గ్రహణాలను అశుభంగా భావిస్తారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఏడాదికి రెండు లేదా మూడు గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రతి ఏడాది రెండు పూర్తి గ్రహణ కాలాలు ఏర్పడడం చూస్తూ ఉంటాం. 2026 ఫిబ్రవరి 17న పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనపడుతుందా లేదా, సూతక కాలం వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశంలో కనపడదు

ఫిబ్రవరి 17న ఏర్పడే ఈ పాక్షిక సూర్యగ్రహణం భారతదేశంలో కనపడదు. చిలీ, అర్జెంటీనా, అంటార్కిటికా, మారిషస్, గ్రీన్‌ల్యాండ్, ఐర్లాండ్, దక్షిణ జార్జియా, జింబాబ్వేతో పాటు పలుచోట్ల ఈ గ్రహణం కనబడుతుంది. ఈ పాక్షిక సూర్యగ్రహణం భారతదేశంలో కనపడదని తెలుస్తోంది. సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడిన రెండు వారాలు లేదా దాని కంటే ముందు ఏర్పడుతుంది.
సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుంది?
సూర్యగ్రహణం చంద్రుడు, భూమి అమావాస్య సమయంలో ఒకే సరళరేఖలో ఉన్నట్లయితే చంద్రుడి నీడ భూమిపై పడుతుంది. ఆ నీడపడిన ప్రాంతాల్లో సూర్యగ్రహణం ఏర్పడుతుంది.
వచ్చే ఏడాది గ్రహణాలు వివరాలు
ఫిబ్రవరి 17 – పాక్షిక సూర్యగ్రహణం
మార్చి 3 – సంపూర్ణ చంద్రగ్రహణం
ఆగస్టు 12 – సంపూర్ణ సూర్య గ్రహణం
ఆగస్టు 28 – పాక్షిక చంద్రగ్రహణం
సూర్యగ్రహణం సమయంలో ఎలాంటి నియమాలను పాటించాలి?
సూర్యగ్రహణం సమయంలో గ్రహణాన్ని వీక్షించడం ఒక మరిచిపోలేని అనుభూతిగా చెబుతారు. కానీ కొన్ని నియమాలను పాటించాలి. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా సూర్యుడిని నేరుగా చూడడం వలన కంటికి హాని కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సూర్యుడిని నేరుగా కంటితో చూడొద్దు. ఎక్లిప్స్ గ్లాసెస్ ధరించి సూర్యగ్రహణాన్ని చూడాలి.
సూర్య గ్రహణాల్లో రకాలు
సూర్య గ్రహణం రెండు రకాలు. అందులో ఒకటి పాక్షిక సూర్యగ్రహణం. చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా మూసివేసినప్పుడు ఈ పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ సమయంలో చూసినట్లయితే సూర్యుడు నెలవంక ఆకారంలో ఉంటాడు. మరొకటి సంపూర్ణ సూర్యగ్రహణం. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా మూసివేసినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ గ్రహణాలు కనిపించే చోట సూతక కాలం పాటించాలి. ఫిబ్రవరి 17న ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం భారతదేశంలో కనపడదు కనుక సూతక కాలం చెల్లదు.
{{/usCountry}}సూర్య గ్రహణం రెండు రకాలు. అందులో ఒకటి పాక్షిక సూర్యగ్రహణం. చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా మూసివేసినప్పుడు ఈ పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ సమయంలో చూసినట్లయితే సూర్యుడు నెలవంక ఆకారంలో ఉంటాడు. మరొకటి సంపూర్ణ సూర్యగ్రహణం. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా మూసివేసినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ గ్రహణాలు కనిపించే చోట సూతక కాలం పాటించాలి. ఫిబ్రవరి 17న ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం భారతదేశంలో కనపడదు కనుక సూతక కాలం చెల్లదు.
{{/usCountry}}