ధన ధాన్యాలు, ఐశ్వర్యం, భర్త ఆదాయం పెరగడానికి సులువైన పరిహారాలు.. ఈరోజు మాఘ పౌర్ణమి వేళ వీటిని పాటిస్తే తిరుగుండదు!

మాఘ పౌర్ణమి నాడు సూర్యుడిని, అమ్మవారిని ఆరాధిస్తే ఆయుష్షు పెరుగుతుంది, చాలా రకాల సమస్యలు తొలగిపోతాయి. ఇక మాఘ పౌర్ణమి నాడు చేయాల్సిన పనులు, దానాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. మాఘ పౌర్ణమి నాడు ఈ పనులు చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. 

Published on: Feb 1, 2026, 06:00:38 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఈ ఏడాది మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 1, అంటే ఈరోజే వచ్చింది. మాఘ పౌర్ణమి (Magha Pournami 2026) నాడు అరుదైన యోగాలు కూడా ఏర్పడుతున్నాయి. మాఘ పౌర్ణమి నాడు సూర్యుడిని, అమ్మవారిని ఆరాధిస్తే ఆయుష్షు పెరుగుతుంది, చాలా రకాల సమస్యలు తొలగిపోతాయి. ఇక మాఘ పౌర్ణమి నాడు చేయాల్సిన పనులు, దానాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. మాఘ పౌర్ణమి నాడు ఈ పనులు చేస్తే ఎంతో మంచి జరుగుతుంది.

ఈరోజు మాఘ పౌర్ణమి వేళ వీటిని పాటిస్తే తిరుగుండదు (pinterest)
ఈరోజు మాఘ పౌర్ణమి వేళ వీటిని పాటిస్తే తిరుగుండదు (pinterest)

మాఘ పౌర్ణమి నాడు ఏం చెయ్యాలి?

మాఘ పౌర్ణమి నాడు సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి. గంగా, యమునా లాంటి పవిత్ర నదుల్లో స్నానం చేయడం ఎంతో పుణ్యం. అలాగే స్నానం చేసిన తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి.

విష్ణువును, లక్ష్మీదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి, కోరిన కోరికలు నెరవేరుతాయి, ఆనందంగా ఉండొచ్చు. అలాగే మాఘ పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతం చేసుకుంటే కూడా శుభ ఫలితాలు కలుగుతాయి.

ఈరోజు పేదలకు అన్నదానం, వస్త్రదానం వంటివి చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. సకల సంతోషాలు అందుతాయి.

తులసి మొక్క, రావి చెట్టు దగ్గర పూజలు చేయడం వలన శుభఫలితాలు కలుగుతాయి. అలాగే దీపారాధన కూడా చేయండి.

గోవులకు ఆహారం ఇవ్వడం, గోదానం చేయడం వంటివి కూడా శుభఫలితాలను తీసుకువస్తాయి.

మాఘ పౌర్ణమి నాడు ఉపవాసం ఉండి, ధ్యానం చేసి, చంద్రదర్శనం చేసుకుంటే చక్కటి ఫలితాలను చూస్తారు.

మాఘ పౌర్ణమి 2026 వేళ చేయాల్సిన దానాలు

మాఘ పౌర్ణమి నాడు దానాలు చేయడం వలన ఎంతో మంచి జరుగుతుంది. గోవులకు ఆహారం ఇస్తే ఎంతో పుణ్యం వస్తుంది. అలాగే కష్టాలు తొలగిపోతాయి, పూర్వికుల ఆశీర్వాదాలు లభిస్తాయి, ఐక్యత కూడా పెరుగుతుంది. అన్నదానం, వస్త్రదానం వంటివి చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అదృష్టం తలుపు తెరుచుకుంటుంది. మాఘ పౌర్ణమి నాడు ఏ పనులు చేసినా 100 రెట్లు ఎక్కువ ఫలితాన్ని పొందవచ్చు. ఈరోజు భక్తి, దానం, ధ్యానంతో సమయాన్ని గడిపితే ఎంతో మంచిది.

రవి యోగం, సిద్ధి యోగం, అమృతసిద్ధి యోగం

ఈ మాఘ పౌర్ణమి నాడు రవి పుష్యమి యోగం ఏర్పడుతోంది. అలాగే తరువాత సిద్ధి యోగం, అమృతసిద్ధి యోగం కూడా ఏర్పడడంతో ఈ రోజు విశేషత మరింత పెరిగింది. కాబట్టి ఈరోజు కచ్చితంగా పూజలు, దానాలు, కొన్ని రకాల పరిహారాలు తప్పక పాటించడం మంచిది. దీని వల్ల అక్షయ ఫలితాలను పొందవచ్చు.

లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది పౌర్ణమి తిథి వేళ స్త్రీలు ఇలా చేస్తే మంచిది

పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కనుక స్త్రీలు ఉదయాన్నే తలస్నానం చేసి దీపారాధన చేసుకోవాలి. గుమ్మానికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టాలి. ఇంటి ముందు బియ్యం పిండితో పద్మం వేయాలి. గంధంతో గుమ్మం బయట స్వస్తిక్ వేయండి. దీంతో శుభ ఫలితాలు కలుగుతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

ఈరోజు పాలు పొంగించి లక్ష్మీదేవికి పరమాన్నం నివేదనగా సమర్పించండి. దీంతో అపారమైన ధనయోగం కలుగుతుంది.

నది స్నానం చేయడం వలన జన్మజన్మ పాపాలు తొలగిపోతాయి, స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది.

ఈరోజు బంగారం కొంటే అక్షయంగా మారుతుంది, అదృష్టం కూడా ఎక్కువవుతుంది.

ఒక గాజు గిన్నెలో ఉప్పు పోసి వంటగదిలో పెట్టితే ధన ధాన్యాలు పెరుగుతాయి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు.

ఈరోజు మాంసాహారం తింటే మాత్రం ఐశ్వర్యం నశిస్తుందని గుర్తుపెట్టుకోండి.

పౌర్ణమి నాడు సాయంత్రం తులసి మొక్క దగ్గర నెయ్యితో దీపారాధన చేసి 11 సార్లు ప్రదక్షిణ చేస్తే భర్త ఆదాయం పెరుగుతుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More