10,080ఎంఏహెచ్​ భారీ బ్యాటరీ, 50ఎంపీ కెమెరాతో హానర్​ కొత్త స్మార్ట్​ఫోన్​!

హానర్ పవర్ 2 స్పెసిఫికేషన్లు ఆన్​లైన్​లో లీక్ అయ్యాయి. ఈ స్మార్ట్​ఫోన్​ 10,080ఎంఏహెచ్​ భారీ బ్యాటరీ, 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌, 50ఎంపీ కెమెరాతో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే..

Published on: Dec 17, 2025, 09:02:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హానర్​కి చెందిన ‘పవర్​’ అనే స్మార్ట్​ఫోన్​ చైనాలో ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్​ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ గ్యాడ్జెట్​కి సంబంధించిన సక్సెసర్​ని మార్కెట్​లోకి తీసుకొచ్చేందుకు దిగ్గజ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ రెడీ అవుతోందని తెలుసతోంది. ఈ క్రమంలోనే హానర్​ పవర్​ 2కి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు, విడుదల టైమ్‌లైన్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీక్​ అయ్యాయి.

హానర్​ పవర్​ స్మార్ట్​ఫోన్​.. (Honor Power)
హానర్​ పవర్​ స్మార్ట్​ఫోన్​.. (Honor Power)

పలు నివేదికల ప్రకారం.. టెక్ సంస్థ హానర్ పవర్ 2ను వచ్చే ఏడాది జనవరిలో చైనాలో విడుదల చేయనుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 80డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన భారీ 10,080ఎంఏహెచ్​ భారీ బ్యాటరీ ఉంటుందని సమాచారం. దీని మునుపటి మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ చిప్ ఉండగా, హానర్ పవర్ 2 మాత్రం మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎస్​ఓసీ ద్వారా పనిచేస్తుందని రూమర్​ ఉంది.

హానర్ పవర్ 2- స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా)..

డిజిటల్ చాట్ స్టేషన్ అనే టిప్‌స్టర్.. "సేబర్" అనే కోడ్‌నేమ్‌తో ఉన్న ఒక స్మార్ట్‌ఫోన్ ముఖ్య స్పెసిఫికేషన్లను లీక్ చేశారు. ఇందులో చిప్‌సెట్, డిస్‌ప్లే, రంగులు, బ్యాటరీ వివరాలు ఉన్నాయి. గిజ్‌మోచైనా నివేదిక ప్రకారం.. ఈ వివరాలు హానర్ పవర్ 2కు సంబంధించినవి కావచ్చు!

డిస్‌ప్లే: హానర్ పవర్ 2 6.79-ఇంచ్​ ఎల్​టీపీఎస్​ ఫ్లాట్ డిస్‌ప్లే తో రావచ్చు. ఇది 1.5కే (1,200x2,640 పిక్సెల్స్) రిజల్యూషన్‌ను అందించే అవకాశం ఉంది.

ప్రాసెసర్: ఈ స్మార్ట్​ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8500 చిప్‌సెట్‌తో పనిచేయవచ్చు.

బ్యాటరీ, ఛార్జింగ్: టిప్‌స్టర్ తెలిపిన వివరాల ప్రకారం, హానర్ పవర్ 2లో 10,080ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. దీనికి 80డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

కెమెరా: ఫోటోలు, వీడియోల కోసం, వెనుక వైపు 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ కెమెరా ఉండవచ్చు.

కలర్స్​: హానర్ పవర్ 2 స్నో వైట్, మిడ్‌నైట్ బ్లాక్, సన్‌రైజ్ ఆరెంజ్ రంగులలో కొనుగోలుకు అందుబాటులో ఉండవచ్చు.

టెక్ సంస్థ ఈ స్మార్ట్​ఫోన్ లాంచ్​ డేట్​ని ఇంకా ధృవీకరించనప్పటికీ, ఇది మిడ్-రేంజ్ విభాగంలో ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాకుండా, ఇది జనవరి 2026లో చైనాలో విడుదల అవుతుందని నివేదికలు సూచిస్తున్నాయి.

అయితే, పైన పేర్కొన్న వివరాలన్నీ రూమర్లు మాత్రమే కాబట్టి, వాటిని కేవలం అంచనాగా మాత్రమే పరిగణించాలి.

ఈ స్పెసిఫికేషన్లు నిజమైతే, హానర్ పవర్ 2 వివిధ విభాగాల్లో, ముఖ్యంగా బ్యాటరీ సామర్థ్యం పరంగా గణనీయమైన అప్‌గ్రేడ్‌లను అందిస్తుంది.

హానర్ పవర్ స్మార్ట్​ఫోన్​లో 66డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 8,000ఎంఏహెచ్​ భారీ బ్యాటరీ ఉంది. ఇది క్వాల్కమ్ ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌తో పాటు అడ్రినో 720 జీపీయూ, 12జీబీ వరకు ర్యామ్, 512జీబీ వరకు ఇంటర్నల్​ స్టోరేజీతో అందుబాటులోకి వచ్చింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More