...
...
Next Story

IRCTC Godavari Temple Tour : గోదావరి టెంపుల్ టూర్ - హైదరాబాద్ నుంచి IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు

IRCTC Godavari Temple Tour Package : హైదరాబాద్ నుంచి అన్నవరం, కోనసీమ ఆధ్యాత్మిక క్షేత్రాల దర్శనానికి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 4 రోజుల ఈ ప్రయాణం ప్రతి శుక్రవారం అందుబాటులో ఉంటుంది.

Published on: Oct 24, 2026, 16:52:21 IST
Advertisement
<p>తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను, ఉభయ గోదావరి జిల్లాల సౌందర్యాన్ని తక్కువ సమయంలో, సౌకర్యవంతంగా దర్శించుకోవాలనుకునే ఆధ్యాత్మిక భక్తుల కోసం…. IRCTC అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. 'గోదావరి టెంపుల్ టూర్' (Godavari Temple Tour) పేరుతో రూపొందించిన ఈ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా గోదావరి తీరంలో వెలసిన అత్యంత మహిమాన్వితమైన దేవాలయాలను, కోనసీమ ప్రకృతి అందాలను సందర్శించవచ్చు.</p><p> </p>

తెలుగు రాష్ట్రాల్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను, ఉభయ గోదావరి జిల్లాల సౌందర్యాన్ని తక్కువ సమయంలో, సౌకర్యవంతంగా దర్శించుకోవాలనుకునే ఆధ్యాత్మిక భక్తుల కోసం…. IRCTC అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. 'గోదావరి టెంపుల్ టూర్' (Godavari Temple Tour) పేరుతో రూపొందించిన ఈ ప్రత్యేక ప్యాకేజీ ద్వారా గోదావరి తీరంలో వెలసిన అత్యంత మహిమాన్వితమైన దేవాలయాలను, కోనసీమ ప్రకృతి అందాలను సందర్శించవచ్చు.

3 రాత్రులు, 4 రోజుల వ్యవధితో సాగే ఈ ఆధ్యాత్మిక యాత్ర ప్రతి శుక్రవారం హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ అక్టోబర్ 29వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు.

శుక్రవారం రాత్రి 08:30 గంటలకు లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి, అలాగే రాత్రి 09:15 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరే గౌతమి ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్: 12738) ద్వారా యాత్ర ప్రారంభమవుతుంది. రాత్రి అంతా రైలులోనే ప్రయాణం ఉంటుంది.

శనివారం ఉదయం 04:38 గంటలకు ప్రయాణికులు రాజమండ్రి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి హోటల్‌కు వెళ్లి ప్రెష్‌అప్ అవుతారు. అనంతరం రాజమండ్రి నుంచి సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం బయలుదేరుతారు. రత్నగిరిపై వెలసిన శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం తిరిగి రాజమండ్రికి చేరుకుంటారు. అక్కడ పవిత్ర గోదావరి ఘాట్, సుందరమైన ఇస్కాన్ (ISKCON) ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రికి రాజమండ్రిలోని హోటల్‌లోనే బస చేస్తారు. మూడో రోజు ఉదయాన్నే హోటల్ నుంచి చెక్-అవుట్ చేసి అంతర్వేదికి బయలుదేరుతారు. అక్కడ ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకోవడంతో పాటు సముద్ర తీరాన్ని (బీచ్) సందర్శిస్తారు. అనంతరం అప్పనపల్లిలోని శ్రీ బాల బాలాజీ ఆలయం, ఐనవిల్లిలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం మరియు ప్రముఖ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా భావించే ద్రాక్షారామం భీమేశ్వరస్వామి ఆలయాలను దర్శించుకుంటారు.

క్షేత్ర దర్శనాలన్నీ పూర్తయిన తర్వాత సాయంత్రం రాజమండ్రి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. రాత్రి 08:18 గంటలకు బయలుదేరే గౌతమి ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్: 12737) ఎక్కి హైదరాబాద్‌కు తిరుగుప్రయాణం అవుతారు. రాత్రి అంతా ప్రయాణంలో ఉంటారు.

సోమవారం ఉదయం గౌతమి ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ మరియు లింగంపల్లి స్టేషన్లకు చేరుకోవడంతో ఈ ఆధ్యాత్మిక యాత్ర పూర్తవుతుంది.

ఈ ప్యాకేజీ బుకింగ్స్ మరియు ఇతర వివరాల కోసం ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ ( https://www.irctctourism.com/ ) ను సందర్శించవచ్చు లేదా ఈ క్రింది ఫోన్ నంబర్లలో నేరుగా సంప్రదించవచ్చు: 8287932229 / 8287932228 / 9701360701.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks