...
...
Next Story

Telangana Rains : తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్ - ఇవాళ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!

Telangana weather Report : తెలంగాణ వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. హైదరాబాద్ కు వాతావరణశాఖ మరోసారి హెచ్చరికలను జారీ చేసింది.

Published on: Jun 10, 2026, 10:19:13 IST
Advertisement
<p>తెలంగాణకు వాతావరణశాఖ మరోసారి రెయిన్ అలర్ట్ ఇచ్చింది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన  వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది. </p><p> </p>

తెలంగాణకు వాతావరణశాఖ మరోసారి రెయిన్ అలర్ట్ ఇచ్చింది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) వెల్లడించింది.

ఇవాళ(జూన్ 10) వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే వీలుంది. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

జూన్ 11 నుంచి 12వ తేదీల మధ్య కూడా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈదురుగాలులు (గంటకు 40-50 కి.మీ వేగం), ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని, జూన్ 12 తర్వాత కొన్ని చోట్ల తేలికపాటి వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

రాజధాని హైదరాబాద్ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే.. నగరం మరియు పరిసర ప్రాంతాలలో సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం మెండుగా ఉంది. కొన్ని చోట్ల గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయవచ్చు.

తెలంగాణ వెదర్ మ్యాన్ రిపోర్ట్ ప్రకారం…. నైరుతి రుతుపవనాలు ఈరోజు దక్షిణ తెలంగాణ - హైదరాబాద్ పరిధిలో నిలిచిపోయే అవకాశం ఉంది. కనీసం జూన్ 17 వరకు ఉత్తర, ఈశాన్య తెలంగాణ వైపు ముందుకు కదిలే అవకాశాలు తక్కువగా ఉన్నాయి

ఇక జూన్ 18 తర్వాత బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది, ఫలితంగా జూన్ 19-23 మధ్య తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో రుతుపవన గమనంలో వేగం పెరగనుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe