...
...
Next Story

Tirumala 121 kg Gold Donation : తిరుమల శ్రీవారికి రూ.207.6 కోట్ల బంగారు ఆభరణాలు - ఈ ఫొటోలు చూడండి

Tirumala gold donation 121 kg Photos : చెన్నై దాతల దంపతులు తిరుమల శ్రీవారికి 121 కిలోల 24 క్యారెట్ల బంగారు ఆభరణాలను సమర్పించారు. సీఎం చంద్రబాబు సమక్షంలో జరిగిన ఈ చారిత్రాత్మక కానుక విలువ రూ.207.6 కోట్లు. ఆభరణాల ఫొటోలను టీటీడీ విడుదల చేసింది.

Published on: Nov 26, 2026, 16:53:30 IST
Advertisement
<p>తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి రూ.207.6 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను చెన్నైకి చెందిన దాతల దంపతులు గురువారం సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలో ఇదో అరుదైన, చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది.</p>

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి రూ.207.6 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను చెన్నైకి చెందిన దాతల దంపతులు గురువారం సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలో ఇదో అరుదైన, చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో దాతలు శ్రీ వర్ధమాన్ జైన్, శ్రీమతి రాధికా జైన్ ఈ భారీ కానుకను స్వామివారికి అర్పించారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఉంచిన 46 బంగారు ఆభరణాలను ముఖ్యమంత్రి, దాతల దంపతులు, కుటుంబ సభ్యులు పరిశీలించారు. దాతల ఉదారతను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఆ తర్వాత దాతల కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు పళ్లెంలో ఆభరణాలను తలపై పెట్టుకుని ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేశారు. గర్భగుడిలోకి వెళ్లి స్వామివారి సన్నిధిలో ఆభరణాలను ఉంచి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

తిరుమల ఆలయం కోసం 33 రకాలకు చెందిన 46 బంగారు ఆభరణాలను రూపొందించేందుకు మొత్తం 121 కిలోల 24 క్యారెట్ల బంగారాన్ని వినియోగించారు. మేకింగ్ ఛార్జీలతో కలిపి ఈ 121 కిలోల బంగారం మొత్తం విలువ రూ.207.6 కోట్లుగా నిర్ధారించారు.

ఇందులో తిరుమల ఆలయ ఆభరణాల కోసం 106 కిలోల 24 క్యారెట్ల బంగారాన్ని వాడారు. మిగిలిన 15 కిలోల 24 క్యారెట్ల బంగారాన్ని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వస్త్రం తయారీ కోసం ఉపయోగిస్తారు.

బంగారంతో పాటు ఈ కానుకలో వజ్రాలు, విలువైన రత్నాలు కూడా ఉన్నాయి. మొత్తం వజ్రాల బరువు 238.2 క్యారెట్లు కాగా, విలువైన రత్నాలు 2,247.7 క్యారెట్లు ఉన్నాయి.

నీలమణులు 91.6 క్యారెట్లు, పసుపు నీలమణులు 84.2 క్యారెట్లు, కెంపులు, పచ్చలు కలిపి 2,916.5 గ్రాములు ఉన్నాయి. వీటితో పాటు సాలిగ్రామ రాళ్లను కూడా సమర్పించారు.

పాద కవచాలు – 2, అందెలు – 2, పొగడ – 1, తులసీ పత్ర పుష్పము – 1,,అష్టోత్తర శతనామ కాసుల హారం – 1,చతుర్భుజ లక్ష్మీ హారం – 1, పులిగోరు – 1, అష్టోత్తర పత్ర హారం ఒకటి ఉన్నాయి.

నర హారాలు – 1, గంటల మొలతాడు – 1,,సువర్ణ కంఠి – 1, కనక పుష్పము – 1, వైష్ణవం – 1, మొలచెయి – 1, కటి సూత్రం (సిల్వర్ ఫాయిల్) – 1, నాగాభరణ వడ్డాణం – 1, చైన్ – 1 ఉన్నట్లు టీటీడీ తెలిపింది.

ఇక అభయహస్తాల కంకణాలు – 5, చందనవంక కంఠి – 1, వైకుంఠ హస్తము ఒకటి, కత్తి హస్తము – 1, నాగాభరణ కడియాలు – 2, నాగాభరణాలు – 2, బాహువులు – 2, సాలిగ్రామ హారం (రెండు భాగాలు) – 2, కమలాల త్రిభుజ సాలిగ్రామ హారాలు (రెండు భాగాలు) – 2, సీమ కవచాలు – 1, శంఖ కవచం – 1, చక్ర కవచం – 1, ముత్యాల పూస – 1, కిరీటం ఒకటి ఉన్నాయి.

 

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks