సూర్య, చంద్రుల కలయికతో ఏర్పడే వ్యతిపాత యోగంతో ఈ 4 రాశులకు సమస్యలు.. ఆర్థిక ఇబ్బందులు, టెన్షన్లు!
మార్చి 5న సూర్యుడు, చంద్రుడు సంయోగం చెంది ఈ వ్యతిపాత యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ యోగం మార్చి 5 వరకు ఉంటుంది. అయితే ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఇది ఛాలెంజ్‌గా మారబోతుంది. మరి ఏ రాశుల వారికి ఈ వ్యతిపాత యోగం కాస్త సమస్యలను తీసుకురాబోతోంది? ఏ రాశులు వారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు, అది అన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. కొత్త సంవత్సరంలో కూడా కొన్ని ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు ఉంది. మార్చి 2026లో వ్యతిపాత యోగం ఏర్పడనుంది. ఇది సూర్య, చంద్రుల కలయికతో ఏర్పడనుంది. జ్యోతిష్యం ప్రకారం చూసినట్లయితే, వ్యతిపాత యోగం అనేది చాలా ముఖ్యమైనది. కొన్ని సార్లు ఇది అశుభ ఫలితాలను తీసుకొస్తుంది.

పంచాంగం ప్రకారం చూసినట్లయితే, మార్చి 5న మధ్యాహ్నం 3:00 గంటలకు సూర్యుడు, చంద్రుడు సంయోగం చెంది ఈ వ్యతిపాత యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఈ యోగం మార్చి 5 వరకు ఉంటుంది. అయితే ఈ సమయంలో కొన్ని రాశుల వారికి ఇది ఛాలెంజ్‌గా మారబోతుంది. మరి ఏ రాశుల వారికి ఈ వ్యతిపాత యోగం కాస్త సమస్యలను తీసుకురాబోతోంది? ఏ రాశులు వారు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్య, చంద్రుల కలయికతో వ్యతిపాత యోగం.. ఈ రాశులకు సమస్యలు రావచ్చు
1.వృషభ రాశి:
వృషభ రాశి వారికి సూర్యచంద్రుల కలయికతో ఏర్పడే ఈ యోగం శుభ ఫలితాలను తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోవాలి. పెద్దల సహాయం తీసుకుంటే మంచిది. ముఖ్యమైన నిర్ణయాలను ఈ యోగం సమయంలో తీసుకోకుండా ఉండడం మంచిది.
2.కన్యా రాశి:
కన్యా రాశి వారికి కూడా సూర్య, చంద్రుల కలయికతో ఏర్పడే వ్యతిపాత యోగం సమస్యలను తీసుకు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికపరంగా నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది.
3.మకర రాశి:
మకర రాశి వారికి కూడా ఈ వ్యతిపాత యోగం సమస్యలను తీసుకొచ్చే అవకాశం ఉంది. సూర్య, చంద్రుల కలయికతో ఏర్పడే ఈ యోగం ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది. కన్ఫ్యూజన్ ఎక్కువవుతుంది. రిలేషన్‌షిప్‌లో కూడా సమస్యలు వస్తాయి. అసంతృప్తి కలుగుతుంది. గొడవలు ఎక్కువ అవుతాయి. ఖర్చుల విషయంలో సడన్‌గా ఎన్నో మార్పులు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది.
4.మీన రాశి:
మీన రాశి వారికి మార్చి 2026లో ఏర్పడే వ్యతిపాత యోగం సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యమైన పనులు చేసేటప్పుడు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మానసికంగా కాస్త కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఆర్థికపరంగా కూడా ఇబ్బందులు రావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


