...
...
Next Story

2026 March Lucky Rasis: ఈ రాశులకు మార్చి నెలలో కాసుల వర్షం.. డబ్బు, అదృష్టం, ఆనందంతో పాటు ఎన్నో!

మార్చి నెలలో ప్రధాన గ్రహాల కదలికలు కీలక మార్పులు జరగబోతున్నాయి. కుజుడు ప్రత్యక్ష దృష్టి కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. ఈ రాశుల వారు ఆనందంగా ఉంటారు. కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది. సంతోషం పెరుగుతుంది. ఏ రాశుల వారికి ప్రయోజనకరంగా ఉండబోతోంది?

Published on: Feb 17, 2026, 15:00:50 IST
Advertisement

ప్రతి నెలలో కూడా గ్రహాల సంచారంలో మార్పు ఉంటుంది. ప్రతి నెలలో కొన్ని గ్రహాలు శుభ యోగాలను కూడా ఏర్పరుస్తూ ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి నెలలో కుజ సంచారం జరగబోతోంది. ఇది కొన్ని రాశుల వారికి అద్భుతమైన యోగాలను తీసుకు రాబోతోంది. కొన్ని రాశుల వారి జీవితం ఎంతో అందంగా కూడా మారిపోతోంది.

మార్చి నెలలో కుజ సంచారం

2026 March Lucky Rasis: ఈ రాశులకు మార్చి నెలలో కాసుల వర్షం (pinterest)
2026 March Lucky Rasis: ఈ రాశులకు మార్చి నెలలో కాసుల వర్షం (pinterest)

మార్చి నెలలో ప్రధాన గ్రహాల కదలికలు కీలక మార్పులు జరగబోతున్నాయి. కుజుడు ప్రత్యక్ష దృష్టి కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. ఈ రాశుల వారు ఆనందంగా ఉంటారు. కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది. సంతోషం పెరుగుతుంది.

మరి కుజ సంచారం, గురువు, శని సంచారంతో పాటు మర్చి నెలలో ఏర్పడే రాజయోగాలు ఏ రాశుల వారికి ప్రయోజనకరంగా ఉండబోతోంది? ఏ రాశుల వారికి మార్చి నెల విపరీతమైన అదృష్టాన్ని తీసుకురాబోతోందో తెలుసుకుందాం.

మార్చి నెలలో నాలుగు రాశుల వారికి ఊహించని లాభాలు.. కాసుల వర్షం, విపరీతమైన అదృష్టం

1.మేష రాశి:

మేష రాశి వారికి ఈ నెల బాగా కలిసి వస్తుంది. మార్చి నెలలో ఈ రాశి వారు ఆనందంగా ఉంటారు. కొత్త శక్తిని పొందుతారు. ఉద్యోగులు మంచి పేరు తెచ్చుకుంటారు. మీ నైపుణ్యాలు కూడా మెరుగుపడతాయి.

కొత్త బాధ్యతలు కూడా మిమ్మల్ని వరుస్తాయి. ఎప్పటినుంచో పూర్తికాని పనులను ఈ సమయంలో పూర్తి చేస్తారు. ఆస్తులను సంపాదిస్తారు. విడిపోయిన బంధువులను మళ్లీ కలుస్తారు. శుభకార్యాలు కూడా ఇంట్లో జరుగుతాయి.

2.వృశ్చిక రాశి:

కోర్టు కేసుల్లో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకునే వారికి కూడా ఇది శుభ సమయం. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శుభవార్తలను వింటారు.

3.కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారికి ఈ నెల ఆనందంగా ఉంటుంది. కష్టాలు తొలగి పోతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు తొలగిపోయి ప్రేమ ఎక్కువ అవుతుంది. రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్ రంగాల్లో ఉన్న వారికి మంచి లాభాలు ఉంటాయి. పిల్లల నుంచి శుభవార్తలను వింటారు. వారు కూడా పేరు ప్రఖ్యాతలను పొందుతారు.

4.మకర రాశి:

మకర రాశి వారికి కుజ సంచారంలో మార్పు రావడంతో మార్చి నెల బాగా కలిసి వస్తుంది. ఈ రాజయోగాలు వివిధ మార్గాల ద్వారా డబ్బును సంపాదించేలా చేస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది. సేవింగ్స్ కూడా పెరుగుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. ఇంటిని అందంగా మార్చుకుంటారు. ఈ రాశి వారి కలలు కూడా నెరవేరుతాయి. జీవితాన్ని మధురంగా మార్చుకుంటారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks