AP SSC Exams 2026 : ఏప్రిల్ 6 నుంచి ఏపీ టెన్త్ స్పాట్ వాల్యూయేషన్ - ఫలితాలు ఎప్పుడంటే..?

AP SSC Exam Spot Valuation 2026 : ఏపీలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 1వ తేదీతో పరీక్షలన్నీ ముగుస్తాయి. అయితే ఏప్రిల్ 6వ తేదీ నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం(స్పాట్ వాల్యూయేషన్) షురూ చేస్తారు.

Published on: Mar 29, 2026 6:48 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ టెన్త్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 1వ తేదీతో అన్ని పరీక్షలు పూర్తవుతాయి. ఓవైపు ఎగ్జామ్ జరుగుతుండగానే… మరోవైపు స్పాట్ కోసం అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. త్వరితగతిన స్పాట్ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాథమికంగా స్పాట్ వాల్యుయేషన్ తేదీలను కూడా ఖరారు చేశారు.

ఏపీ టెన్త్ పరీక్షలు 2026
ఏపీ టెన్త్ పరీక్షలు 2026

ఏప్రిల్ 6 నుంచి స్పాట్ వాల్యూయేషన్ …!

ఏపీ టెన్త్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్‌ 6వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 15వ తేదీ తో అన్ని సబ్జెక్ట్ పేపర్లను పూర్తి చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యాచరణను సిద్ధం చేసింది. స్పాట్ జరిగే కేంద్రాలతో పాటు సిబ్బంది నియామకం, ఇతర అంశాలపై ఫోకస్ పెట్టింది.

మరోవైపు గతేడాది టెన్త్ మార్కుల కౌంటింగ్‌లో కొన్ని తప్పిదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈసారి అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా పకడ్బందీగా స్పాట్ ప్రక్రియను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తప్పు చేసిన సిబ్బందికి జరిమానా విధించేలా నిబంధనలు తీసుకొచ్చింది. ఈసారి ట్యాబ్‌లలో మార్కులు నమోదు చేయనున్నారు. పేపర్ల మూల్యాంకనంతో పాటు మార్కుల ఎంట్రీ వరకు ప్రతిదీ దశల వారీగా చేసి… ప్రాసెస్ ను పూర్తి చేయనున్నారు.

ఏపీ పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతున్నాయి. ఈసారి మొత్తం 6,40,916 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.వీరిలో 6,22,074 మంది రెగ్యులర్ అభ్యర్థులు, 18,842 మంది ప్రైవేట్ అభ్యర్థులు ఉన్నారు. 3,28,652 మంది బాలురు, 3,12,264 మంది బాలికలు ఉన్నారు.

పరీక్షా కేంద్రాల వద్ద సీసీటీవీ నిఘాలో ఉంచారు. దాదాపు 156 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను మోహరించారు. అన్ని కేంద్రాలలో వైద్య బృందాలు, ప్రథమ చికిత్స సౌకర్యాలు, ఏఎన్ఎం సిబ్బందిని అందుబాటులో ఉంచారు. తాగునీరు, సీటింగ్ ఏర్పాట్లు, వెంటిలేషన్, ఫర్నిచర్‌ను ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశారు.

స్పాట్ వాల్యూయేషన్ పూర్తి అయిన తర్వాత… డేటాను అప్ లోడ్ చేయటంతో పాటు సాంకేతిక అంశాలను పరిశీలిస్తారు. అన్ని ఒకే అయిన తర్వాతే… ఫలితాల విడుదలకు ఓ తేదీని ఖరారు చేస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతారు. ఇందుకు సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే…. ఫలితాల తేదీని అధికారికంగా ప్రకటిస్తారు.

ఫలితాలు ఎప్పుడు…?

గతేడాదిలో ఏప్రిల్ 23వ తేదీన ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈసారి ఏప్రిల్ 15వ తేదీ నాటికి జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కానుంది. కాబట్టి ఏప్రిల్ మూడో వారం లేదా నాల్గో వారంలో ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.

ఏపీ టెన్త్ ఫలితాలను https://results.bse.ap.gov.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనమిత్ర వాట్సాప్(9552300009) లో కూడా అందుబాటులో ఉంటాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More