రత్యేకమైన ‘సీపీయూ షెడ్యూలర్’ కూడా ఉంది.

వన్​ప్లస్​ 15ఆర్​ వర్సెస్​ వన్​ప్లస్​ 15- బ్యాటరీ, ఛార్జింగ్..

బ్యాటరీ విషయంలో వన్‌ప్లస్ 15ఆర్​ స్వల్ప ఆధిక్యంలో ఉంది.

వన్‌ప్లస్ 15ఆర్​: ఇందులో 7,400ఎంఏహెచ్​ భారీ బ్యాటరీ ఉంది. ఇది 80డబ్ల్యూ సూపర్ వూక్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది.

వన్‌ప్లస్ 15: ఇందులో 7,300ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంది. అయితే ఇది వేగవంతమైన 120డబ్ల్యూ ఛార్జింగ్‌తో వస్తుంది.

అయితే, ఈ రెండు ఫోన్ల బాక్సుల్లోనూ ఛార్జర్ లభించదు! విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

వన్​ప్లస్​ 15ఆర్​ వర్సెస్​ వన్​ప్లస్​ 15- డిస్‌ప్లే..

రెండు ఫోన్లూ అదిరిపోయే విజువల్స్ అందిస్తాయి.

వన్‌ప్లస్ 15ఆర్​: 6.83 ఇంచ్​ 1.5కే అమోఎల్​ఈడీ స్క్రీన్‌తో వస్తుంది.

వన్‌ప్లస్ 15: 6.76 ఇంచ్​ స్క్రీన్ ఉంటుంది. రెండింటిలోనూ 165హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల యాప్స్ వాడేటప్పుడు లేదా గేమ్స్ ఆడేటప్పుడు స్క్రీన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది.

వన్​ప్లస్​ 15ఆర్​ వర్సెస్​ వన్​ప్లస్​ 15- కెమెరా సెటప్..

కెమెరా విభాగంలో వన్‌ప్లస్ 15 స్పష్టమైన విజేతగా నిలుస్తుంది.

వన్‌ప్లస్ 15: ఇందులో వెనుకవైపు మూడు 50ఎంపీ కెమెరాలు (మెయిన్, అల్ట్రావైడ్, 3.5x పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్) ఉన్నాయి. దూరంగా ఉన్న వస్తువులను క్లారిటీగా తీయడానికి ఇది బెస్ట్!

వన్‌ప్లస్ 15R: ఇందులో టెలిఫోటో లెన్స్‌ను తొలగించి, కేవలం రెండు కెమెరాలను (50ఎంపీ మెయిన్ + 8ఎంపీ అల్ట్రావైడ్) మాత్రమే అందించారు. ఫోటోల నాణ్యత బాగున్నప్పటికీ, జూమింగ్ సదుపాయం తక్కువగా ఉంటుంది.

వన్​ప్లస్​ 15ఆర్​ వర్సెస్​ వన్​ప్లస్​ 15- ఏది బెస్ట్​?

మీకు భారీ బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే, లేటెస్ట్ మిడ్-రేంజ్ ప్రాసెసర్ సరిపోతాయి అనుకుంటే వన్‌ప్లస్ 15ఆర్​ మంచి ఆప్షన్​. అలా కాకుండా, మీకు అద్భుతమైన కెమెరా క్వాలిటీ, అత్యంత వేగవంతమైన ఛార్జింగ్, పవర్‌ఫుల్ గేమింగ్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే వన్‌ప్లస్ 15 స్మార్ట్​ఫోన్​వైపు మొగ్గు చూపడం ఉత్తమం. నిర్ణయం తీసుకునే ముందు మీ బడ్జెట్‌ను కూడా దృష్టిలో ఉంచుకోండి!

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More