IPL 2026 Qualifier 2 : ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్‌లో భాగంగా మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన హై-వోల్టేజ్ క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (జీటీ) క్లినికల్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టింది. రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్యాన్ని గుజరాత్ కేవలం 3 వికెట్లు కోల్పోయి, మరో 8 బంతులు మిగిలి ఉండగానే, (18.4 ఓవర్లలో 219/3) అలవోకగా ఛేదించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెరుపు సెంచరీతో జట్టును ముందుండి నడిపించాడు.

ఈ విజయంతో గుజరాత్ ఫైనల్లోకి దూసుకెళ్లగా.. మే 31న జరిగే గ్రాండ్ ఫినాలేలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుతో హోమ్ గ్రౌండ్ అహ్మదాబాద్‌లో తలపడనుంది.
క్వాలిఫైయర్-2 మ్యాచ్ పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాము..
1. వైభవ్ సూర్యవంశీ సంచలన బ్యాటింగ్..
టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఆరంభంలోనే మహ్మద్ సిరాజ్ (యశస్వి జైస్వాల్ 1), కాగిసో రబాడ (ధ్రువ్ జురెల్ 7) ధాటికి 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి రాజస్థాన్ తీవ్ర కష్టాల్లో పడింది. అనంతరం తేరుకుని తొలి ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు సాధించింది.
యువ సంచలనం: 15 ఏళ్ల వయసున్న రాయల్స్ యంగ్ ప్రాడిజీ వైభవ్ సూర్యవంశీ మైదానంలో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో ఏకంగా 96 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు.
మిడిల్ ఆర్డర్ మద్దతు: వైభవ్‌కు సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (35 బంతుల్లో 45 నాటౌట్) మంచి సహకారం అందించాడు. చివరిలో డోనోవన్ ఫెరీరా కేవలం 11 బంతుల్లో 4 సిక్సర్లతో వినాశకరమైన 38 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను ముగించాడు.
గుజరాత్ బౌలింగ్: గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో కాగిసో రబాడ, జేసన్ హోల్డర్ చెరో రెండు వికెట్లు తీశారు. రషీద్ ఖాన్‌కు వికెట్లు దక్కలేదు.
2. శుభ్‌మన్ గిల్ మాస్టర్ క్లాస్ సెంచరీ..
{{/usCountry}}గుజరాత్ బౌలింగ్: గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో కాగిసో రబాడ, జేసన్ హోల్డర్ చెరో రెండు వికెట్లు తీశారు. రషీద్ ఖాన్‌కు వికెట్లు దక్కలేదు.
2. శుభ్‌మన్ గిల్ మాస్టర్ క్లాస్ సెంచరీ..
{{/usCountry}}పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న వేళ, 215 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఆరంభం నుంచే బౌలర్లపై ఎదురుదాడికి దిగింది.
భారీ ఓపెనింగ్ భాగస్వామ్యం: ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ కలిసి మొదటి వికెట్‌కు ఏకంగా 167 పరుగుల రికార్డ్ పార్టనర్‌షిప్ నెలకొల్పారు. సాయి సుదర్శన్ 32 బంతుల్లో 58 పరుగులు చేసి హిట్-వికెట్ రూపంలో దురదృష్టవశాత్తూ అవుటయ్యాడు.
మరీ ముఖ్యంగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రాయల్స్ బౌలర్లను ముప్పాప్పలు పెట్టాడు. కేవలం 53 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 104 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. క్లాస్ డ్రైవ్‌లు, పవర్‌ఫుల్ పుల్ షాట్లతో మ్యాచ్‌ను వన్-సైడ్ చేసిన గిల్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
చివరిలో రాహుల్ తెవాటియా (17 నాటౌట్), జోస్ బట్లర్ (9 నాటౌట్)లు క్రీజులో ఉండి మ్యాచ్‌ను ముగించారు.
రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మాత్రమే 1 వికెట్ (1/45) తీయగలిగాడు.
మే 31న గుజరాత్ వర్సెస్ బెంగళూరు ఫైనల్ ఫైట్..
ఎలిమినేటర్ దాటుకుని క్వాలిఫైయర్-2 వరకు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన రాజస్థాన్ రాయల్స్ ఈ ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. క్వాలిఫైయర్-1 గెలిచి ఇప్పటికే ఫైనల్లో సేఫ్‌గా ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడేందుకు గుజరాత్ టైటాన్స్ సర్వం సిద్ధం చేసుకుంది. మే 31న జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన మజాను అందించనుంది.