...
...
Next Story

Kriti Sanon : కాక్‌టెయిల్ 2లో కృతి సనన్ బికినీ లుక్ వెనుక సీక్రెట్ ఇదే- మామూలు కష్టం కాదుగా!

షాహిద్ కపూర్, రష్మికా మందన్న, కృతి సనన్ నటించిన 'కాక్‌టెయిల్ 2' థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమాలో కృతి సనన్ బికినీ లుక్ హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఆ పర్ఫెక్ట్ బాడీ షేప్ కోసం పడ్డ కష్టం, డైట్ ప్లాన్ వివరాలు ఇక్కడ చూద్దాం.

Published on: Jun 21, 2026, 12:20:56 IST
Advertisement
<p>బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, రష్మికా మందన్న మరియు కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'కాక్‌టెయిల్ 2' జూన్ 19న థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ సినిమాలో అన్నింటికంటే ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన అంశం ఒకటి ఉంది. అదే.. నటి కృతి సనన్ గ్లామరస్ బికినీ అప్పీయరెన్స్! తెరపై కృతి అంత స్లిమ్‌గా, టోన్డ్ బాడీతో కనిపించడం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని ఆమె వ్యక్తిగత ఫిట్‌నెస్ ట్రైనర్ తాజాగా బయటపెట్టారు.</p>

బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, రష్మికా మందన్న మరియు కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'కాక్‌టెయిల్ 2' జూన్ 19న థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ సినిమాలో అన్నింటికంటే ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన అంశం ఒకటి ఉంది. అదే.. నటి కృతి సనన్ గ్లామరస్ బికినీ అప్పీయరెన్స్! తెరపై కృతి అంత స్లిమ్‌గా, టోన్డ్ బాడీతో కనిపించడం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని ఆమె వ్యక్తిగత ఫిట్‌నెస్ ట్రైనర్ తాజాగా బయటపెట్టారు.

కృతి సనన్ అంతటి పర్ఫెక్ట్ బాడీ షేప్‌ను ఎలా సాధించిందో ఆమె ట్రైనర్ కరణ్ సాహ్ని వివరించారు. ఈ మార్పు కేవలం కఠినమైన వర్కవుట్ల వల్లే సాధ్యం కాలేదని.. క్రమశిక్షణతో కూడిన పౌష్టికాహారం, పక్కా ప్రణాళికతో కూడిన వ్యాయామాలు, సరైన నిద్ర, కఠినమైన క్యాలరీ డెఫిసిట్ (తీసుకునే ఆహారంలో క్యాలరీలను తగ్గించడం) వల్లే ఇది సాధ్యమైందని ఆయన వెల్లడించారు.

“మీరు కూడా కృతి సనన్ లాంటి బికినీ బాడీని సాధించాలనుకుంటే.. అన్నింటికంటే ముందుగా మీరు తినే ఆహారంపై దృష్టి పెట్టాలి. మీరు వారానికి ఆరు రోజులు జిమ్‌లో ఎంత కఠినంగా వర్కవుట్ చేసినా సరే.. మీ న్యూట్రిషన్ ప్లాన్ సరిగ్గా లేకపోతే ఎలాంటి ఫలితం కనిపించదు. మీ శరీరానికి అవసరమైన దానికంటే తక్కువ క్యాలరీల ఆహారాన్ని తీసుకునే క్యాలరీ డెఫిసిట్ మోడ్‌లో మీరు ఉండాలి,” అని కరణ్ సాహ్ని చెప్పారు.

ఈ బికినీ బాడీని సాధించడానికి ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో హై-ప్రోటీన్ (ఎక్కువ ప్రొటీన్లు ఉన్న) డైట్ ఉండేలా చూసుకోవాలని, అలాగే రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు ఖచ్చితంగా నిద్రపోవాలని ఆయన సూచించారు. “నిరంతరం వ్యాయామం చేస్తూ, రోజువారీ జీవితంలో ఒక పక్కా దినచర్యను అలవాటు చేసుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా జిమ్‌లోనే కాదు, వంటింట్లో కూడా కష్టపడాలి. అంటే నాలుకను అదుపులో ఉంచుకుని, నచ్చిన చాలా వస్తువులకు నో చెప్పడం నేర్చుకోవాలి” అని ఆయన ముగించారు.

మరొక వీడియోలో, కృతి సనన్ ఈ లుక్ కోసం తెర వెనుక చేసిన కసరత్తులు, ప్రణాళికలను కరణ్ సాహ్ని సవివరంగా పంచుకున్నారు. కండరాలకు సరైన ఆకృతిని, స్పష్టమైన డెఫినిషన్‌ను తీసుకురావడానికి హెవీ లిఫ్టింగ్ (బరువులు ఎత్తడం) పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. శరీరంపై ఎక్కువ ఒత్తిడి పడకుండా స్థిరమైన వేగంతో కొవ్వును కరిగించడానికి లో- ఇంటెన్సిటీ ఇన్​క్లైన్ వాక్స్ పద్ధతిని ఉపయోగించారు. ఇది కండరాల పరిమాణం తగ్గకుండా, కేవలం అనవసరమైన కొవ్వును మాత్రమే ఆరోగ్యకరమైన రీతిలో కరిగిస్తుంది.

శరీరంలో జీవక్రియలను (మెటబాలిజం) చురుగ్గా ఉంచడానికి, నిరంతరం కొవ్వు కరిగే ప్రక్రియను కొనసాగించడానికి స్టెడీ-స్టేట్ జోన్ 2 కార్డియో సెషన్లను వర్కవుట్‌లో చేర్చారు. శరీరం సన్నబడుతున్నప్పుడు సాధారణంగా ముఖం కూడా పీక్కుపోయినట్లు అవుతుంది. కానీ కృతి ముఖంలో ఆ గ్లో, నిండుదనం అలాగే ఉంటూనే, శరీరం మాత్రం స్లిమ్‌గా మారేలా డైట్ ప్లాన్‌ను చాలా జాగ్రత్తగా రూపొందించారు.

సినిమా షూటింగ్ కమిట్‌మెంట్లు, దర్శకులతో జరిగే రెగ్యులర్ మీటింగులను దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాన్‌ను మొదటి నుంచే డిజైన్ చేశారు. కృతి బిజీ లైఫ్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రతి వర్కవుట్, న్యూట్రిషన్ ఫేజ్‌ను సమయానికి అనుగుణంగా సర్దుబాటు చేశారు అని ఆమె ఫిట్​నెస్​ ట్రైనర్ వివరించారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe