...
...
Next Story

Independence day : ఎర్రకోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు- ఫొటోలు..

దేశ రాజధాని దిల్లీలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వరుసగా 13వసారి.. ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈవెంట్​కి సంబంధించిన ఫొటోలను ఇక్కడ చూడండి..

Published on: Aug 15, 2026, 11:23:28 IST
Advertisement
<p>80వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో శనివారం ఉదయం దిల్లీ ఎర్రకోటలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. </p>

80వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో శనివారం ఉదయం దిల్లీ ఎర్రకోటలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ చారిత్రక వేడుకలకు వివిధ రంగాల నుంచి సుమారు 5,000 మంది ప్రత్యేక అతిథులు హాజరయ్యారు! మహిళా పారిశ్రామికవేత్తలు, యువ ఆవిష్కర్తలు, రైతులు, వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఈ లిస్ట్​లో ఉన్నారు. ముద్రా యోజన లబ్ధిదారులు, అంతర్జాతీయ యోగా దినోత్సవ స్వచ్ఛంద సేవాకులు, స్వచ్ఛ భారత్ సిబ్బంది, ఉత్తమ ప్రతిభ ప్రదర్శించిన మెట్రో కార్మికులు, కర్తవ్య పథ్ కార్మికులు ఎర్రకోట వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే లక్ష్యతో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. దేశ భవిష్యత్తును మార్చే దిశగా ‘సప్తధార’ పేరిట సరికొత్త సంస్కరణల ఫ్రేమ్‌వర్క్‌ను ఆవిష్కరించారు. ప్రాచీన కాలంలో 'సప్త సింధు' ఏ విధంగా దేశ శక్తి సామర్థ్యాలకు ప్రతీకగా నిలిచిందో గుర్తుచేసిన ప్రధాని, ఇప్పుడు వికసిత్ భారత్ నిర్మాణానికి అదే తరహాలో 'సప్తధార' శక్తి అవసరమని పేర్కొన్నారు.

సాయుధ నక్సలిజం అంతరించిపోయినప్పటికీ, సమాజంలో 'దిమాగి నక్సల్స్' రూపంలో కొత్త ముప్పు పొంచి ఉందని ప్రధాని మోదీ హెచ్చరించారు. అలాంటి ఆలోచనలు ఉన్నవారిని గుర్తించి సమాజం నుంచి వేరుచేయాలని, దేశ భద్రత, పురోగతి విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. అయితే.. దిమాగి నక్సల్స్ అంటే ఏంటి? దిమాగి నక్సల్స్ అంటే ఎవరు? అన్న ప్రశ్నలకు మోదీ స్పష్టత ఇవ్వలేదు.

80వ స్వాతంత్య్ర వేడుకల కోసం మోదీ.. రాజస్థానీ, గుజరాత్ సంప్రదాయాన్ని తలపించే ఎరుపు రంగు టై-అండ్-డై తలపాగను ధరించారు. తెల్లటి కుర్తా, చాక్లెట్ బ్రౌన్ వెస్ట్‌ సహా త్రివర్ణ పతాక రంగులను పోలిన మూడు పాకెట్ స్క్వేర్లను ఆయన ధరించారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe