రెండు రోజుల్లో OnePlus 15R లాంచ్​- అతిపెద్ద బ్యాటరీతో! ధర, ఫీచర్స్​ లీక్​..

వన్​ప్లస్​ సంస్థ నుంచి వన్​ప్లస్​ 15ఆర్​ స్మార్ట్​ఫోన్​ ఇంకో రెండు రోజుల్లో ఇండియాలో లాంచ్​కానుంది. ఇది 7400ఎంఏహెచ్​ అతిపెద్ద బ్యాటరీతో అందుబాటులోకి వస్తుంది. లాంచ్​కి ముందే ధర, ఫీచర్స్​ లీక్​ అయ్యాయి. ఆ వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Dec 15, 2025 4:01 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వన్‌ప్లస్ సంస్థ తన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ లైనప్‌ను విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా డిసెంబర్ 17న భారతదేశంలో వన్‌ప్లస్ 15ఆర్​ను విడుదల చేయనుంది. చైనాలో ఇటీవలే లాంచ్ అయిన వన్‌ప్లస్ ఏస్ 6టీ బేస్ డిజైన్ నుంచి వన్‌ప్లస్ 15ఆర్ ప్రేరణ పొందినప్పటికీ, భారతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఈ స్మార్ట్​ఫోన్​కు కంపెనీ మార్పులు చేసిందని పరిశ్రమ నివేదికలు సూచిస్తున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో, ఈ కొత్త గ్యాడ్జెట్​ ధర , ముఖ్య ఫీచర్ల గురించి కొత్త వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. వాటిని ఇక్కడ చూసేయండి..

వన్​ప్లస్​ 15ఆర్​- రెండు రోజుల్లో లాంచ్​..
వన్​ప్లస్​ 15ఆర్​- రెండు రోజుల్లో లాంచ్​..

వన్​ప్లస్​ 15ఆర్​ ఇండియా లాంచ్​..

టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ షేర్​ చేసిన పోస్ట్ ప్రకారం, వన్‌ప్లస్ 15ఆర్ రెండు స్టోరేజ్ ఆప్షన్లతో భారత మార్కెట్‌లోకి ప్రవేశిస్తుంది:

బేస్ వేరియంట్: 12జీబీ ర్యామ్​, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో కూడిన బేస్ వెర్షన్ ధర రూ. 45,999- రూ. 46,999 మధ్య ఉండే అవకాశం ఉంది.

టాప్​ వేరియంట్: 12జీబీ ర్యామ్​, 512జీబీ స్టోరేజ్‌తో కూడిన హైయర్ వేరియంట్ ధర సుమారు రూ. 51,999 వరకు ఉండవచ్చు.

బ్యాంకు ఆఫర్‌లు ఇందులో చేర్చలేదని టిప్‌స్టర్ పేర్కొన్నారు. సేల్​ సమయంలో, కొనుగోలుదారులు ఎంచుకున్న చెల్లింపు ఆప్షన్ల ద్వారా రూ. 3,000 నుంచి రూ. 4,000 వరకు అదనపు డిస్కౌంట్స్​ లభించే అవకాశం ఉంది. ఈ స్మార్ట్​ఫోన్‌ను చార్‌కోల్ బ్లాక్, మింటీ గ్రీన్ అనే రెండు రంగులలో అందించడానికి వన్‌ప్లస్ ప్లాన్ చేస్తోంది.

వన్‌ప్లస్ 15ఆర్: స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..

వన్‌ప్లస్ 15ఆర్ గురించిన కొన్ని వివరాలను సంస్థ ఇప్పటికే ధృవీకరించింది. అవి..

ఈ స్మార్ట్​ఫోన్​ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. క్వాల్కమ్ సరికొత్త చిప్‌ను ఉపయోగించిన ప్రపంచంలోని మొదటి ఫోన్‌లలో వన్‌ప్లస్ 15ఆర్ ఒకటిగా నిలవనుంది. వేగం, విద్యుత్ వినియోగంపై దృష్టి సారించి ఈ ప్లాట్‌ఫారమ్‌ను మెరుగుపరచడానికి దాదాపు రెండేళ్లుగా క్వాల్కమ్‌తో కలిసి పనిచేసినట్లు వన్‌ప్లస్ తెలిపింది.

ఈ వన్‌ప్లస్ 15ఆర్ ఫుల్ హెచ్​డీ+ రిజల్యూషన్‌తో కూడిన 6.83-ఇంచ్​ అమోలెడ్ స్క్రీన్‌ను కలిగి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. 165హెచ్​జెడ్​ రి​ఫ్రెష్ రేట్‌కు ఈ గ్యాడ్జెట్​ సపోర్ట్​ చేస్తుందని కంపెనీ ధృవీకరించింది. ఇది వన్‌ప్లస్ 15లో ఉపయోగించిన ప్రమాణానికి సరిపోతుంది. స్క్రోలింగ్, గేమింగ్ సమయంలో స్థిరమైన స్క్రీన్ ప్రతిస్పందనను అందించడం దీని లక్ష్యం అని కంపెనీ చెబుతోంది.

బ్యాటరీ పరిమాణం మరో ముఖ్యమైన అంశం! వన్‌ప్లస్ 15ఆర్ లో 7,400 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుందని వన్‌ప్లస్ ధృవీకరించింది. ఈ సామర్థ్యం మునుపటి వన్‌ప్లస్ 14ఆర్ మోడల్, ప్రస్తుత వన్‌ప్లస్ 15 రెండింటినీ మించిపోయింది!

ఈ ఫోన్ 80డబ్ల్యూ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, అధికారిక ఛార్జింగ్ సమయ వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

ఫోటోగ్రఫీ కోసం, ఈ వన్​ప్లస్​ 15ఆర్​లో ట్రిపుల్-కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్​తో కూడిన 50ఎంపీ మెయిన్ సెన్సార్, 8ఎంపీ వైడ్-యాంగిల్ లెన్స్ ఉండవచ్చు. సెల్ఫీలు, వ్లాగింగ్ కోసం ముందు భాగంలో 32ఎంపీ కెమెరా కూడా ఉండే అవకాశం ఉంది.

ఐపీ66, ఐపీ68, ఐపీ69, ఐపీ69కే వంటి బహుళ రక్షణ రేటింగ్‌లతో ఈ ఫోన్​ వస్తుందని లీక్స్​ సూచించాయి.

ఈ వన్​ప్లస్​ 15ఆర్​కి సంబంధించిన మరిన్ని వివరాలు లాంచ్​ నాటికి అందుబాటులోకి వస్తాయి.