వందేళ్ళ తర్వాత కుంభ రాశిలో త్రిగ్రాహి యోగం, ఈ రాశుల వారికి వరం.. కొత్త ప్రాజెక్టులు, డబ్బు, శుభవార్తలతో పాటు ఎన్నో

కొన్ని కొన్ని సార్లు కొన్ని గ్రహాల కలయిక ఏర్పడుతుంది. దాంతో శక్తివంతమైన యోగాలు ఏర్పడతాయి. ఫిబ్రవరి నెలలో త్రిగ్రాహి యోగం కుంభ రాశిలో ఏర్పడబోతోంది. బుధుడు, సూర్యుడు, శుక్రుల కలయికతో ఈ యోగం ఏర్పడనుంది. ఇది కొన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకురాబోతోంది.

Published on: Jan 24, 2026, 10:00:22 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో 12 రాశుల వారి జీవితాల్లో శుభయోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు కొన్ని గ్రహాల కలయిక ఏర్పడుతుంది. దాంతో శక్తివంతమైన యోగాలు ఏర్పడతాయి. ఫిబ్రవరి నెలలో త్రిగ్రాహి యోగం కుంభ రాశిలో ఏర్పడబోతోంది. బుధుడు, సూర్యుడు, శుక్రుల కలయికతో ఈ యోగం ఏర్పడనుంది. ఇది కొన్ని రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులను తీసుకురాబోతోంది.

వందేళ్ళ తర్వాత కుంభ రాశిలో త్రిగ్రాహి యోగం (pinterest)
వందేళ్ళ తర్వాత కుంభ రాశిలో త్రిగ్రాహి యోగం (pinterest)

మూడు గ్రహాల సంయోగం

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలిక చాలా ముఖ్యమైనది. అలాగే గ్రహాల సంయోగం కూడా చాలా విశేషమైనది. కొన్ని కొన్ని సార్లు కొన్ని గ్రహాల కలయిక ఏర్పడుతుంది. దాంతో విశేషమైన యోగాలు ఏర్పడతాయి. ఫిబ్రవరి 2026లో మూడు గ్రహాల కలయిక చోటు చేసుకోబోతుంది. బుధుడు తెలివితేటలు, వ్యాపారం మొదలైన వాటికి కారకుడు.

సూర్యుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వంటి వాటికి కారకుడు. శుక్రుడు డబ్బు, విలాసాలు, సంతోషం మొదలైన వాటికి కారకుడు. ఈ మూడు గ్రహాల కలయికతో 12 రాశుల వారి జీవితాల్లో అద్భుతం చోటు చేసుకోబోతోంది. కొన్ని రాశుల వారు మాత్రం భారీగా లాభాలను పొందుతారు.

ఫిబ్రవరిలో త్రిగ్రాహి యోగం.. ఈ రాశుల వారికి వరం

1.మేష రాశి

మేష రాశి వారికి ఈ యోగం శుభ ఫలితాలను తీసుకు రాబోతోంది. ఈ సమయంలో ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. భారీగా లాభాలను పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. ఆదాయం ఎక్కువవుతుంది. కొత్త మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కొత్త ప్రాజెక్టులు, బాధ్యతలు చేపడతారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. శుభవార్తలను వింటారు. కుటుంబంలో ఆనందం ఉంటుంది.

2.మిథున రాశి

మిథున రాశి వారికి ఈ ఈ యోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి అదృష్టం పెరుగుతుంది. మతపరమైన కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రాపర్టీలను కొనుగోలు చేస్తారు. కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు. కెరీర్‌లో ఊహించని మార్పులు వస్తాయి. విదేశీ ప్రయాణాలు చేయడానికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

3.కుంభ రాశి

కుంభ రాశి వారికి కుంభ రాశిలో త్రిగ్రాహి యోగం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి ధైర్యం పెరుగుతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువవుతుంది. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. పార్ట్‌నర్‌షిప్ వ్యాపారాల ద్వారా ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది. ఇలా మొత్తం మీద ఈ రాశి వారికి కూడా బాగా కలిసి వచ్చేలా చేస్తుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More