మిడిల్ క్లాస్ బడ్జెట్ ధరలోని లిటిల్ ఎలక్ట్రిక్ స్కూటర్.. లోకల్‌గా తిరిగేందుకు రేంజ్ కూడా ఓకే!

బడ్జెట్ ధరలోనే ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఆలోచన ఉంటే మీ కోసం జెలియో ఈ ఉత్తమ ఈవీలను అందిస్తుంది. చాలా తక్కువ ధరలో ఈ కంపెనీ స్కూటీలను అందిస్తోంది.

Published on: Jun 16, 2025, 15:25:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు జెలియో ఈ మొబిలిటీ ఇటీవలే లిటిల్ గ్రేసీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. లిటిల్ గ్రేసీ మూడు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ. 49,500 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. అన్ని వయసులవారికి ఈ స్కూటర్లు సూట్ అవుతాయి.తక్కువ-వేగంతో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్ అని కంపెనీ చెబుతోంది.

జెలియో లిటిల్​ గ్రేసీ
జెలియో లిటిల్​ గ్రేసీ

ఈ కొత్త లిటిల్ గ్రేసీ ఎలక్ట్రిక్ స్కూటర్కు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఇందులో బ్యాటరీ కెపాసిటీ ఆధారంగా ధర, రేంజ్ ఉన్నాయి. వేరియంట్‌లు వాటి బ్యాటరీ ఆప్షన్స్ ద్వారా ఉంటాయి.

ధర, రేంజ్

60V/30AH లి-అయాన్ బ్యాటరీ కలిగిన స్కూటర్ ధర రూ. 58,000. 8 నుండి 9 గంటల ఛార్జింగ్ సమయంతో 70 నుండి 75 కి.మీ రేంజ్ అందిస్తుంది. అదేవిధంగా 60V/32AH లెడ్ యాసిడ్ బ్యాటరీ కలిగిన స్కూటర్ ధర రూ. 52,000. 7 నుండి 9 గంటల ఛార్జింగ్ సమయంతో 70 కి.మీ రేంజ్ ఇస్తుంది. 48V/32AH లెడ్ యాసిడ్ బ్యాటరీ కలిగిన స్కూటర్ ధర రూ. 49,500. 7 నుండి 8 గంటల్లో పూర్తి ఛార్జ్‌తో 55 నుండి 60 కి.మీ రేంజ్ వస్తుంది.

కలర్ ఆప్షన్స్

ప్రతి మోడల్‌లో 48/60V BLDC మోటార్ ఉంటుంది. బరువు 80 కిలోలు. దీని లోడింగ్ సామర్థ్యం 150 కిలోలు కూడా ఉంటుంది. నాలుగు ఆకర్షణీయమైన రంగుల కలయికలలో ఈ ఈవీ లభిస్తుంది. రోజ్, బ్రౌన్/క్రీమ్, వైట్/బ్లూ, ఎల్లో/గ్రీన్. ఇది హైడ్రాలిక్ సస్పెన్షన్, ముందు, వెనుక రెండింటిలోనూ డ్రమ్ బ్రేక్‌లను కూడా కలిగి ఉంది. లిటిల్ గ్రేసీ మోటార్, కంట్రోలర్, ఫ్రేమ్‌ను కవర్ చేసే రెండు సంవత్సరాల వారంటీతో వస్తుంది.

ఫీచర్లు

ఈ స్కూటర్లో డిజిటల్ మీటర్, యూఎస్‌బీ పోర్ట్, కీలెస్ డ్రైవ్, యాంటీ-థెఫ్ట్ అలారంతో సెంటర్ లాక్, రివర్స్ గేర్, పార్కింగ్ స్విచ్, ఆటో-రిపేర్ స్విచ్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి. దీని గరిష్ట వేగం గంటకు 25 కిలో మీటర్లు. 2025 చివరి నాటికి 1,000 ప్లస్ డీలర్‌షిప్‌లను కలిగి ఉండాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More