ప్రతి స్త్రీ తన జీవిత భాగస్వామికి కొన్ని మంచి గుణాలు ఉండాలని ఆశిస్తుంది. అటువంటి మంచి గుణాలు ఉన్న వ్యక్తి తన జీవితాంతం తనతో ఉండాలని కోరుకుంటుంది. చాణక్యుడు తన చాణక్య నీతిలో పురుషుని స్వభావం, గుణగణాలు, దుర్గుణాల గురించి విస్తృతంగా చెప్పాడు. అదే సమయంలో స్త్రీలు ఇష్టపడే పురుషుల గుణాలను కూడా ఆయన వర్ణించాడు. చాణక్యుని సలహా ప్రకారం.. పురుషులను గొప్పవారిగా చేసే కొన్ని గుణాలు ఉన్నాయి. ఈ గుణాలు ఉన్న పురుషుల పట్ల స్త్రీలు సహజంగానే ఆకర్షితులవుతారు. స్త్రీలు పురుషులలోని కొన్ని లక్షణాలను లేదా గుణాలను నిజంగా ఇష్టపడతారు. స్త్రీలు అలాంటి పురుషులను పొందాలని కూడా కోరుకుంటారు. ఆ 5 గుణాలు ఏంటో చూడండి.
నిజాయితీ

నిజాయితీ అనేది ప్రతిఒక్కరూ కలిగి ఉండాల్సిన ఒక అవసరమైన గుణం. సంబంధాలలో నిజాయితీగా ఉండేవారికి గౌరవం ఎల్లప్పుడూ లభిస్తుందని చాణక్యుడు చెప్పాడు. స్త్రీలను గౌరవప్రదమైన ఉద్దేశాలతో సంప్రదించే పురుషులు తమ భాగస్వాములను ఎన్నడూ మోసం చేయరు. పురుషులలోని ఈ గుణం స్త్రీలకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అటువంటి పురుషులు తమ సంబంధాన్ని బలోపేతం చేయడానికి నిరంతర ప్రయత్నాలు చేస్తారు. తమ సంబంధానికి ఎన్నడూ ద్రోహం చేయరు.
క్రమశిక్షణ
మంచి నడవడిక, మధురమైన మాటలు, సౌమ్యమైన ప్రవర్తన వంటి లక్షణాలను మహిళలు పురుషులలో కోరుకుంటారు. ఈ లక్షణాలున్న పురుషులు మహిళలను సులభంగా ఆకర్షిస్తారు. ఇలాంటి లక్షణాలున్న పురుషులు తమ మధురమైన మాటలతో ఇతరుల మనసులను గెలుచుకుంటారు. ఈ లక్షణాలు మహిళలకు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. పురుషులు ఇతరులతో ప్రవర్తించే తీరును మహిళలు ఎల్లప్పుడూ చాలా నిశితంగా గమనిస్తూ ఉంటారు.
వినే సామర్థ్యం
ప్రతి స్త్రీ తన భర్త నీడలా ఎల్లప్పుడూ తన పక్కనే ఉండాలని కోరుకుంటుంది. తమ అవసరాలను వినే వ్యక్తి కావాలని వారు కోరుకుంటారు. వారికి మాట్లాడే సామర్థ్యం ఉంటే, వినే ధైర్యం కూడా ఉండాలి. స్త్రీలు దీనిని ఒక మంచి పురుషుడి లక్షణంగా భావిస్తారు. స్త్రీలు చెప్పేది విని, వారి మాటలను నిర్లక్ష్యం చేయని పురుషుడినే ఎల్లప్పుడూ కోరుకుంటారు.
భద్రత
తనకు భద్రతను కల్పించే పురుషులను ఏ స్త్రీ అయినా ప్రేమిస్తుంది. స్త్రీలు భద్రతను అందించే పురుషులను ప్రేమిస్తారు. ఒక స్త్రీ ఒక పురుషునితో సురక్షితంగా ఉన్నట్లు భావించినప్పుడు, ఆమె ఆ పురుషుడిని గుడ్డిగా నమ్మడం ప్రారంభిస్తుంది.
గౌరవం
{{/usCountry}}తనకు భద్రతను కల్పించే పురుషులను ఏ స్త్రీ అయినా ప్రేమిస్తుంది. స్త్రీలు భద్రతను అందించే పురుషులను ప్రేమిస్తారు. ఒక స్త్రీ ఒక పురుషునితో సురక్షితంగా ఉన్నట్లు భావించినప్పుడు, ఆమె ఆ పురుషుడిని గుడ్డిగా నమ్మడం ప్రారంభిస్తుంది.
గౌరవం
{{/usCountry}}చాణక్యుడి ప్రకారం.. ఇతరులను గౌరవించడం తెలిసిన పురుషుల పట్ల స్త్రీలు సులభంగా ఆకర్షితులవుతారు. అది ప్రేమ సంబంధం అయినా, వివాహం అయినా, ఎవరినీ గౌరవించకుండా ఇతరులను బాధపెట్టే పురుషులను స్త్రీలు ఎన్నటికీ ఇష్టపడరు. స్త్రీలు పురుషుడి నుండి ఆశించే అతిపెద్ద విషయం సమానత్వం. ఈ విషయం కత్చితంగా ప్రతీ ఒక్క పురుషుడు గుర్తుపెట్టుకోవాలని చాణక్యుడు చెబుతున్నాడు.