డబుల్ ధమాకా: అదిరే ఫీచర్లతో రెడ్‌మీ నోట్ 15, రెడ్‌మీ ప్యాడ్ 2 ప్రో లాంచ్.. ధర ఎంతంటే?
షావోమీ భారత్‌లో రెడ్‌మీ నోట్ 15 5జీ, రెడ్‌మీ ప్యాడ్ 2 ప్రోను విడుదల చేసింది. స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్, 108ఎంపీ కెమెరా, హైపర్ ఓఎస్ 3 వంటి అత్యాధునిక ఫీచర్లు వీటి సొంతం. రూ. 22,999 నుంచి ప్రారంభమయ్యే ఈ డివైజ్‌లు జనవరి 9 నుంచి అందుబాటులోకి వస్తాయి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
మొబైల్ ప్రియులకు షావోమీ అదిరిపోయే కొత్త ఏడాది కానుకను అందించింది. భారత మార్కెట్లోకి తన మోస్ట్ అవేటెడ్ 'రెడ్‌మీ నోట్ 15 5జీ' స్మార్ట్‌ఫోన్‌తో పాటు శక్తివంతమైన 'రెడ్‌మీ ప్యాడ్ 2 ప్రో' ట్యాబ్లెట్‌ను మంగళవారం విడుదల చేసింది. మధ్యతరగతి వినియోగదారుల బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని, క్వాల్కమ్ లేటెస్ట్ చిప్‌సెట్‌లతో వీటిని రూపొందించింది సంస్థ. ఈనేపథ్యంలో ఈ గ్యాడ్జెట్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

రెడ్‌మీ నోట్ 15 5జీ: స్టైల్ అండ్ పర్ఫార్మెన్స్ అదిరింది!
షావోమీ తన ఐకానిక్ నోట్ సిరీస్‌లో భాగంగా తీసుకొచ్చిన ఈ కొత్త ఫోన్ పర్ఫార్మెన్స్‌లో దుమ్మురేపుతోంది! ఈ రెడ్‌మీ నోట్ 15 స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌ను వాడారు. పాత మోడళ్లతో పోలిస్తే ఇది 30శాతం మెరుగైన సీపీయూ పర్ఫార్మెన్స్‌ను, 10 శాతం మెరుగైన గ్రాఫిక్స్‌ను అందిస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.
హైపర్ ఐలాండ్ ఫీచర్: ఈ ఫోన్ షావోమీ లేటెస్ట్ ‘హైపర్ ఓఎస్ 3’పై నడుస్తుంది. ఇందులో ప్రత్యేకంగా 'హైపర్ ఐలాండ్' అనే ఫీచర్‌ను పరిచయం చేశారు. ఇది చూడటానికి యాపిల్ డైనమిక్ ఐలాండ్‌లా ఉంటూ.. విడ్జెట్స్, ఫ్లోటింగ్ విండోస్ వంటి వాటిని సులువుగా యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది.
రెడ్‌మీ నోట్ 15- డిస్‌ప్లే, డిజైన్..
స్క్రీన్: ఈ రెడ్‌మీ నోట్ 15 స్మార్ట్‌ఫోన్‌లో 6.77 ఇంచ్ కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లే. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 3,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ దీని ప్రత్యేకత.
హైడ్రో టచ్ 2.0: చేతులు తడిగా ఉన్నా సరే ఫోన్ స్క్రీన్ స్పందనలో ఎలాంటి ఇబ్బంది ఉండదు.
స్లిమ్: ఐపీ66 రేటింగ్‌తో వాటర్, డస్ట్ నుంచి రక్షణ లభిస్తుంది. కేవలం 7.35ఎంఎం మందంతో ఇప్పటివరకు వచ్చిన రెడ్‌మీ నోట్ ఫోన్లన్నింటిలోకి ఇది అత్యంత సన్నని ఫోన్‌గా నిలిచింది.
కలర్స్: బ్లాక్, మిస్ట్ పర్పుల్, గ్లేసియర్ బ్లూ రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది.
రెడ్‌మీ నోట్ 15 5జీ- కెమెరా, బ్యాటరీ..
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం ఇందులో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అమర్చారు. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్ట్ ఉంది. సాంసంగ్ హెచ్ఎన్9 సెన్సార్ వల్ల తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన ఫోటోలు వస్తాయి. ఇందులో ఏఐ ఎరేజ్ వంటి ఫీచర్లు ఫోటో ఎడిటింగ్‌ను మరింత సులభం చేస్తాయి.
బ్యాటరీ అండ్ ఛార్జింగ్: రోజంతా నిరంతరాయంగా వాడుకునేందుకు 5,520ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఇచ్చారు. 45డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఒకటిన్నర రోజుకు పైగా బ్యాటరీ వస్తుందని కంపెనీ చెబుతోంది.
రెడ్‌మీ నోట్ 15- ధరలు..
8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్: రూ. 22,999
8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్: రూ. 24,999
రెడ్‌మీ ప్యాడ్ 2 ప్రో: పనికీ.. వినోదానికీ సరైన జోడి!
రెడ్‌మీ నోట్ 15తో పాటు షావోమీ.. రెడ్‌మీ ప్యాడ్ 2 ప్రో అనే పవర్‌ఫుల్ ట్యాబ్లెట్‌ను కూడా లాంచ్ చేసింది.
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 4 చిప్‌సెట్.
వేరియంట్స్: ఇది వై-ఫై , 5జీ సెల్యులార్ మోడళ్లలో అందుబాటులో ఉంటుంది.
రెడ్‌మీ ప్యాడ్ 2 ప్రో ధరలు:
- 8జీబీ + 128జీబీ (వైఫై): రూ. 24,999
- 8జీబీ + 128జీబీ (5జీ): రూ. 27,999
- 8జీబీ + 256జీబీ (5జీ): రూ. 29,999
జనవరి 9వ తేదీ నుంచి షావోమీ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, రిటైల్ స్టోర్లలో ఈ రెండు గ్యాడ్జెట్స్ అందుబాటులో ఉంటాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


