ఈరోజు మామూలు పౌర్ణమి కాదు తోడేళ్ళ పౌర్ణమి.. ఈ మూడు రాశుల వారికి విపరీతమైన అదృష్టంతో పాటు బోలెడు లాభాలు!
పుష్య పౌర్ణమి చాలా విశేషమైనది. అందులోనూ ఈ పుష్య పౌర్ణమి నాడు చంద్రుడు మరింత కాంతితో ప్రకాశవంతంగా కనిపించబోతున్నాడు. ఇది వుల్ఫ్ సూపర్ మూన్. 2026లో వచ్చే తొలి పౌర్ణమి ఇది. సాధారణ పౌర్ణమిలా కాదు. ఇది వుల్ఫ్ సూపర్ మూన్. పౌర్ణమి కంటే 14% పెద్దగా, 30% ఎక్కువ ప్రకాశంతో చంద్రుడు దర్శనం ఇవ్వబోతున్నాడు.
ఈరోజు పుష్య పౌర్ణమి. పుష్య మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశేషమైనది. అందులోనూ ఈ పుష్య పౌర్ణమి నాడు చంద్రుడు మరింత కాంతితో ప్రకాశవంతంగా కనిపించబోతున్నాడు. ఇది వుల్ఫ్ సూపర్ మూన్. 2026లో వచ్చే తొలి పౌర్ణమి ఇది. సాధారణ పౌర్ణమిలా కాదు. ఇది వుల్ఫ్ సూపర్ మూన్. సాధారణ పౌర్ణమి కంటే 14% పెద్దగా, 30% ఎక్కువ ప్రకాశంతో చంద్రుడు దర్శనం ఇవ్వబోతున్నాడు.

వుల్ఫ్ మూన్ (తోడేళ్ళ పౌర్ణమి) అనే పేరు ఎలా వచ్చింది?
ఈ పౌర్ణమికి వుల్ఫ్ మూన్/ తోడేళ్ళ పౌర్ణమి అనే పేరు రావడం వెనుక ప్రత్యేక కారణం ఉంది. ఉత్తర అమెరికాలో ఉన్న ప్రజల విశ్వాసాల ప్రకారం, జనవరి నెలలో శీతాకాల తీవ్రత కారణంగా తోడేళ్లు ఎక్కువగా మూలుగుతూ ఉంటాయి. అలా ఈ పౌర్ణమికి వుల్ఫ్ మూన్ అనే పేరు వచ్చిందని అంటారు.
పుష్య పౌర్ణమి పూజ, దానం
పౌర్ణమి నాడు ఉపవాసం ఉండి విష్ణువును, లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. సత్యనారాయణ వ్రతం చేసుకుంటే కూడా మంచి జరుగుతుందని భావిస్తారు. నల్ల నువ్వులు, బట్టలు, ఆహార ధాన్యాలను దానం ఇస్తారు. కొందరు హరే కృష్ణ మహా మంత్ర జపం చేస్తారు. భగవద్గీత పఠనం చేస్తే కూడా మంచి జరుగుతుందని భావిస్తారు.
పాలు, బియ్యం, తెల్లని వస్త్రాలు, వెండి వంటి వాటిని దానం చేస్తే చంద్ర దోషాల నుంచి బయట పడడానికి వీలవుతుంది. శివుడిని ఆరాధిస్తే జాతకంలో చంద్రుని స్థానం బలపడుతుంది. పైగా ఈరోజే ఆరుద్రోత్సవం, శివ ముక్కోటి కూడా రావడం మరింత విశేషం. అయితే ఈ రోజు ఈ మూడు రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది.
ఈరోజు ఈ మూడు రాశుల వారికి విపరీతమైన అదృష్టంతో పాటు బోలెడు లాభాలు
1.వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ రోజు బాగా కలిసి రాబోతోంది. ఇంక్రిమెంట్లు లేదా ప్రమోషన్లు రావచ్చు. ఉద్యోగ అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. వ్యాపారులకు కూడా ఇది అద్భుతమైన సమయం.
2.సింహ రాశి
సింహ రాశి వారికి కూడా బాగా కలిసి రాబోతోంది. సంపాదన పెరుగుతుంది. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. సమాజంలో గౌరవం, మర్యాదలు కూడా పెరుగుతాయి.
3.ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి కూడా ఇది అద్భుతమైన సమయం. ఈ రోజు ఈ రాశి వారు ముఖ్యమైన ప్రాజెక్టులను చేపడతారు. ఆర్థికపరంగా కూడా బాగుంటుంది. సంతోషం కూడా ఎక్కువ అవుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


