...
...
Next Story

Antibiotics : డాక్టర్లు చెప్పకుండానే ఇష్టమొచ్చినట్టు యాంటీబయోటిక్స్ వాడేస్తున్నారా? ప్రాణాలకే ప్రమాదం..

జ్వరం, గొంతునొప్పి రాగానే మెడికల్ షాప్‌కు వెళ్లి యాంటీబయోటిక్స్ కొనుక్కొని వేసుకుంటున్నారా? అయితే ఇది ఎంత ప్రమామదకరమో మీరు తెలుసుకోవాలి! డాక్టర్ సలహా లేకుండా యాంటీబయోటిక్స్ వాడితే ఎదురయ్యే తీవ్రమైన దుష్ప్రభావాలు, ఆరోగ్య సమస్యల గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి..

Published on: Sep 6, 2026, 12:21:03 IST
Advertisement
<p>సాధారణంగా కొద్దిగా జ్వరం వచ్చినా, గొంతులో అసౌకర్యంగా ఉన్నా, లేదంటే దగ్గు తగ్గకపోయినా మనలో చాలామంది వెంటనే చేసే పని ఇంట్లో ఉన్న లేదా మెడికల్ షాప్‌లో దొరికే యాంటీబయోటిక్ టాబ్లెట్ వేసుకోవడం. ముఖ్యంగా ‘అజిత్రోమైసిన్’ వంటి మందులను వైద్యుల సలహా లేకుండానే సొంతంగా వాడేస్తుంటారు. గతంలో వాడగా మిగిలిపోయిన టాబ్లెట్లను వేసుకోవడం లేదా కుటుంబ సభ్యులకు ఇవ్వడం మన ఇళ్లలో సర్వసాధారణంగా కనిపిస్తుంది. అయితే, ఇలా సొంత వైద్యం చేసుకోవడం వల్ల శరీరంపై ఎంతటి దారుణమైన ప్రభావం పడుతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.</p>

సాధారణంగా కొద్దిగా జ్వరం వచ్చినా, గొంతులో అసౌకర్యంగా ఉన్నా, లేదంటే దగ్గు తగ్గకపోయినా మనలో చాలామంది వెంటనే చేసే పని ఇంట్లో ఉన్న లేదా మెడికల్ షాప్‌లో దొరికే యాంటీబయోటిక్ టాబ్లెట్ వేసుకోవడం. ముఖ్యంగా ‘అజిత్రోమైసిన్’ వంటి మందులను వైద్యుల సలహా లేకుండానే సొంతంగా వాడేస్తుంటారు. గతంలో వాడగా మిగిలిపోయిన టాబ్లెట్లను వేసుకోవడం లేదా కుటుంబ సభ్యులకు ఇవ్వడం మన ఇళ్లలో సర్వసాధారణంగా కనిపిస్తుంది. అయితే, ఇలా సొంత వైద్యం చేసుకోవడం వల్ల శరీరంపై ఎంతటి దారుణమైన ప్రభావం పడుతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

వైద్యుని సంప్రదించకుండా సొంతంగా యాంటీబయోటిక్స్ వాడటం వల్ల కలిగే నష్టాలపై కైలాష్ దీపక్ ఆసుపత్రి కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ మాన్సీ నిగమ్ హెచ్చరిస్తున్నారు. "చాలామంది వైరల్ ఫీవర్, ఫ్లూ వంటి సమస్యలకు కూడా ఎలాంటి డాక్టర్ సలహా లేకుండా ఓవర్ ది కౌంటర్ (ఓటీసీ)లో లభించే అజిత్రోమైసిన్ వంటి యాంటీబయోటిక్స్ వాడుతుంటారు. కానీ, యాంటీబయోటిక్స్ కేవలం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లపై మాత్రమే పనిచేస్తాయి, వైరల్ ఇన్ఫెక్షన్లపై ఏమాత్రం ప్రభావం చూపవు. ఇలాంటి సమయంలో వాటిని వాడటం పూర్తిగా దండగ," అని డాక్టర్ మాన్సీ వివరించారు.

సరైన రోగ నిర్ధారణ లేకుండా సొంతంగా మందులు వాడటం వల్ల అసలు వ్యాధి నయం కాకపోగా, ఇతర సైడ్ ఎఫెక్ట్స్, అలెర్జీలు రావడం లేదా మనం వాడే ఇతర మందులతో ఇవి చర్య జరిపి ప్రాణాల మీదకు తీసుకురావచ్చని డాక్టర్ మాన్సీ నిగమ్ స్పష్టం చేశారు.

సొంత వైద్యం వల్ల ఎదురయ్యే అత్యంత ప్రమాదకరమైన సమస్య ‘యాంటీబయోటిక్ రెసిస్టెన్స్’. అంటే, మందులు వాడినా శరీరంలోని బ్యాక్టీరియా చనిపోకుండా ఆ మందులను తట్టుకునే శక్తిని పెంపొందించుకుంటుంది. వైద్యులు సూచించిన డోసేజ్ వాడకపోవడం, కొద్దిగా ఉపశమనం కలగ్గానే కోర్సు పూర్తికాకుండానే మందులు ఆపేయడం, లేదా మిగిలిపోయిన మందులను వేరేవారికి సిఫార్సు చేయడం వల్ల బ్యాక్టీరియా శరీరంలో అలాగే ఉండిపోయి, క్రమంగా ఆ మందుకు అలవాటు పడిపోతుంది. ఫలితంగా భవిష్యత్తులో నిజంగానే పెద్ద ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ యాంటీబయోటిక్ టాబ్లెట్ ఎంత వేసుకున్నా అసలు పనిచేయదు!

కేవలం సొంత వైద్యం మాత్రమే కాకుండా, మనం వాడే యాంటీబయోటిక్ మందుల నాణ్యత, శక్తి కూడా ఇన్ఫెక్షన్ తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని మెడిసెఫ్ ఫార్మా మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కుమార్ అగర్వాల్ తెలిపారు. "నాణ్యతా ప్రమాణాలు లేని యాంటీబయోటిక్స్ వాడినప్పుడు, మీరు సరైన పద్ధతిలోనే వేసుకున్నప్పటికీ ఇన్ఫెక్షన్ నయం కాకపోవచ్చు. ఇది కూడా యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ లాగే పనిచేస్తుంది. అందువల్ల బాధ్యతాయుతమైన ఔషధ వినియోగంతో పాటు నాణ్యమైన మందుల తయారీ కూడా అత్యంత ఆవశ్యకం," అని విజయ్ కుమార్ పేర్కొన్నారు.

సాధారణ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఓవర్ ది కౌంటర్ మందులు వాడటం వేరు, కానీ యాంటీబయోటిక్స్ వాడటం పూర్తిగా వేరు. యాంటీబయోటిక్స్ వాడటానికి కచ్చితంగా వైద్యుడి పరిశీలన, ప్రిస్క్రిప్షన్ ఉండాల్సిందే.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks