ప్రత్యేక ఏఐ ఫీచర్లు, 50ఎంపీ ఫ్రెంట్ కెమెరాతో మోటోరోలా ఎడ్జ్ 70- ధర ఎంతంటే..
ప్రత్యేక ఏఐ ఫీచర్లు, 50ఎంపీ ఫ్రెంట్ కెమెరాతో మోటోరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. ఈ నేపత్యంలో ఈ గ్యాడ్జెట్ ధర, లాంచ్ ఆఫర్లు సహా పూర్తి వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
మోటోరోలా సంస్థ భారతదేశంలో తమ ప్రజాదరణ పొందిన ‘ఎడ్జ్’ సిరీస్‌ను విస్తరిస్తూ, కొత్త స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. దాని పేరు మోటోరోలా ఎడ్జ్ 70 5జీ. ఇది ప్రస్తుతం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇది మూడు స్టైలిష్ ప్యాంటోన్ రంగుల ఆప్షన్లలో లభిస్తుంది. దీని ధర, స్పెసిఫికేషన్లు, ప్రత్యేక ఫీచర్లపై ఒక లుక్కేద్దాము..

మోటోరోలా ఎడ్జ్ 70- ధర, లభ్యత, ఆఫర్లు..
ధర: మోటోరోలా ఎడ్జ్ 70 ధర భారతదేశంలో రూ. 29,999గా ఉంది.
వేరియంట్: కంపెనీ దీనిని కేవలం ఒకే కాన్ఫిగరేషన్‌లో విడుదల చేసింది: 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్.
బ్యాంక్ ఆఫర్: ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేసే వినియోగదారులు రూ. 1,000 తగ్గింపును పొందవచ్చు!
అవైలబులిటీ: ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్, మోటరోలా ఇండియా అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కొనుగోలుకు లభిస్తుంది.
కలర్స్: ఇది ప్యాంటోన్ బ్రాంజ్ గ్రీన్, ప్యాంటోన్ గాడ్జెట్ గ్రే, ప్యాంటోన్ లిల్లీ ప్యాడ్ అనే మూడు రంగుల్లో అందుబాటులో ఉంది.
మోటోరోలా ఎడ్జ్ 70: ఫీచర్స్..
మోటోరోలా ఎడ్జ్ 70 ఒక అద్భుతమైన విజువల్ అనుభవాన్ని అందిస్తుంది. ఇందులో 6.7 ఇంచ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. దీని రిజల్యూషన్ 1.5కే. ఈ డిస్‌ప్లే 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో చాలా మృదువుగా పనిచేస్తుంది. అలాగే, పీక్ బ్రైట్‌నెస్ ఏకంగా 4,500 నిట్స్ వరకు ఉంటుంది. స్క్రీన్‌కు రక్షణగా గొరిల్లా గ్లాస్ 7iని అందించారు.
ఇది హెచ్డీఆర్10+, డాల్బీ విజన్ టెక్నాలజీలకు సపోర్ట్ చేస్తుంది. అంటే వీడియో క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌కి ఐపీ68, ఐపీ69 రేటింగ్‌లు ఉన్నాయి. వాటర్ అండ్ డస్ట్ నుంచి పూర్తి రక్షణను అందిస్తుంది. అంతేకాక, ఇది మిలటరీ-గ్రేడ్ ప్రమాణాలైన MIL-STD-810H ను కూడా అందుకుంటుంది.
ఈ డివైజ్ శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్‌తో నడుస్తుంది. దీనికి 8జీబీ LPDDR5x ర్యామ్, 256జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ జత చేశారు.
ఈ మోటోరోలా ఎడ్జ్ 70 ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. దీనిపైన మోటరోలా సొంత హెలో యూఐ ఉంటుంది. మోటోరోలా దీనికి మూడు ప్రధాన ఆండ్రాయిడ్ వెర్షన్ అప్‌డేట్‌లు, నాలుగు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఇస్తామని హామీ ఇచ్చింది.
మోటోరోలా ఎడ్జ్ 70- కెమెరా ఫీచర్లు..
ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.
- 50 మెగాపిక్సెల్స్ ప్రధాన సెన్సార్ (ఐఓఎస్ సపోర్ట్‌తో)
- 50 మెగాపిక్సెల్స్ అల్ట్రా-వైడ్ కెమెరా
- మూడవది, 3-ఇన్-1 లైట్ సెన్సార్
ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో కూడా శక్తివంతమైన 50 మెగాపిక్సెల్స్ కెమెరా ఉంది.
ఈ మోటోరోలా ఎడ్జ్ 70 స్మార్ట్‌ఫోన్ 4కే రిజల్యూషన్‌లో 60ఎఫ్‌పీఎస్ వద్ద వీడియోలను రికార్డ్ చేయగలదు.
కాగా ఫోటోగ్రఫీ, వీడియో రికార్డింగ్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ప్రత్యేక టూల్స్‌ను కూడా మోటోరోలా జోడించింది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 68డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు, 15డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. నిరంతర వీడియో ప్లేబ్యాక్‌లో ఈ బ్యాటరీ 31 గంటల వరకు లైఫ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
మోటోరోలా ఎడ్జ్ 70- ప్రత్యేక ఏఐ ఫీచర్స్..
ఈ మోటోరోలా ఎడ్జ్ 70లో మోటో ఏఐ ఫీచర్లను సంస్థ చేర్చింది. వీటిలో Next Move, Catch Me Up 2.0, Pay Attention 2.0, Remember This with Recall, Co-pilot వంటి అధునాతన ఫంక్షన్లు ఉన్నాయి.














