ప్రముఖ ఎఫ్‌ఎమ్‌సీజీ సంస్థ విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్.. దేశీయ పెంపుడు జంతువుల ఆహార (పెట్ ఫుడ్) విభాగంలోకి అడుగుపెట్టింది. ‘స్నగుల్స్’ (Snuggles) పేరుతో ప్రీమియం పెట్ న్యూట్రిషన్ బ్రాండ్‌ను బుధవారం హైదరాబాద్ వేదికగా లాంచ్ చేసింది. అంతర్జాతీయ శునకాల దినోత్సవం (ఇంటర్నేషనల్ డాగ్ డే) సందర్భంగా ఈ కొత్త బ్రాండ్‌ను విపణిలోకి తీసుకొచ్చినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక ఫార్ములా

భారతీయ మార్కెట్లో తొలిసారిగా 'కిబుల్ విత్ ఫ్రీజ్-డ్రైడ్ చికెన్ చంక్స్' (Kibble with freeze-dried chicken chunks) కాంబినేషన్‌లో ఈ పొడి ఆహారాన్ని తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. మనుషులు తినే నాణ్యత కలిగిన (Human-grade) పదార్థాలు, సమతుల్య పోషకాలు, ఉత్తమ రుచితో పెంపుడు జంతువుల ఆరోగ్యానికి మేలు చేసేలా దీనిని రూపొందించారు. దాదాపు రూ. 5,500 కోట్లకు పైగా విలువ కలిగిన భారత పెట్ ఫుడ్ పరిశ్రమలో తమ ఉనికిని విస్తరించేందుకు విప్రో వేసిన తొలి అడుగు ఇది.
మారుతున్న పెంపకం సరళి.. పెరిగిన డిమాండ్
ప్రస్తుతం దేశంలో పెంపుడు జంతువులను సొంత పిల్లల తరహాలోనే సాకే ధోరణి బాగా పెరిగింది. మన దేశంలోని పెట్ పేరెంట్స్‌లో 67 శాతం మంది తొలిసారి పెంపుడు జంతువులను పెంచుకుంటున్నవారే కావడం గమనార్హం. జంతువుల ఆరోగ్యం, శారీరక పెరుగుదలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న తరుణంలో, శాస్త్రీయంగా రూపొందించిన నాణ్యమైన ఆహారానికి ఆదరణ పెరుగుతోంది.
ఈ క్రమంలో అర్హత కలిగిన వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో, ఆధునిక ఆవిష్కరణల ల్యాబ్‌లలో స్నగుల్స్ ఉత్పత్తులను సుదీర్ఘంగా పరీక్షించి సిద్ధం చేశారు. ఇందులో కండరాల వృద్ధికి కావాల్సిన ప్రోటీన్, మెదడు, కంటి చూపును మెరుగుపరిచే డీహెచ్‌ఏ (DHA), విటమిన్-ఎ, జీర్ణక్రియను మెరుగుపరిచే ప్రిబయోటిక్స్, పోస్ట్‌బయోటిక్స్‌తో పాటు చర్మం ఆరోగ్యంగా, మెరిసేలా చేసే ఒమేగా 3, 6, సాల్మన్ ఆయిల్ కాంబినేషన్‌ను అందించారు.
అనుభవజ్ఞులైన నిపుణుల నేతృత్వంలో..
"భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న పెట్ ఫుడ్ విభాగంలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. పెంపుడు జంతువుల పెంపకం విధానంలో వేగంగా మార్పులు వస్తున్నాయి. మెరుగైన పోషకాలు, విశ్వసనీయ పదార్థాలతో కూడిన ఉత్పత్తులను అందుబాటు ధరల్లో అందించేందుకు ఇక్కడ విస్తృత అవకాశాలు ఉన్నాయి. విప్రో సేల్స్, పంపిణీ నెట్‌వర్క్ సహాయంతో స్నగుల్స్ను అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్‌గా తీర్చిదిద్దుతాం" అని విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్ ఫుడ్స్ బిజినెస్ ప్రెసిడెంట్, న్యూ బిజినెస్ సీఓఓ అనిల్ చుగ్ తెలిపారు.
{{/usCountry}}"భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న పెట్ ఫుడ్ విభాగంలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. పెంపుడు జంతువుల పెంపకం విధానంలో వేగంగా మార్పులు వస్తున్నాయి. మెరుగైన పోషకాలు, విశ్వసనీయ పదార్థాలతో కూడిన ఉత్పత్తులను అందుబాటు ధరల్లో అందించేందుకు ఇక్కడ విస్తృత అవకాశాలు ఉన్నాయి. విప్రో సేల్స్, పంపిణీ నెట్‌వర్క్ సహాయంతో స్నగుల్స్ను అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్‌గా తీర్చిదిద్దుతాం" అని విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్ ఫుడ్స్ బిజినెస్ ప్రెసిడెంట్, న్యూ బిజినెస్ సీఓఓ అనిల్ చుగ్ తెలిపారు.
{{/usCountry}}"మారిన ఆహార అలవాట్లకు అనుగుణంగా శాస్త్రీయ దృక్పథంతో, హ్యూమన్ గ్రేడ్ పదార్థాలతో స్నగుల్స్ ఫార్ములాను రూపొందించాం. వెటర్నరీ నిపుణుల సలహాలతో భారత్‌లోని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇది లభిస్తుంది" అని విప్రో పెట్ కేర్ మేనేజింగ్ పార్ట్‌నర్ డాక్టర్ సౌరభ్ శేఖర్ పేర్కొన్నారు.
ధరలు, లభ్యత వివరాలు
స్నగుల్స్ బ్రాండ్ కింద ప్రాథమికంగా మూడు రకాల వేరియంట్లను (పప్పీ ఆల్ బ్రీడ్స్, అడల్ట్ స్మాల్ బ్రీడ్, అడల్ట్ మీడియం అండ్ లార్జ్ బ్రీడ్) విడుదల చేశారు. ఇవి 1 కిలో, 3 కిలోలు, 5 కిలోలు, 10 కిలోల ప్యాకెట్లలో లభిస్తాయి. 1 కిలో ప్యాకెట్ ప్రారంభ ధరను రూ. 530గా నిర్ణయించారు.
ఇవి పెట్ రిటైల్ స్టోర్లు, వెటర్నరీ క్లినిక్‌లు, సూపర్‌మార్కెట్లు, ఈ-కామర్స్, క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి. 2.9 బిలియన్ డాలర్ల విలువైన విప్రో ఎంటర్‌ప్రైజెస్‌లో భాగమైన విప్రో కన్స్యూమర్ కేర్, ఎఫ్‌ఎమ్‌సీజీ విభాగంలో ఎఫ్‌వై25-26 నాటికి రూ. 10,800 కోట్ల రాబడిని సాధించింది. తన విస్తృత పంపిణీ నెట్‌వర్క్ ద్వారా ఈ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా విక్రయించనుంది.