కలలో గుర్రం, గాడిద కనపడితే మంచిదేనా? ఈ కలలు వస్తే మాత్రం అదృష్టం, ధన లాభం, నూతన వస్తు ప్రాప్తి!
స్వప్నశాస్త్రం ఆధారంగా మనకు వచ్చే కలలను బట్టి ఎలాంటి ఫలితాలు కలగవచ్చో తెలుసుకోవచ్చు. మనం నిద్రపోయినప్పుడు చాలా కలలు వస్తూ ఉంటాయి. కొన్ని కలలు శుభప్రదమైనవి, అలాగే కొన్ని చెడు జరగబోతోందని తెలిపేవి. అయితే ఈ కలలు వస్తే దానికి అర్థం ఏమిటి, ఎలాంటి ఫలితాలను పొందవచ్చు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరికీ కూడా కలలు వస్తూ ఉంటాయి. కలలను బట్టి ఫలితాలను పొందుతారని స్వప్నశాస్త్రం ప్రకారం భావిస్తారు. ఈరోజు కొన్ని కలలు, వాటి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. ఇలాంటి కలలు వస్తే ఎంతో అదృష్టం. ధన లాభం కలుగుతుంది. నూతన వస్తు ప్రాప్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి, కీర్తి, ప్రతిష్టలు కలుగుతాయట.

స్వప్నశాస్త్రం
స్వప్నశాస్త్రం ఆధారంగా మనకు వచ్చే కలలను బట్టి ఎలాంటి ఫలితాలు కలగవచ్చో తెలుసుకోవచ్చు. మనం నిద్రపోయినప్పుడు చాలా కలలు వస్తూ ఉంటాయి. కొన్ని కలలు శుభప్రదమైనవి, అలాగే కొన్ని చెడు జరగబోతోందని తెలిపేవి. అయితే ఈ కలలు వస్తే దానికి అర్థం ఏమిటి, ఎలాంటి ఫలితాలను పొందవచ్చు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కొన్ని కలలు.. వాటి ఫలితాలు
కలలో మాంత్రికులు కనపడితే, మీరు ఎవరి చేతుల్లోనైనా మోసపోబోతున్నారని అర్థం.
కలలో గుర్రం, గాడిద కనపడితే ధన లాభం కలుగుతుందని, కష్టాలు త్వరలోనే తీరిపోతాయని అర్థం. ఇలాంటి కలలు వస్తే జీవితంలో ఆనందం కూడా ఉంటుంది.
చీమలు బారులు తీరి వెళుతున్నట్లు కలలో కనిపించినట్లయితే ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుందని అర్థం. అలాగే ఆ వ్యక్తికి కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి, ధన లాభం కూడా కలుగుతుంది. ఇలా ఆ వ్యక్తి జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి.
కలలో ఏనుగు కనపడితే కూడా ఎంతో మంచి జరుగుతుంది. ఏనుగు కలలోకి వస్తే, నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది. విందు భోజనానికి వెళ్తారు.
కలలో సూర్యుడు ఇంటి పైకి వచ్చినట్టు కనపడినట్లైతే ఇల్లు అగ్నికి ఆహుతి అవుతుందని అర్థం.
కలలో బ్రాహ్మణుడు కనపడినట్లైతే అనారోగ్యం రాబోతుందని అర్థం. ఇలాంటి కలలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి.
కలలో ఇతరులను ఉరి తీస్తున్నట్లు కనబడితే ప్రమాదాలు, కష్ట నష్టాలు రావచ్చని అర్థం. ఇలాంటి కలలు వచ్చినప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి.
కలలో తోకచుక్కలు భూమిపైకి పడుతున్నట్లు కనిపించినట్లయితే మన దేశానికి ఆపద, కరువు, కాటకాలు, రాజకీయ కలహాలు, దుర్భిక్షం వంటివి కలగబోతున్నాయని అర్థం.
కలలో బట్టతలతో ఉన్నవారు కనిపిస్తే ఆ వ్యక్తికీ ధన లాభం కలగబోతోందని అర్థం చేసుకోవాలి.
కలలో అధికారులు, పదవిలో ఉన్న మంత్రులు కనిపించినట్లయితే అభివృద్ధి కలగబోతోందని అర్థం చేసుకోవాలి.
అదే గురువులు, తల్లిదండ్రులు, పెద్దలు వంటి వారు కనిపించినట్లయితే ధన లాభం కలగబోతోందని అర్థం.
ఆకాశంలో నక్షత్రాలు గుంపులుగా ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తే మిత్రుల కారణంగా కార్యజయము కలగబోతోందని అర్థం.
కలలో వైశ్యుణ్ని చూసినట్లయితే ఎక్కువ సౌఖ్యం కలగబోతోందని అర్థం.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


