కొత్త సంవత్సరం సూర్య గ్రహణం ఎప్పుడు, భారతదేశంలో కనపడుతుందా? ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకోండి!
ప్రతి ఆరు నెలలకు ఒకసారి గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఏడాదికి రెండు లేదా మూడు గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. 2026 ఫిబ్రవరి 17న పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనపడుతుందా లేదా, సూతక కాలం వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రహణాలను అశుభంగా భావిస్తారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. ఏడాదికి రెండు లేదా మూడు గ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రతి ఏడాది రెండు పూర్తి గ్రహణ కాలాలు ఏర్పడడం చూస్తూ ఉంటాం. 2026 ఫిబ్రవరి 17న పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనపడుతుందా లేదా, సూతక కాలం వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

భారతదేశంలో కనపడదు
ఫిబ్రవరి 17న ఏర్పడే ఈ పాక్షిక సూర్యగ్రహణం భారతదేశంలో కనపడదు. చిలీ, అర్జెంటీనా, అంటార్కిటికా, మారిషస్, గ్రీన్‌ల్యాండ్, ఐర్లాండ్, దక్షిణ జార్జియా, జింబాబ్వేతో పాటు పలుచోట్ల ఈ గ్రహణం కనబడుతుంది. ఈ పాక్షిక సూర్యగ్రహణం భారతదేశంలో కనపడదని తెలుస్తోంది. సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏర్పడిన రెండు వారాలు లేదా దాని కంటే ముందు ఏర్పడుతుంది.
సూర్యగ్రహణం ఎలా ఏర్పడుతుంది?
సూర్యగ్రహణం చంద్రుడు, భూమి అమావాస్య సమయంలో ఒకే సరళరేఖలో ఉన్నట్లయితే చంద్రుడి నీడ భూమిపై పడుతుంది. ఆ నీడపడిన ప్రాంతాల్లో సూర్యగ్రహణం ఏర్పడుతుంది.
వచ్చే ఏడాది గ్రహణాలు వివరాలు
ఫిబ్రవరి 17 – పాక్షిక సూర్యగ్రహణం
మార్చి 3 – సంపూర్ణ చంద్రగ్రహణం
ఆగస్టు 12 – సంపూర్ణ సూర్య గ్రహణం
ఆగస్టు 28 – పాక్షిక చంద్రగ్రహణం
సూర్యగ్రహణం సమయంలో ఎలాంటి నియమాలను పాటించాలి?
సూర్యగ్రహణం సమయంలో గ్రహణాన్ని వీక్షించడం ఒక మరిచిపోలేని అనుభూతిగా చెబుతారు. కానీ కొన్ని నియమాలను పాటించాలి. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా సూర్యుడిని నేరుగా చూడడం వలన కంటికి హాని కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సూర్యుడిని నేరుగా కంటితో చూడొద్దు. ఎక్లిప్స్ గ్లాసెస్ ధరించి సూర్యగ్రహణాన్ని చూడాలి.
సూర్య గ్రహణాల్లో రకాలు
సూర్య గ్రహణం రెండు రకాలు. అందులో ఒకటి పాక్షిక సూర్యగ్రహణం. చంద్రుడు సూర్యుడిని పాక్షికంగా మూసివేసినప్పుడు ఈ పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఆ సమయంలో చూసినట్లయితే సూర్యుడు నెలవంక ఆకారంలో ఉంటాడు. మరొకటి సంపూర్ణ సూర్యగ్రహణం. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా మూసివేసినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ గ్రహణాలు కనిపించే చోట సూతక కాలం పాటించాలి. ఫిబ్రవరి 17న ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం భారతదేశంలో కనపడదు కనుక సూతక కాలం చెల్లదు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


