టీ20 వరల్డ్ కప్‌లో జింబాబ్వే మరో సంచలనం.. హోస్ట్ శ్రీలంకనూ చిత్తు చేసి అజేయంగా సూపర్ 8లోకి..

టీ20 వరల్డ్ కప్ లో జింబాబ్వే మరో సంచలనం సృష్టించింది. ఇప్పటికే ఆస్ట్రేలియాను ఓడించి సూపర్ 8లోకి అడుగుపెట్టిన ఆ టీమ్.. తాజాగా హోస్ట్ శ్రీలంకను కూడా చిత్తు చేసింది. దీంతో గ్రూప్ బి నుంచి ఓటమెరగని జట్టుగా నిలిచింది.

Published on: Feb 19, 2026 7:45 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జింబాబ్వే క్రికెట్ టీమ్ సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తోంది. టీ20 వరల్డ్ కప్ లో మొన్న ఆస్ట్రేలియా, ఇప్పుడు శ్రీలంకలను ఓడించింది. గురువారం (ఫిబ్రవరి 19) జరిగిన మ్యాచ్ లో శ్రీలంకపై ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. గ్రూప్ బి నుంచి నాలుగు మ్యాచ్ లలో మూడు విజయాలు, ఒక మ్యాచ్ రద్దవడంతో ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో సూపర్ 8లోకి దూసుకెళ్లింది.

టీ20 వరల్డ్ కప్‌లో జింబాబ్వే మరో సంచలనం.. హోస్ట్ శ్రీలంకనూ చిత్తు చేసి అజేయంగా సూపర్ 8లోకి.. (AP)
టీ20 వరల్డ్ కప్‌లో జింబాబ్వే మరో సంచలనం.. హోస్ట్ శ్రీలంకనూ చిత్తు చేసి అజేయంగా సూపర్ 8లోకి.. (AP)

జింబాబ్వే సంచలనం

జింబాబ్వే క్రికెట్ టీమ్ 2024లో జరిగిన టీ20 వరల్డ్ కప్ కు కనీసం అర్హత సాధించలేకపోయింది. కానీ ఈసారి మాత్రం ఏకంగా సూపర్ 8కు వెళ్లి సంచలనం సృష్టించింది. అది కాకుండా మొదట ఆస్ట్రేలియా, తర్వాత శ్రీలంకలను చిత్తు చేసి అసలు ఓటమెరగని జట్టుగా నిలిచింది. తాజాగా జరిగిన మ్యాచ్ లో ఏకంగా 179 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి మరో మూడు బంతులు మిగిలి ఉండగానే చేజ్ చేసింది. టీ20 క్రికెట్ లో జింబాబ్వేకు ఇది రెండో అత్యధిక చేజింగ్ కావడం విశేషం.

ఓపెనర్ బెన్నెట్ 48 బంతుల్లోనే 63 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక కెప్టెన్ సికందర్ రజా కూడా 26 బంతుల్లో 45 రన్స్ చేయడంతో శ్రీలంకకు ఓటమి తప్పలేదు. 19.3 ఓవర్లలో 4 వికెట్లకు 182 రన్స్ చేసి ఆరు వికెట్లతో విజయం సాధించింది.

శ్రీలంక ఇన్నింగ్స్ ఇలా..

ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ పథుమ్ నిస్సంక మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. కుశాల్ మెండిస్ కూడా క్రీజులో ఉన్నప్పటికీ వేగంగా పరుగులు సాధించలేకపోయాడు. పిచ్ నెమ్మదిగా ఉండటంతో శ్రీలంక బ్యాటర్లు భారీ షాట్లు ఆడటానికి ఇబ్బంది పడ్డారు.

అయితే ఇన్నింగ్స్ చివర్లో పవన్ రత్నాయకే కేవలం 25 బంతుల్లో 44 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించాడు. జింబాబ్వే బౌలర్లు బ్లెస్సింగ్ ముజరబానీ, గ్రేమ్ క్రీమర్ అత్యంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి శ్రీలంకను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. సూపర్ 8లో భాగంగా జింబాబ్వే టీమ్ ఫిబ్రవరి 26న టీమిండియాతో తలపడనుంది. ఆ టీమ్ ఫామ్ చూస్తుంటే.. సూర్యకుమార్ సేన వీళ్లతో కాస్త జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More