IPL 2026: ముంబయి ఇండియన్స్‌కు షాక్.. కెప్టెన్‌గా సూర్య‌కుమార్.. హార్దిక్ పాండ్య‌కు ఏమైంది? ఢిల్లీతో మ్యాచ్‌కు దూరం

IPL 2026: ఐపీఎల్ 2026లో ముంబయి ఇండియన్స్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌కు హార్దిక్ పాండ్య దూరమయ్యాడు. దీంతో సూర్యకుమార్ యాదవ్ జట్టు పగ్గాలు చేపట్టాడు. టాస్ గెలిచిన అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నారు.

Published on: Apr 4, 2026, 15:43:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌కు భారీ షాక్ తగిలింది. శనివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్య దూరమయ్యాడు. అతని స్థానంలో టీ20 ప్రపంచకప్ విన్నింగ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఐదు సార్లు ఛాంపియన్ అయిన ముంబయి జట్టును నడిపిస్తున్నాడు.

హార్దిక్ పాండ్య (AP)
హార్దిక్ పాండ్య (AP)

హార్దిక్ కు ఏమైంది?

శనివారం (ఏప్రిల్ 4) ఐపీఎల్ 2026 మధ్యాహ్నం మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో ముంబయి ఇండియన్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్ కు ముందు టాస్ సమయంలో హార్దిక్ పాండ్య బదులు సూర్యకుమార్ మైదానంలోకి రావడంతో అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. హార్దిక్ కు ఏమైంది? అని కంగారు పడ్డారు.

హార్దిక్ ఆరోగ్యంపై సూర్య అప్‌డేట్

టాస్ ముగిసిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ హార్దిక్ గైర్హాజరీపై స్పష్టతనిచ్చాడు. "హార్దిక్ ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ రోజు ఆడే పరిస్థితిలో లేడు. అందుకే నేను కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నా’’ అని సూర్య పేర్కొన్నాడు.

టాస్ గెలిచిన ఢిల్లీ

ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముంబయిని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఢిల్లీ తన జట్టులో ఎలాంటి మార్పులు చేయకుండా గత మ్యాచ్ ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది.

ముంబయి టీమ్ ఇలా

ముంబయి ఇండియన్స్ మాత్రం తమ తుది జట్టులో కీలక మార్పులు చేసింది. హార్దిక్ స్థానంలో స్వింగ్ బౌలర్ దీపక్ చాహర్ జట్టులోకి వచ్చారు. అలాగే ట్రెంట్ బౌల్ట్ స్థానంలో కోర్బిన్ బాష్, ఘజన్ఫర్ స్థానంలో మిచెల్ శాంట్నర్ తుది జట్టులో చేరారు.

విజయం తెచ్చిన జోష్

ఐపీఎల్ వచ్చిందంటే ఫస్ట్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ ఓడిపోవడం అలవాటుగా ఉండేది. కానీ ఈ ఐపీఎల్ 2026లో సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న 'ఓపెనింగ్ మ్యాచ్' విజయాన్ని ముంబయి అందుకుంది. ఈసారి కేకేఆర్ మీద గెలిచి 13 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది.

తుది జట్లు ఇవే:

ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్ (కీపర్), పాతుమ్ నిస్సంక, నితీష్ రాణా, అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, విప్రాజ్ నిగమ్, లుంగి ఎంగిడి, కుల్దీప్ యాదవ్, టి నటరాజన్, ముఖేష్ కుమార్.

ఇంపాక్ట్ సబ్స్: అశుతోష్ శర్మ, ఆకిబ్ నబీ దార్, సమీర్ రిజ్వీ, కరుణ్ నాయర్.

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్ (కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), నమన్ ధీర్, రూథర్‌ఫోర్డ్, మిచెల్ శాంట్నర్, కోర్బిన్ బాష్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా.

ఇంపాక్ట్ సబ్స్: మయాంక్ మార్కండే, రాబిన్ మింజ్, రాజ్ బావా, ట్రెంట్ బౌల్ట్, అశ్విని కుమార్.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా ఎందుకు దూరమయ్యాడు?

హార్దిక్ పాండ్యా అనారోగ్యం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఫిట్‌గా లేకపోవడంతో విశ్రాంతినిచ్చినట్లు మేనేజ్‌మెంట్ తెలిపింది.

హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో ముంబయి జట్టు కెప్టెన్ ఎవరు?

హార్దిక్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ముంబయి ఇండియన్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

ముంబయి ఇండియన్స్ తుది జట్టులో జరిగిన ప్రధాన మార్పులు ఏమిటి?

హార్దిక్ బదులు దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్ స్థానంలో కోర్బిన్ బాష్, అల్లా ఘజన్ఫర్ స్థానంలో మిచెల్ శాంట్నర్ జట్టులోకి వచ్చారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More