...
...
Next Story

TG SSC Results 2026 : తెలంగాణ టెన్త్ ఫలితాలపై కొత్త అప్డేట్ - రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే..?

Telangana SSC Results 2026 : తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈనెల 16వ తేదీ నాటికి అన్ని సబ్జెక్టులు పూర్తవుతాయి. మరోవైపు స్పాట్ వాల్యూయేషన్ కొనసాగుతోంది. ఏప్రిల్ 30 లేదా మే మొదటి వారంలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.

Published on: Apr 13, 2026, 09:39:58 IST
Advertisement
<p>తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రతి పరీక్షకు మధ్యలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు గడువు ఇచ్చారు. ఏప్రిల్ 16వ తేదీ నాటికి అన్ని సబ్జెక్టులు పూర్తవుతాయి. </p>

తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. ప్రతి పరీక్షకు మధ్యలో మూడు నుంచి నాలుగు రోజుల పాటు గడువు ఇచ్చారు. ఏప్రిల్ 16వ తేదీ నాటికి అన్ని సబ్జెక్టులు పూర్తవుతాయి.

ఓవైపు పరీక్షలు జరుగుతుండగానే… మరోవైపు స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియంతా కూడా ఏప్రిల్ 23వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత ఫలితాలను ప్రాసెస్ చేస్తారు. సాంకేతిక అంశాలను పరిశీలిస్తారు.

. ఏప్రిల్ 23 నాటికి స్పాట్ పూర్తి అయితే… మరో వారం రోజుల పాటు క్రీడకరణ ఉంటుంది. అంటే ఏప్రిల్ చివరికల్లా మొత్తం ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. అన్ని కుదిరితే ఏప్రిల్ 30 లేదా మే మొదటి వారంలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంటుంది.

గత ఏడాది కూడా ఏప్రిల్ 30వ తేదీనే తెలంగాణ టెన్త్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి కూడా అదే సమయానికి ఫలితాలు రావచ్చని తెలుస్తోంది. ఒకవేళ ఈ తేదీ కుదరకపోతే మే ఫస్ట్ వీక్ లో ఫలితాలను ప్రకటిస్తారని సమాచారం.

తెలంగాణ టెన్త్ ఫలితాలను https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా చెక్ చేసుకోవచ్చు.

అంతేకాకుండా గతేడాది మాదిరిగానే హిందుస్తాన్ టైమ్స్ వెబ్ సైట్ ( https://www.hindustantimes.com/ ) లోనూ ఫలితాలు అందుబాటులో ఉంటాయి. విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ ఆధారంగా మార్కుల వివరాలను వేగంగా తెలుసుకోవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe