దిష్టి అనేది ఇటీవలి వచ్చిన విషయం కాదు. శతాబ్దాలుగా దీనిని ప్రజలు నమ్ముతున్నారు. జానపద సంప్రదాయాలు, నమ్మకాలు, కుటుంబ ఆచారాలలో దీనికి అర్థం ఉంది. భారతదేశంలో తమ పిల్లలకు నల్ల బొట్టు పెట్టడం నుండి టర్కీలోని ఇళ్లలో నీలిరంగు తాయెత్తులు వేలాడదీయడం వరకు, జనాలు నర దిష్టిపై విశ్వాసం కలిగి ఉన్నారు. దిష్టి గురించిన మూఢనమ్మకాలతో పాటు, ఇది సంతోషం, శ్రేయస్సు, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే భయాన్ని కూడా ప్రతిబింబిస్తుంది.
నిమ్మకాయ, పచ్చిమిర్చి

భారతదేశంలో దిష్టి తగలకుండా నివారించడానికి ఈ నిమ్మకాయ, పచ్చిమిరపకాయలను తరచుగా ఉపయోగిస్తారు. భారతదేశంలోని చాలా ఇళ్లలో, దుకాణాలలో, వాహనాలకు పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు వేలాడుతూ కనిపిస్తాయి. ఈ నిమ్మకాయలు, మిరపకాయలను వేలాడదీయడానికి ఒక నియమం కూడా ఉంది. దీని కోసం మీరు 7 తాజా పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలను ఉపయోగించాలి. సాంప్రదాయం ప్రకారం, నిమ్మకాయ పులుపు, మిరపకాయల కారం ప్రతికూల శక్తులను నాశనం చేస్తాయి.
తాయెత్తులు
ప్రజలు చెడు దృష్టిని నివారించడానికి కంటి తాయెత్తులను ధరిస్తారు. కొన్ని ప్రాంతాలలో పూసలతో చేసిన కంటి ఆకారపు తాయెత్తులను ధరిస్తే, మరికొన్ని ప్రాంతాలలో శక్తివంతమైన వేర్లతో చేసిన తాయెత్తులను ధరిస్తారు. టర్కీ, గ్రీస్‌లో ప్రజలు నీలం, తెలుపు, నలుపు రంగులలో కంటిని పోలిన ఏకకేంద్రక వృత్తాకార తాయెత్తులను ధరిస్తారు. కంటి తాయెత్తు బయటివారి చూపును నియంత్రించడంలో సహాయపడుతుందని అంటారు. కంటి చిహ్నం హానికరమైన చూపులను తిరిగి పంపినవారిపైనే ప్రతిబింబిస్తుంది. భారతదేశంలో దీనిని తరచుగా నవజాత శిశువుల బట్టలకు గుచ్చుతారు, కార్లలో వేలాడదీస్తారు. అనేక ఇళ్లలో కూడా ఇంటిని అవాంఛిత శక్తి నుండి రక్షించడానికి ప్రవేశ ద్వారాల దగ్గర కంటి తాయెత్తులను వేలాడదీస్తారు.
నల్ల దారం
భారతీయ గృహాలలో మణికట్టు, మోకాలు, చేయి లేదా నడుము, ఇప్పుడు కాలికి కూడా కట్టే ఒక సాధారణ నల్ల దారాన్ని చాలా ముఖ్యమైన రక్షణ వస్తువుగా ఉపయోగిస్తారు. నల్ల దారాన్ని కట్టడం వల్ల మనపై పడే ఏదైనా ప్రతికూల శక్తిని అది గ్రహిస్తుందని నమ్మకం. పిల్లలకు, దీనిని సాధారణంగా చీలమండ చుట్టూ కడతారు. అయితే పెద్దలు ఈ దారాన్ని తమ మణికట్టు లేదా చేయి చుట్టూ కట్టుకుంటారు. కొన్ని కుటుంబాలు దారాన్ని కట్టేటప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాయి. ఇది దారానికి మరింత శక్తిని ఇస్తుందని నమ్ముతారు.
ఉప్పు
{{/usCountry}}భారతీయ గృహాలలో మణికట్టు, మోకాలు, చేయి లేదా నడుము, ఇప్పుడు కాలికి కూడా కట్టే ఒక సాధారణ నల్ల దారాన్ని చాలా ముఖ్యమైన రక్షణ వస్తువుగా ఉపయోగిస్తారు. నల్ల దారాన్ని కట్టడం వల్ల మనపై పడే ఏదైనా ప్రతికూల శక్తిని అది గ్రహిస్తుందని నమ్మకం. పిల్లలకు, దీనిని సాధారణంగా చీలమండ చుట్టూ కడతారు. అయితే పెద్దలు ఈ దారాన్ని తమ మణికట్టు లేదా చేయి చుట్టూ కట్టుకుంటారు. కొన్ని కుటుంబాలు దారాన్ని కట్టేటప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తాయి. ఇది దారానికి మరింత శక్తిని ఇస్తుందని నమ్ముతారు.
ఉప్పు
{{/usCountry}}శతాబ్దాలుగా ఉప్పుకు శుద్ధీకరణతో సంబంధం ఉంది. అనేక భారతీయ గృహాలలో, పెద్దలు ఒక వ్యక్తి తల చుట్టూ గుప్పెడు ఉప్పును తిప్పి, ఆ తర్వాత దానిపై తూ.. తూ అని ఉమ్మి వేయమని విసిరివేయడం చూస్తునే ఉంటాం. కొందరు రాతి ఉప్పు గిన్నెలను గదుల మూలల్లో ఉంచుతారు, అది ప్రతికూల ప్రకంపనలను గ్రహిస్తుందని నమ్ముతారు. మరికొందరు భారమైన రోజుల తర్వాత శక్తివంతమైన శుద్ధి కోసం స్నానపు నీటిలో ఉప్పును కలుపుతారు. ఆధ్యాత్మిక విశ్వాసాలకు అతీతంగా కూడా, ఉప్పు శుద్ధీకరణకు, స్థిరత్వానికి ప్రతీకగా నిలుస్తుంది.