...
...
Next Story

Telangana : డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం చూస్తున్నారా..? తాజా అప్డేట్ ఇదే

మహానగర పరిధిలో పేదల కోసం లక్ష ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. యుద్ధప్రాతిపదికన స్థలాలను గుర్తించాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. మరోవైపు ఈ నెలాఖరులోగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని మంత్రి పొంగులేటి ప్రకటించారు.

Published on: Oct 23, 2026, 17:26:41 IST
Advertisement
<p>హైదరాబాద్‌ పరిధిలోని నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కోర్ అర్బన్ రీజియన్ (CURE - క్యూర్) పరిధిలో నివసించే పేదల ఉపాధికి ఎలాంటి ఆటంకం కలగకుండా, వారు ప్రస్తుతం ఉంటున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వడమే తమ ప్రాథమిక లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడుతూనే, ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలను అత్యంత వేగంగా గుర్తించాలని అధికారులకు సూచించారు.</p><p> </p>

హైదరాబాద్‌ పరిధిలోని నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కోర్ అర్బన్ రీజియన్ (CURE - క్యూర్) పరిధిలో నివసించే పేదల ఉపాధికి ఎలాంటి ఆటంకం కలగకుండా, వారు ప్రస్తుతం ఉంటున్న ప్రాంతాలకు సమీపంలోనే ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వడమే తమ ప్రాథమిక లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను కాపాడుతూనే, ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలను అత్యంత వేగంగా గుర్తించాలని అధికారులకు సూచించారు.

శుక్రవారం(అక్టోబర్ 23, 2026) డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం, తదుపరి విడతలకు అవసరమైన భూముల లభ్యత, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై ఇందులో విస్తృతంగా చర్చించారు.

క్యూర్ పరిధిలోని నియోజకవర్గాల వారీగా మొదటి విడత నిర్మాణాలకు అవసరమైన స్థలాల గుర్తింపును సత్వరమే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. వీటితో పాటు రెండు, మూడో విడతల్లో చేపట్టనున్న నిర్మాణాలకు కూడా ముందస్తుగా భూములను సిద్ధం చేయాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యోచనకు అనుగుణంగా ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. క్యూర్ పరిధిలో మొత్తంగా లక్ష ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకోగా, మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి సుమారు 500 ఇళ్ల చొప్పున నిర్మిస్తారు. మొదటి విడత భూముల సేకరణ పూర్తి చేస్తూనే, తదుపరి విడతలకు అనువైన భూముల గుర్తింపుపై అధికారులు నిరంతర పర్యవేక్షణ ఉంచాలని దిశానిర్దేశం చేశారు.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాల్లో నిలిచిపోయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సంబంధించి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ఎంపికలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు.

హౌసింగ్ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన అత్యాధునిక సాఫ్ట్‌వేర్ ద్వారా డిజిటల్ లేదా ఆన్‌లైన్ డ్రా విధానంలోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఈ డ్రా ప్రక్రియ మొత్తాన్ని పారదర్శకంగా ప్రత్యక్ష ప్రసారం (Live Stream) చేస్తారు.

అంతేకాకుండా…. డ్రా వివరాలను ప్రత్యేకంగా యూట్యూబ్‌లో అందుబాటులో ఉంచుతారు. దీనివల్ల లబ్ధిదారులు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా తమ వివరాలు లేదా పేర్లు జాబితాలో ఉన్నాయో లేదో సులభంగా తనిఖీ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks