రేపే పుష్య పౌర్ణమి.. ఈ పరిహారాలతో నవగ్రహాల బాధల నుంచి బయటపడచ్చు.. ప్రేమ జీవితాన్ని మరింత ఆనందంగా మార్చుకోవచ్చు!

పుష్య పౌర్ణమి నాడు చేసే స్నాన, దానాలకు కూడా ఎంతో గొప్ప పుణ్యఫలితాన్ని పొందడానికి వీలవుతుంది. పుష్య పౌర్ణమి నాడు కొన్ని దానాలు చేయడం, పూజలు చేయడం, పద్ధతులను పాటించడం వలన నవగ్రహాలను కూడా శాంతింప చేయవచ్చు. కొన్ని ప్రత్యేకమైన పద్ధతులను పాటించడం వలన గ్రహాల కారణంగా ఏర్పడే సమస్యల నుంచి బయటపడవచ్చు.

Published on: Jan 2, 2026, 12:00:53 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

జనవరి 3న వచ్చే పుష్య పౌర్ణమి చాలా విశేషమైనది. పుష్య పౌర్ణమి నాడు కొన్ని పరిహారాలను పాటించడం వలన విశేష ఫలితాలను పొందడానికి వీలవుతుంది. పుష్య పౌర్ణమి నాడు చేసే స్నాన, దానాలకు కూడా ఎంతో గొప్ప పుణ్యఫలితాన్ని పొందడానికి వీలవుతుంది. పుష్య పౌర్ణమి నాడు కొన్ని దానాలు చేయడం, పూజలు చేయడం, పద్ధతులను పాటించడం వలన నవగ్రహాలను కూడా శాంతింప చేయవచ్చు. నవగ్రహాల కారణంగా ఏర్పడే సమస్యల నుంచి బయటపడవచ్చు.

రేపే పుష్య పౌర్ణమి.. ఈ పరిహారాలతో నవగ్రహాల బాధల నుంచి బయటపడచ్చు (pinterest)
రేపే పుష్య పౌర్ణమి.. ఈ పరిహారాలతో నవగ్రహాల బాధల నుంచి బయటపడచ్చు (pinterest)

పుష్య పౌర్ణమి ఈసారి ఎప్పుడు వచ్చింది? ఆ రోజు ఏం చేయాలి?

పౌర్ణమి జనవరి 3, అనగా రేపు వచ్చింది. కొన్ని ప్రత్యేకమైన పద్ధతులను పాటించడం వలన గ్రహాల కారణంగా ఏర్పడే సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆ రోజు ఏం చేయాలి అనేది ఇప్పుడే తెలుసుకుందాం.

గ్రహాలను ఎలా శాంతింప చేయవచ్చు? దోషాలను తగ్గించడానికి ఏ పద్ధతులను పాటించాలి?

1.సూర్యుని కారణంగా దోషాలు తగ్గాలంటే

సూర్య కారణంగా దోషాలు తగ్గాలంటే కొన్ని పరిహారాలను పాటించండి. పుష్య పౌర్ణమి నాడు సూర్యుడిని శాంతింప చేయడానికి గోధుమలను దానం చేయండి. రాగి వస్తువులు, బెల్లం దానం చేస్తే కూడా మంచిదే. అవసరమైన వారికి ఆహారాన్ని పెట్టడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. జాతకంలో సూర్యుడు స్థానం బలపడుతుంది. దాంతో కెరీర్‌లో కూడా ఉత్తమ ఫలితాలను చూడొచ్చు.

2.చంద్రుడిని శాంతింప చేయడానికి ఏం చేయాలి?

చంద్ర దోషాల నుంచి బయట పడడానికి, చంద్రుని కారణంగా ఇబ్బందులు కలగకుండా ఉండడానికి తెల్లని వస్తువులను దానం చేయండి. పాలు, బియ్యం, తెల్లని వస్త్రాలు, వెండి వంటి వాటిని దానం చేయవచ్చు. అలాగే ఆ రోజు శివుడిని ఆరాధిస్తే జాతకంలో చంద్రుని స్థానం బలపడుతుంది. దీంతో శుభ ఫలితాలను పొందవచ్చు, ప్రశాంతంగా ఉండవచ్చు.

3.శని బాధల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి?

పుష్య పౌర్ణమి నాడు శని బాధల నుంచి బయటపడడానికి నల్ల నువ్వులను దానం చేయండి. ఇనుము వస్తువులను దానం చేస్తే కూడా మంచిదే. అలాగే శివుణ్ని, హనుమంతుణ్ని పూజించండి.

4.శుక్ర దోషం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి?

పుష్య పౌర్ణమి నాడు శుక్ర దోషం నుంచి బయటపడడానికి పెరుగు, బియ్యం, పంచదార, తెల్లని వస్త్రాలను దానం చేయండి. ఇలా చేయడం వలన వైవాహిక జీవితంలో ప్రేమ, సంతోషం పెరుగుతాయి.

5.బుధుని అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి?

బుధ బాధల నుంచి బయటపడడానికి, బుధుని అనుగ్రహం పొందడానికి ఈ పుష్య పౌర్ణమి నాడు ఆకుపచ్చని కూరగాయలను దానం చేయండి. ఆకుపచ్చని పప్పులను కూడా దానం చేయవచ్చు. అలాగే ఏమీ లేని వారికి, పేదవారికి తోచినది దానం చేయండి. దీంతో చక్కటి ఫలితాలను చూస్తారు. విద్య, వ్యాపారాల్లో కూడా బాగా కలిసి వస్తుంది.

6.కుజ బాధలు తొలగిపోవాలంటే ఏం చేయాలి?

పుష్య పౌర్ణమి నాడు కుజ బాధలు తొలగిపోవాలంటే బెల్లం, ఆకుపచ్చని పప్పులు, ఎర్రటి వస్త్రాలను దానం చేయండి. హనుమాన్ చాలీసాను చదవండి.

7.గురువు అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి?

పుష్య పౌర్ణమి నాడు గురుగ్రహం వలన ఏ ఇబ్బంది కలగకుండా ఉండడానికి కుంకుమపువ్వు, పసుపు, చందనాన్ని దానం చేయండి. అలాగే అదృష్టం వచ్చి సక్సెస్‌ను కూడా అందుకుంటారు.

8.రాహు–కేతువుల దోషాల నుంచి ఎలా బయటపడవచ్చు?

రాహు, కేతు దోషాల నుంచి బయటపడడానికి పుష్య పౌర్ణమి నాడు మినప్పప్పు, ఆవాల నూనె, నల్ల నువ్వులను దానం చేయండి. పేదవారికి సహాయం చేయండి. దీంతో ఈ రెండు నీడ గ్రహాల ప్రభావం నుంచి బయటపడవచ్చు. కాలభైరవుని అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More