...
...
Next Story

మూత్రం నీలం లేదా ఆకుపచ్చ రంగులో వస్తోందా? నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!

మూత్రం రంగు మారడం సాధారణ విషయమే అనుకుంటే పొరపాటే. నీలం లేదా ఆకుపచ్చ రంగులో మూత్రం రావడం వెనుక ఉన్న ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ గురించి ప్రముఖ అమెరికా నిపుణులు డాక్టర్ కునాల్ సూద్ అందించిన హెచ్చరికలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Sep 15, 2026, 11:24:24 IST
Advertisement
<p>ఆరోగ్యంగా ఉన్నప్పుడు మూత్రం రంగు లేత పసుపు లేదా నీళ్ల రంగులో ఉంటుంది. అయితే, కొన్నిసార్లు శరీరంలో జరిగే అంతర్గత మార్పులు, వ్యాధుల సంకేతాలను మన మూత్రం రంగు ద్వారా గ్రహించవచ్చు! మూత్రం అకస్మాత్తుగా నీలం లేదా ఆకుపచ్చ రంగులోకి మారితే దాన్ని తేలిగ్గా తీసుకోకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన ప్రముఖ అనస్థీషియాలజీ, ఇన్ఫెక్షన్ నిపుణులు డాక్టర్ కునాల్ సూద్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఈ అంశంపై కీలక విషయాలను పంచుకున్నారు.</p>

ఆరోగ్యంగా ఉన్నప్పుడు మూత్రం రంగు లేత పసుపు లేదా నీళ్ల రంగులో ఉంటుంది. అయితే, కొన్నిసార్లు శరీరంలో జరిగే అంతర్గత మార్పులు, వ్యాధుల సంకేతాలను మన మూత్రం రంగు ద్వారా గ్రహించవచ్చు! మూత్రం అకస్మాత్తుగా నీలం లేదా ఆకుపచ్చ రంగులోకి మారితే దాన్ని తేలిగ్గా తీసుకోకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన ప్రముఖ అనస్థీషియాలజీ, ఇన్ఫెక్షన్ నిపుణులు డాక్టర్ కునాల్ సూద్ ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఈ అంశంపై కీలక విషయాలను పంచుకున్నారు.

మూత్రపిండాలు లేదా మూత్రాశయ వ్యాధుల బారిన పడినప్పుడు లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (యూటీఐ) సోకినప్పుడు మూత్రం రంగు మారుతుంది. 'సూడోమోనాస్' అనే నిర్దిష్ట బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించినప్పుడు మూత్రం వింతగా నీలం లేదా ఆకుపచ్చ రంగులోకి మారుతుందని డాక్టర్ కునాల్ తెలిపారు."మూత్రం ఈ విధంగా నీలం లేదా ఆకుపచ్చ రంగులోకి మారడానికి సూడోమోనాస్ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే వర్ణద్రవ్యాలే ప్రధాన కారణం," అని డాక్టర్ కునాల్ సూద్ వెల్లడించారు.

సూడోమోనాస్ ఇన్ఫెక్షన్ సాధారణ యూటీఐల కంటే భిన్నమైనది. ఈ బ్యాక్టీరియా నీలం, పసుపు-ఆకుపచ్చ రంగుల పిగ్మెంట్లను విడుదల చేయడం వల్ల మూత్రం రంగు మారుతుంది. ఇది ఇతర ఇన్ఫెక్షన్ల కంటే కాస్త ప్రమాదకరమైనది. ఈ బ్యాక్టీరియా సాధారణంగా వాడే కొన్ని రకాల యాంటీబయాటిక్స్ మందులను తట్టుకుని నిలబడే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే సొంత వైద్యం చేసుకోకుండా తప్పనిసరిగా ‘యూరిన్ కల్చర్’ పరీక్ష చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మూత్రం రంగు మారడంతో పాటు కొన్ని లక్షణాలు ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. అవి.. మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన మంట, నొప్పి ఉండడం, తరచుగా మూత్రానికి వెళ్లాలనిపించడం, పొత్తికడుపులో లేదా నడుము కింది భాగంలో అసౌకర్యం, నొప్పి. జ్వరం, తీవ్రమైన అలసట లేదా అనారోగ్యంగా అనిపించడం.

పురుషులతో పోలిస్తే మహిళల్లో యూటీఐ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజంతా పుష్కలంగా నీరు తాగడం వల్ల మూత్రాశయంలోని బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోతుంది. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవడం వల్ల బ్యాక్టీరియా వేగంగా విస్తరిస్తుంది. కాబట్టి అవసరమైనప్పుడు వెంటనే విసర్జించాలి. శృంగారం తర్వాత మూత్ర విసర్జన చేయడం వల్ల బ్యాక్టీరియా లోపలికి చేరకుండా అడ్డుకోవచ్చు. పదే పదే యూటీఐ సమస్య వేధిస్తుంటే నిపుణులను సంప్రదించి తగిన నివారణ మార్గాలు అడిగి తెలుసుకోవాలి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks