...
...
Next Story

2026లో ఏర్పడే సూర్య, చంద్ర గ్రహణాల కారణంగా ఈ 4 రాశులకు సమస్యలు.. తస్మాత్ జాగ్రత్త!

హిందూ ధర్మంలో గ్రహణాలకు ఉన్న ప్రాముఖ్యత ఇంతా అంతా కాదు. గ్రహణాలను అశుభంగా భావిస్తారు. గ్రహణ సమయంలో కొన్ని పనులు కూడా చేయకూడదని అంటారు. గ్రహణాల వలన ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2026లో వచ్చే గ్రహణాలు మానసిక, శారీరక ఒత్తిడిని, ఆర్థికపరంగా కూడా సమస్యలు కలిగించే అవకాశం ఉంది.

Published on: Jan 5, 2026, 15:00:59 IST
Advertisement

2026లోకి వచ్చేశాము. 2026లో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం కూడా ఉన్నాయి. అయితే ఈ గ్రహణాల ప్రభావం అన్ని రాశుల వారిపై పడుతుంది. కానీ కొన్ని రాశుల వారు మాత్రం ఎక్కువ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశుల వారు గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. గ్రహణానికి 15 రోజుల ముందు నుంచే కూడా ఈ రాశుల వారిపై ప్రభావం ఎక్కువగా పడుతుంది.

2026లో ఏర్పడే సూర్య, చంద్ర గ్రహణాల కారణంగా ఈ 4 రాశులకు సమస్యలు (pinterest)
2026లో ఏర్పడే సూర్య, చంద్ర గ్రహణాల కారణంగా ఈ 4 రాశులకు సమస్యలు (pinterest)

హిందూ ధర్మంలో గ్రహణాలకు ఉన్న ప్రాముఖ్యత ఇంతా అంతా కాదు. గ్రహణాలను అశుభంగా భావిస్తారు. గ్రహణ సమయంలో కొన్ని పనులు కూడా చేయకూడదని అంటారు. గ్రహణాల వలన ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. 2026లో వచ్చే గ్రహణాలు మానసిక, శారీరక ఒత్తిడిని కలిగిస్తాయి. అలాగే ఆర్థికపరంగా కూడా సమస్యలు కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ముందు నుంచే జాగ్రత్తగా ఉండడం మంచిది.

ఈ రాశులపై సూర్య, చంద్ర గ్రహణ ప్రభావం.. జాగ్రత్తగా ఉండాలి

1.కుంభ రాశి

2026లో ఏర్పడే మొదటి సూర్య గ్రహణం కుంభ రాశి వారిపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. 2026 ఫిబ్రవరి 17న కుంభ రాశిలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్య గ్రహణాన్ని అశుభంగా భావిస్తారు. ఈ సమయంలో ఈ రాశి వారు కెరీర్‌లో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే రిలేషన్‌షిప్‌లో కూడా అపార్థాలు ఎదురయ్యే అవకాశం ఉంది. టెన్షన్ పెరిగిపోవచ్చు. సహనంతో ఉండాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి.

2.కన్య రాశి

2026లో ఏర్పడే మొదటి చంద్ర గ్రహణం కన్య రాశి వారిని ఎక్కువ ప్రభావితం చేస్తుంది. మార్చి 3న కన్య రాశిలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది భారతదేశంలో కనిపిస్తుంది. ఈ సూతక కాలాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. చంద్రగ్రహణం హోలికా దహనం నాడు ఏర్పడబోతోంది. అయితే కన్య రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక నష్టాలు, అనారోగ్య సమస్యలు, గాయాలు, చికాకులు వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

3.కర్కాటక రాశి

2026లో ఏర్పడే రెండవ చంద్రగ్రహణం మీన రాశి వారికి సమస్యలు కలిగిస్తుంది. ఇది ఆగస్టు 28న ఏర్పడుతుంది. ఈ గ్రహణం వలన మీన రాశి వారు ప్రతికూల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఈ సమయంలో ఈ రాశి వారు మెడిటేషన్ చేయడం మంచిది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe