సూర్యుడికి ఇష్టమైన పుష్పాలు ఏవి, స్త్రీలు సూర్య నమస్కారాలు చేయవచ్చా, సూర్య రథానికి సంకేతం? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసా?

మనకు తెలియని అనేక విషయాలను మనం పాటిస్తూ ఉంటాము. కానీ వాటి వెనుక అర్ధం ఉంటుంది. సూర్యుడికి ఇష్టమైన పుష్పాలు, సూర్యునికి అర్ఘ్య ప్రధానం చేయడం వలన కలిగే ఫలితాలు, స్త్రీలు సూర్య నమస్కారాలు చేయవచ్చా, సూర్య రథానికి సంకేతం, పూజలు, భజనలు, దేవుని ఉత్సవాలు, తీర్థయాత్రలకు వెళ్లడం వలన కలిగే లాభాలు తెలుసుకోండి.

Published on: Feb 7, 2026, 15:01:10 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

1.సూర్యుడికి ఇష్టమైన పుష్పాలు ఏవి?

సూర్యుడికి పువ్వులు అంటే ఎంతో ప్రీతి. వీటిని సూర్యుడికి సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. సూర్య నారాయణ మూర్తి ప్రత్యేక అనుగ్రహం కూడా కలుగుతుంది. సూర్యుడికి అవిసె పూలు, మోదుగ పూలు, మొగలి పూలు, బృంగరాజ, శమీ అంటే ఎంతో ఇష్టం. అలాగే విష్ణు తులసి, కృష్ణ తులసి, రక్త చందనం అంటే సూర్యుడికి చాలా ఇష్టం. ఇదే విషయం భవిష్య పురాణం చెబుతోంది.

సూర్యుడికి ఇష్టమైన పుష్పాలు ఏవి, స్త్రీలు సూర్య నమస్కారాలు చేయవచ్చా, సూర్య రథానికి సంకేతం? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసా? (pinterest)
సూర్యుడికి ఇష్టమైన పుష్పాలు ఏవి, స్త్రీలు సూర్య నమస్కారాలు చేయవచ్చా, సూర్య రథానికి సంకేతం? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసా? (pinterest)

2.సూర్యునికి అర్ఘ్య ప్రధానం చేయడం వలన కలిగే ఫలితాలు

సూర్యునికి అర్ఘ్య ప్రధానం చేయడం వలన సూర్యుని అనుగ్రహం కలుగుతుంది. సూర్యుని ప్రసన్నతతో ఆయురారోగ్యాలు, ధన, ధాన్యాలు, క్షేత్రం, పుత్రులు, కలత్రం, మిత్రులు, తేజస్సు, యశస్సు, కాంతి, విద్య, సౌభాగ్యం, వైభవాలు కలుగుతాయి.

3.స్త్రీలు సూర్య నమస్కారాలు చేయవచ్చా?

చాలా మంది స్త్రీలకు ఉండే సందేహం ఇది. స్త్రీలు సూర్య నమస్కారం చేయవచ్చా, చేయకూడదా అనే విషయంలో ఎలాంటి అభ్యంతరం లేదు. స్త్రీలు సూర్య నమస్కారాలు చేయవచ్చు. సూర్య నమస్కారాలకు స్త్రీలు, పురుషులు అనే భేదం లేదని గుర్తు పెట్టుకోండి. పురుషులు సాష్టాంగ నమస్కారం, స్త్రీలు పంచాంగ నమస్కారం చేయాలి.

4.సూర్య రథానికి సంకేతం ఏమిటి?

సూర్యుడు తన రథంపై ఏడు గుర్రాలతో కనపడతాడు. అతిథి, కశ్యపుల పుత్రుడైన సూర్యుడు బంగారు రథం ఎక్కి మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సూర్యుడి బంగారు రథానికి ఒకే ఒక్క చక్రం ఉంటుంది. ఆ చక్రానికి ఆరు ఆకులు ఉంటాయి. రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి.

ఒక చక్రం సంవత్సరానికి సంకేతం, ఆరు ఆకులు ఆరు ఋతువులకు సంకేతం, ఏడు గుర్రాలు ఏడు కిరణాలకు ప్రతీకగా చెబుతారు. సర్వసాక్షి, భూతుడైన సూర్యుడు కాలానికి కర్త. అందుకనే మన ప్రాచీనులు ఈ విషయాన్ని ప్రతీకాత్మకంగా వివరించారు.

5.పూజలు, భజనలు, దేవుని ఉత్సవాలు, తీర్థయాత్రలకు వెళ్లడం వలన కలిగే లాభాలు ఏమిటి?

చాలా మంది రకరకాల పూజలు చేస్తారు. అలాగే ఎవరైనా పూజలు చేసుకుంటే వారి ఇంటికి వెళ్తారు. భజనలు, దేవుని ఉత్సవాల్లో కూడా పాల్గొంటారు. అలాగే చాలా మంది తీర్థ యాత్రలకు వెళ్లడాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. ఇవి చేయడం వలన కలిగే లాభం ఏంటి? భగవంతుడికి పూజలు, భజనలు చేయడం, ఉత్సవాలు జరిపించడం, వాటిని చూడడానికి వెళ్లడం, తీర్థయాత్రలకు వెళ్లడం వలన చాలా మంచి జరుగుతుంది.

ముఖ్యంగా మనసులో దైవచింతనే ఉంటుంది. దైవ సంబంధిత ఆలోచనలు మనల్ని ఆధ్యాత్మిక జీవనం వైపుకు మళ్లించి ప్రశాంతతను ఇస్తాయి. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వలన ఆధ్యాత్మిక జీవనానికి సాధనాలుగా ఉపయోగపడతాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More