‘పాస్‌కీ’ ఎన్‌క్రిప్షన్‌తో.. ఇకపై వాట్సాప్ చాట్ బ్యాకప్ మరింత భద్రం!
వినియోగదారుల చాట్ హిస్టరీ భద్రత కోసం సరికొత్త పాస్‌కీ ఆధారిత ఎన్‌క్రిప్షన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది వాట్సాప్. ఈ కొత్త సదుపాయంతో వినియోగదారులు ఇకపై పాస్‌వర్డ్‌పై ఆధారపడకుండా, తమ ఫోన్లలో ఉన్న ఫింగర్‌ప్రింట్, ఫేస్ రికగ్నిషన్ లేదా స్క్రీన్ లాక్ ఉపయోగించి బ్యాకప్‌లను రక్షించుకోవచ్చు.
వాట్సాప్ తన వినియోగదారుల భద్రతను మరింత పెంచే దిశగా మరో అడుగు వేసింది! చాట్ బ్యాకప్‌లను సురక్షితంగా ఉంచేందుకు పాస్‌కీ (Passkey) ఆధారిత ఎన్‌క్రిప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఈ వాట్సాప్ కొత్త అప్‌డేట్ వల్ల వినియోగదారులు తమ గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్లలో సేవ్ చేసిన బ్యాకప్‌లను తమ ఫోన్‌లో ఇప్పటికే ఉన్న సెక్యూరిటీ సిస్టమ్ (ఫింగర్‌ప్రింట్, ఫేస్ రికగ్నిషన్, స్క్రీన్ లాక్)తో అనుసంధానించవచ్చు! అంటే, కేవలం ఒక్కసారి ట్యాప్ చేయడం లేదా స్క్రీన్‌పై ఒక చూపుతోనే బ్యాకప్‌ను భద్రపరచవచ్చు. ఆ తర్వాత దాన్ని సులభంగా పునరుద్ధరించుకోవచ్చు.
ఫోన్ పోయినా లేదా మార్చినా కూడా బ్యాకప్‌లు ప్రైవేట్‌గా ఉంటాయని వాట్సాప్ చెబుతోంది.
ఈ అప్‌డేట్ వల్ల వినియోగదారులకు ప్రయోజనం ఏంటి?
వ్యక్తిగత సందేశాలు, కాల్స్‌ను రక్షించే వాట్సాప్ అంతర్గత ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ వ్యవస్థకు ఈ మార్పు అదనపు బలాన్ని చేకూరుస్తుంది. ఇప్పటివరకు, గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్‌లో తమ బ్యాకప్‌లను ఎన్‌క్రిప్ట్ చేయాలనుకునే వినియోగదారులు ప్రత్యేక పాస్‌వర్డ్‌ను సృష్టించి, దాన్ని గుర్తుంచుకోవాల్సిన లేదా 64-అంకెల కీని మాన్యువల్‌గా స్టోర్ చేయాల్సిన అవసరం ఉండేది.
పాస్‌కీ ఆప్షన్‌తో ఎన్‌క్రిప్షన్ నేరుగా డివైజ్‌లోని ప్రస్తుత భద్రతా వ్యవస్థతో ముడిపడి ఉంటుంది. దీని ద్వారా సంక్లిష్టమైన ఎన్‌క్రిప్షన్ వివరాలను నిర్వహించే ఇబ్బంది లేకుండానే సంవత్సరాల తరబడి చేసిన చాట్‌లు, ఫోటోలు, వాయిస్ నోట్‌లను సులభంగా సురక్షితం చేసుకోవచ్చు!
వాట్సాప్ చాట్ పాస్‌కీలను ఎలా యాక్టివేట్ చేయాలి?
ఈ కొత్త ఫీచర్ రాబోయే కొద్ది వారాలు లేదా నెలల్లో దశలవారీగా వినియోగదారులందరికీ చేరుతుంది.
- వినియోగదారులు ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వాలి:
- సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.
- చాట్స్ ఎంచుకోవాలి.
- చాట్ బ్యాకప్ పై ప్రెస్ చేయాలి.
- అక్కడ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్ ఆప్షన్ ద్వారా దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు.
వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఎలా పనిచేస్తుంది?
వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ వల్ల సందేశాలు, కాల్‌లు పంపేవారికి, స్వీకరించేవారికి మాత్రమే కనిపిస్తాయి. ప్రతి సందేశం ఒక ప్రత్యేకమైన డిజిటల్ కీతో లాక్ అవుతుంది. ఆ కీని వాట్సాప్ కూడా యాక్సెస్ చేయలేదు! ఈ వ్యవస్థ ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. దీనికి ఎలాంటి మాన్యువల్ సెటప్ అవసరం లేదు.
బిజినెస్ చాట్‌లు, డేటా విధానాలు..
బిజినెస్ అకౌంట్‌లకు పంపిన సందేశాలు కూడా అదే సిగ్నల్ ఎన్‌క్రిప్షన్ ప్రొటోకాల్ ఉపయోగించి ఎన్‌క్రిప్ట్ అవుతాయి. అవి వినియోగదారుడి డివైజ్ నుంచి బయటకు వెళ్లేముందే సురక్షితంగా ఉంటాయి.
అయితే, ఒక వ్యాపార ఖాతా ఆ సందేశాన్ని స్వీకరించిన తర్వాత, ఆ సందేశాన్ని వారు ఎలా నిర్వహిస్తారనేది ఆ కంపెనీ గోప్యతా విధానాలపై ఆధారపడి ఉంటుందని వాట్సాప్ స్పష్టం చేసింది. కొన్ని వ్యాపారాలు తమ ఉద్యోగులు లేదా బయటి విక్రేతలకు సందేశాలను చూడటానికి లేదా ప్రతిస్పందించడానికి అనుమతించవచ్చు. అంతేకాకుండా, మెటా ప్లాట్‌ఫారమ్‌లలో మార్కెటింగ్ లేదా అడ్వర్టైజింగ్ ప్రయోజనాల కోసం చాట్ డేటాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది.
ఈ కొత్త పాస్‌కీ ఎన్‌క్రిప్షన్ అప్‌డేట్, వినియోగదారులకు అధిక భద్రతను, మెరుగైన సౌలభ్యాన్ని అందించి, వారి వ్యక్తిగత సమాచారం మరింత సురక్షితంగా ఉండేలా చేస్తుందని వాట్సాప్ పేర్కొంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


