...
...
Next Story

CJP protest : అడుగడుగునా బ్యారికేడ్లు, క్షణక్షణం తనిఖీలు- దిల్లీలో కనిపించని నిరసనకారులు! ఫొటోలు..

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ సీజేపీ తలపెట్టిన నిరసనలపై దిల్లీ పోలీసులు తమ ప్రతాపం చూపించారు! నగరంవ్యాప్తంగా అనేక ఆంక్షలు విధించారు, కీలక నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఫలితంగా జంతర్ మంతర్ ప్రాంగణం వద్ద బ్యారికేడ్లు తప్ప, నిరసనకారులు కనిపించడం లేదు.

Published on: Oct 10, 2026, 12:22:52 IST
Advertisement
<p>నిరసనల్లో పాల్గొనేందుకు ముంబై నుచి దిల్లీ వచ్చిన సీజేపీ ఫౌండర్​ అభిజీత్ దీప్కేని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం దిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టిన వెంటనే, విమానం లోపలికి వెళ్లిన మహిళా పోలీసులు.. దీప్కేని డీటైన్ చేస్తున్నట్టు తెలిపారు. మరో ఇద్దరు సీజేపీ సభ్యులను కూడా డీటైన్ చేశారు. వీరిని వేరువేరు డిటెన్షన్ క్యాంపుల్లో పెట్టారు.</p>

నిరసనల్లో పాల్గొనేందుకు ముంబై నుచి దిల్లీ వచ్చిన సీజేపీ ఫౌండర్​ అభిజీత్ దీప్కేని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం దిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టిన వెంటనే, విమానం లోపలికి వెళ్లిన మహిళా పోలీసులు.. దీప్కేని డీటైన్ చేస్తున్నట్టు తెలిపారు. మరో ఇద్దరు సీజేపీ సభ్యులను కూడా డీటైన్ చేశారు. వీరిని వేరువేరు డిటెన్షన్ క్యాంపుల్లో పెట్టారు.

సీజేపీ నిరసనల వేళ 26వేల మంది బలగాలు దిల్లీలోకి దిగినట్టు తెలుస్తోంది. జంతర్ మంతర్ నిరసన ప్రాంగణం వద్ద అడుగడుగునా బ్యారికేడ్లు వేశారు. అటువైపు ఎవరినీ వెళ్లనివ్వడం లేదు. ఎవరైనా వెళితే ఐడీ కార్డులు అడుగుతున్నారు. ఐడీ లేని వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. నిరసనల నేపథ్యంలో ఇండియా గేట్ వద్ద తీసిన ఫొటో ఇది.

దిల్లీవైపు వెళుతున్న ప్రతీ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునచ్చిన నిరసనల్లో పాల్గొన వద్దని సూచిస్తున్నారు. వాహనాల్లో యువకులు కనిపిస్తే మరిన్ని చర్యలు చేపడుతున్నారు. దిల్లీ- నోయిడా డైరక్ట్ ఫ్లైవే బార్డర్​ వద్ద తీసిని ఫొటో ఇది.

ఈ ఆందోళనకు పోలీసులు అనుమతి నిరాకరించడమే కాకుండా, నగరంలో ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా దిల్లీని ఉక్కు పిడికిట్లోకి తీసుకున్నారు! శనివారం ఉదయం నుంచే జంతర్ మంతర్ పరిసరాలు, కన్నాట్ ప్లేస్, పటేల్ చౌక్ మార్గాలు ఖాకీమయంగా మారిపోయాయి. మైకుల్లో హెచ్చరికలు చెబుతూ, కిలోమీటర్ల మేర బహుళ అంచెల బారికేడ్లు, కవాతు చేస్తున్న సైనిక బలగాలతో సెంట్రల్ దిల్లీ ఒక మిలిటరీ జోన్‌ను తలపిస్తోంది.

సీజేపీ నిరసనల్లో పాల్గొనేందుకు వెళ్లిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఇలా వాహనంలో పెట్టారు. జంతర్ మంతర్ వద్ద ఎవరు కనిపించినా పోలీసులు వెంటనే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks