...
...
Next Story

Google search : గూగుల్ సెర్చ్‌లో అదిరిపోయే ‘ఏఐ’ ఫీచర్లు.. విమాన టికెట్లు, హోటల్ బుకింగ్స్ ఇక మరింత ఈజీ!

విహారయాత్రలు ప్లాన్ చేసే ప్రయాణికుల కోసం గూగుల్ సెర్చ్‌లో సరికొత్త ఏఐ ఫీచర్లను అందుబాటులోకి వస్తున్నాయి. విమాన టికెట్ల ధరల ట్రాకింగ్, లాయల్టీ పాయింట్ల వినియోగం, నేరుగా హోటల్ బుకింగ్స్ చేసుకునే వెసులుబాటును ఈ కొత్త అప్‌డేట్‌తో పొందవచ్చు. ఆ వివరాలు..

Published on: Aug 31, 2026, 12:18:15 IST
Advertisement
<p>సెలవుల్లో కుటుంబంతో లేదా స్నేహితులతో కలిసి విదేశాలకో, ఇతర ప్రదేశాలకో వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే గంటల తరబడి రకరకాల ట్రావెల్ వెబ్‌సైట్లు తిరిగే పని లేకుండా గూగుల్ ఒక అద్భుతమైన సదుపాయాన్ని తీసుకొచ్చింది. విహారయాత్రలను ప్రయాణికులు ఎంతో సులభంగా ప్లాన్ చేసుకునేలా గూగుల్ తన సెర్చ్ ఏఐ మోడ్​లో సరికొత్త మార్పులను ఆవిష్కరించింది. ఈ కొత్త అప్‌డేట్‌తో విమాన టికెట్ల ధరల హెచ్చుతగ్గులను గమనించడం, నేరుగా హోటళ్లు బుక్ చేసుకోవడం క్షణాల్లో పూర్తవుతుంది. సాధారణంగా భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులు చౌకైన ఫ్లైట్ టికెట్లు, సరసమైన ధరల్లో హోటళ్ల కోసం ఎంతో సమయాన్ని వెచ్చిస్తుంటారు. గూగుల్ తీసుకొచ్చిన ఈ కొత్త ఏఐ ఫీచర్లు ప్రయాణికుల శ్రమను తగ్గించి, సమయాన్ని, డబ్బును ఆదా చేసేలా రూపొందాయి.</p>

సెలవుల్లో కుటుంబంతో లేదా స్నేహితులతో కలిసి విదేశాలకో, ఇతర ప్రదేశాలకో వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే గంటల తరబడి రకరకాల ట్రావెల్ వెబ్‌సైట్లు తిరిగే పని లేకుండా గూగుల్ ఒక అద్భుతమైన సదుపాయాన్ని తీసుకొచ్చింది. విహారయాత్రలను ప్రయాణికులు ఎంతో సులభంగా ప్లాన్ చేసుకునేలా గూగుల్ తన సెర్చ్ ఏఐ మోడ్​లో సరికొత్త మార్పులను ఆవిష్కరించింది. ఈ కొత్త అప్‌డేట్‌తో విమాన టికెట్ల ధరల హెచ్చుతగ్గులను గమనించడం, నేరుగా హోటళ్లు బుక్ చేసుకోవడం క్షణాల్లో పూర్తవుతుంది. సాధారణంగా భారతదేశం నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులు చౌకైన ఫ్లైట్ టికెట్లు, సరసమైన ధరల్లో హోటళ్ల కోసం ఎంతో సమయాన్ని వెచ్చిస్తుంటారు. గూగుల్ తీసుకొచ్చిన ఈ కొత్త ఏఐ ఫీచర్లు ప్రయాణికుల శ్రమను తగ్గించి, సమయాన్ని, డబ్బును ఆదా చేసేలా రూపొందాయి.

గతంలో ఫ్లైట్ టికెట్ల ధరలను పోల్చి చూసేందుకు ప్రత్యేకంగా అలర్ట్లు సెట్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏఐ మోడ్‌లో సెర్చ్ చేసే క్రమంలోనే నేరుగా ప్రైస్ అలర్ట్ సెట్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడికి, ఎప్పుడు వెళ్లాలనుకుంటున్నారో టైప్ చేస్తే చాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 300కు పైగా భాగస్వామ్య ఎయిర్‌లైన్స్, ట్రావెల్ సైట్ల డేటాను విశ్లేషించి ఏఐ అత్యుత్తమ ఆప్షన్లను చూపిస్తుంది.

ఒకవేళ ధర తగ్గేవరకూ ఆగాలనుకుంటే, ఆ విషయాన్ని ఏఐకి చెబితే చాలు. మీరు ఎంచుకున్న ప్రదేశానికి టికెట్ ధరలు తగ్గిన వెంటనే మీ ఇమెయిల్‌కు అలర్ట్ సందేశం వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా దేశాలు, ప్రాంతాలలో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.

క్రెడిట్ కార్డులు లేదా ఎయిర్‌లైన్ లాయల్టీ ప్రోగ్రామ్‌ల ద్వారా టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఇకపై ఆ అవసరం లేదు! ఏఐ మోడ్ సహాయంతో ఏ ప్రదేశానికి వెళ్లడానికి ఎన్ని పాయింట్లు లేదా మైళ్లు కావాలో స్పష్టంగా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం అలాస్కా ఎయిర్‌లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్, హిల్టన్ హానర్స్, విండ్‌హామ్ రివార్డ్స్ వంటి ప్రముఖ లాయల్టీ ప్రోగ్రామ్‌లు ఈ ఏఐ ఫీచర్‌తో అనుసంధానమయ్యాయి.

సెర్చ్ చేసిన తర్వాత వేరే వెబ్‌సైట్లకు వెళ్లే పనిలేకుండా, ఏఐ మోడ్‌లోనే నేరుగా హోటల్ గదులను సైతం బుక్ చేసుకునే సదుపాయాన్ని గూగుల్ కల్పించింది. ప్రయాణ తేదీలు, ప్రదేశం, ఎలాంటి హోటల్ కావాలో ఏఐకి వివరిస్తే సరిపోతుంది. బుకింగ్ డోట్ కామ్, ఎక్స్‌పీడియా, మారియట్ ఇంటర్నేషనల్, హిల్టన్, ఐహెచ్‌జీ వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన హోటల్ నెట్‌వర్క్‌ల నుంచి ఉత్తమమైన రూమ్‌లను ఏఐ ఎంచుకుని చూపిస్తుంది. ట్రావెల్ ఏజెంట్లపై ఆధారపడకుండా, సొంతంగా విహారయాత్రలను ప్లాన్ చేసుకోవాలనుకునే వారికి గూగుల్ ఏఐ మోడ్ ఒక విప్లవాత్మక మార్పు అని చెప్పవచ్చు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks