...
...
Next Story

నెలవారీ పింఛను పెంపు- వారందరికీ గుడ్​ న్యూస్​!

బిహార్​ ఎన్నికలకు ముందు రాష్ట్రంలోని పింఛనుదారులకు సీఎం నితీశ్​ కుమార్​ గుడ్​ న్యూస్​ ఇచ్చారు. పింఛనను పెంచుతున్నట్టు తెలిపారు.

Published on: Jun 21, 2025, 12:52:17 IST
By ,
Prefer HTon Google
Advertisement
<p>వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇచ్చే నెలవారీ పింఛనను రూ. 400 నుంచి రూ. 1,110కి పెంచుతున్నట్టు నితీశ్​ కుమార్​ ప్రకటించారు.</p>

వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇచ్చే నెలవారీ పింఛనను రూ. 400 నుంచి రూ. 1,110కి పెంచుతున్నట్టు నితీశ్​ కుమార్​ ప్రకటించారు.

ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర సామాజిక భద్రత పింఛను పథకం కింద 1,09,69,255 మంది లబ్ధిపొందనున్నట్టు నితీశ్​ కుమార్​ వివరించారు.

"సామాజిక భద్రత పింఛను పథకం అమలయ్యే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఇక నుంచి రూ.400కి బదులు రూ. 1,100 పెన్షన్​ లభిస్తుందని చెప్పడం నాకు సంతోషంగా ఉంది. జులై నుంచి లబ్ధిదారులకు ఇది అమల్లోకి వస్తుంది. ప్రతి నెల 10వ తేదీన లబ్ధిదారులందరి ఖాతాలో ఈ డబ్బులు పడే విధంగా చర్యలు తీసుకుంటాను. 1 కోటి 9 లక్షల 69 వేల మంది లబ్ధిదారులకు ఇది సాయం చేస్తుంది," అని నితీశ్​ కుమార్​ ట్వీట్​ చేశారు.

ఈ ఏడాది చివరిలో జరగనున్న బిహార్​ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ప్రకటన వెలువడింది. ఆర్జేడీ- కాంగ్రెస్ కూటమిపై​ గెలిచేందుకు జేడీయూ- తన మిత్రపక్షం ఎన్డీఏ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది.

రాష్ట్రంలోని జిల్లా పరిషద్​ అధ్యక్షుల నెలవారీ అలొవెన్స్​ని ఇటీవలే రూ. 20వేల నుంచి రూ.30వేలకు చేశారు నితీస్​ కుమార్​. జెడ్​పీ ఉపాధ్యక్షుడి నెలవారీ అలొవెన్స్​ని రూ.10వేల నుంచి రూ.20వేలకు పెంచారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe