...
...
Next Story

Goa : 'గోవా'లో వర్క్ ఫ్రమ్ హోమ్- హైదరాబాద్​ కన్నా తక్కువ ఖర్చుతో! నెలకు రూ.30వేలతోనే..

గోవాలో సెటిల్​ అవ్వాలని లేదా నెలలు నెలలు గడపాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. కానీ అక్కడి ఖర్చులు గుర్తొచ్చి భయపడిపోతుంటారు. అయితే నెలకు రూ. 30వేలతోనే గోవాలో లగ్జరీగా బతకొచ్చు అని అంటే మీరు నమ్ముతారా? నమ్మకపోతే మాత్రం మీరు అజయ్ శర్మ పోస్టు చూడాల్సిందే..

Published on: Sep 3, 2026, 11:21:09 IST
Advertisement
<p>కరోనా మహమ్మారి తర్వాత కార్పొరేట్ ఉద్యోగ వ్యవస్థలో వచ్చిన అతిపెద్ద మార్పు ‘వర్క్ ఫ్రమ్ ఎనీవేర్’. ల్యాప్‌టాప్, మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు.. నాలుగు గోడల ఆఫీస్ గదికి పరిమితం కాకుండా నచ్చిన ప్రాంతం నుంచి పనిచేసే వెసులుబాటు ఉద్యోగులకు లభించింది. ఇదే బాటలో పయనించిన కార్పొరేట్ ప్రొఫెషనల్ అజయ్ శర్మ కథనం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. గతంలో హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రశాంతమైన సియాల్ గ్రామంలో 71 రోజుల పాటు నివసించిన అజయ్, ఇటీవల తన పక్కా ప్రణాళికతో పర్యాటక స్వర్గధామం గోవాకు మకాం మార్చారు. గోవా అనగానే విపరీతమైన ఖర్చు, విలాసవంతమైన రిసార్టులు మాత్రమే గుర్తుకొచ్చే రోజుల్లో, నెలకు కేవలం రూ.30 వేల బడ్జెట్‌తో అత్యంత సౌకర్యవంతమైన జీవనాన్ని ఎలా గడపవచ్చో ఆయన చేసి చూపించారు.</p>

కరోనా మహమ్మారి తర్వాత కార్పొరేట్ ఉద్యోగ వ్యవస్థలో వచ్చిన అతిపెద్ద మార్పు ‘వర్క్ ఫ్రమ్ ఎనీవేర్’. ల్యాప్‌టాప్, మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు.. నాలుగు గోడల ఆఫీస్ గదికి పరిమితం కాకుండా నచ్చిన ప్రాంతం నుంచి పనిచేసే వెసులుబాటు ఉద్యోగులకు లభించింది. ఇదే బాటలో పయనించిన కార్పొరేట్ ప్రొఫెషనల్ అజయ్ శర్మ కథనం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. గతంలో హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రశాంతమైన సియాల్ గ్రామంలో 71 రోజుల పాటు నివసించిన అజయ్, ఇటీవల తన పక్కా ప్రణాళికతో పర్యాటక స్వర్గధామం గోవాకు మకాం మార్చారు. గోవా అనగానే విపరీతమైన ఖర్చు, విలాసవంతమైన రిసార్టులు మాత్రమే గుర్తుకొచ్చే రోజుల్లో, నెలకు కేవలం రూ.30 వేల బడ్జెట్‌తో అత్యంత సౌకర్యవంతమైన జీవనాన్ని ఎలా గడపవచ్చో ఆయన చేసి చూపించారు.

ఆగస్టు 16న గోవాకు మారినట్లు ప్రకటించిన అజయ్, ఆగస్టు 20న తాను నివసిస్తున్న ఇంటిని వీడియో ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారు. "నేను ప్రస్తుతం ఒక విశాలమైన 3బీహెచ్​కే విల్లాలో ఉంటున్నాను. నా సొంత గదిలో హై-స్పీడ్ వైఫై, పనిచేసుకోవడానికి అనుకూలమైన డెస్క్, అటాచ్డ్ వాష్‌రూమ్ ఉన్నాయి. వంట చేసుకోవడానికి కావాల్సిన అన్ని రకాల పాత్రలతో కూడిన కిచెన్, డైనింగ్ ఏరియా, రిలాక్స్ అవ్వడానికి లివింగ్ స్పేస్ అందుబాటులో ఉన్నాయి. ఇంటి వెనుక భాగంలో ఒక మంచి గార్డెన్ కూడా ఉంది. అన్నింటికంటే అద్భుతమైన విషయం ఏంటంటే.. సముద్ర తీరం ఇక్కడి నుంచి కేవలం 2 నుంచి 3 నిమిషాల నడక దూరంలోనే ఉంటుంది. నా ఉదయాలు, సాయంత్రాలు ఇప్పుడు అలల సవ్వడులు, సూర్యాస్తమయాలతో ఎంతో ప్రశాంతంగా గడుస్తున్నాయి," అని అజయ్ వివరించారు.

గోవాలో నెలవారీ ఖర్చులు- 3బీహెచ్​కే విల్లాలో తన వాటా కింద నెలకు రూ. 15,000 చెల్లిస్తున్నారు. దిల్లీ, మనాలి వంటి ప్రాంతాలతో పోలిస్తే గోవాలో సరుకుల ధరలు కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ, మొదటి వారంలో ఆయనకు రూ. 1,500 ఖర్చయింది. ఆ లెక్కన నెలకు సరుకుల ఖర్చు రూ. 6,000 వరకు వస్తుంది. ఆరోగ్యం కోసం స్థానిక జిమ్ సభ్యత్వం కోసం నెలకు రూ. 2,000 వెచ్చిస్తున్నారు.

గోవాలో నెలవారీ ఖర్చులు- గోవాలో సొంతంగా ప్రయాణించడానికి స్కూటర్ చాలా అవసరం. ప్రస్తుతం ఆఫ్-సీజన్ కావడంతో నెలకు రూ. 4,500కే స్కూటర్ లభించింది. తన ఫ్లాట్‌మేట్‌తో దాన్ని పంచుకోవడంతో అజయ్ వాటా రూ. 2,250 మాత్రమే. ఇక పెట్రోల్ కోసం వారానికి రూ. 300 చొప్పున నెలకు రూ. 1,200 ఖర్చవుతోంది. ఇక ఇతరత్రా అత్యవసరాల కోసం వారానికి రూ. 1,200 చొప్పున నెలకు దాదాపు రూ. 5,000 కేటాయించారు.

వీటన్నింటినీ కలిపితే గోవా వంటి పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్‌లో ఎలాంటి రాజీ పడకుండా జీవించడానికి నెలకు సరిగ్గా రూ. 30,000 ఖర్చవుతోందని అజయ్ స్పష్టం చేశారు. మెట్రో నగరాలైన హైదరాబాద్, బెంగళూరు, ముంబైలలో ఒక మామూలు ప్లాట్ అద్దెకే రూ.25 వేల నుంచి రూ.35 వేలు అవుతున్న తరుణంలో, తీరప్రాంతంలో ఈ బడ్జెట్‌తో లగ్జరీ లైఫ్ అనుభవించడం గొప్ప అవకాశమని ఐటీ ఉద్యోగులు కామెంట్లు చేస్తున్నారు. తన ప్రయాణం, ఇంట్లో వసతులు, నెలకు అయ్యే ఖర్చులపై ఇన్​స్టాగ్రామ్‌లో ఆయన పోస్ట్ చేసిన 10 వీడియోల శ్రేణి ఏకంగా 20 లక్షలకు పైగా వ్యూస్ సాధించి నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks