...
...
Next Story

శివరాత్రి తర్వాత సూర్య గ్రహణం, మూడు రాశుల జీవితంలో అద్భుతాలు.. సక్సెస్, ప్రొమోషన్లతో పాటు ఎన్నో ఊహించని లాభాలు!

జ్యోతిష్యం ప్రకారం గ్రహణం కనిపించకపోయినా దాని ప్రభావం మనపై నేరుగా పడుతుంది. 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ఈ ఏడాది వచ్చే సూర్యగ్రహణం చాలా శక్తివంతమైనది. పైగా చాలా మంది జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఈ రాశుల వారు ఈ గ్రహణం వల్ల శుభ ఫలితాలను పొందుతారు?

Published on: Feb 11, 2026, 12:01:00 IST
Advertisement

ప్రతి ఏటా సూర్య గ్రహణాలు, చంద్ర గ్రహణాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఈ ఏడాది, అనగా 2026లో, మొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరి 17న ఏర్పడనుంది. ఇది సరిగ్గా శివరాత్రికి రెండు రోజులు తర్వాత ఏర్పడుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఆ సమయంలో సూర్యుడు కుంభరాశిలో ఉంటాడు. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి సూతక కాలం కూడా పరిగణించబడదు.

శివరాత్రి తర్వాత సూర్య గ్రహణం, మూడు రాశుల జీవితంలో అద్భుతాలు (pinterest)
శివరాత్రి తర్వాత సూర్య గ్రహణం, మూడు రాశుల జీవితంలో అద్భుతాలు (pinterest)

జ్యోతిష్యం ప్రకారం గ్రహణం కనిపించకపోయినా దాని ప్రభావం మనపై నేరుగా పడుతుంది. 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ఈ ఏడాది వచ్చే సూర్యగ్రహణం చాలా శక్తివంతమైనది. పైగా చాలా మంది జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఈ రాశుల వారు ఈ గ్రహణం వల్ల శుభ ఫలితాలను పొందుతారు? ఎవరికి ఎలా కలిసి వస్తుంది అనేది తెలుసుకుందాం.

సూర్యగ్రహణంతో ఈ రాశుల వారికి బాగా కలిసి వస్తుంది.. అనేక విధాలుగా ఊహించని లాభాలు కలుగుతాయి

1.మేష రాశి:

మేష రాశి వారికి సూర్య గ్రహణం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి అనేక రంగాల్లో మంచి మార్పులు వస్తాయి. ఆర్థికపరంగా బాగుంటుంది. ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగం లభించవచ్చు. పని ప్రదేశంలో కూడా బాధ్యతలు పెరుగుతాయి. ప్రమోషన్ కోసం చూస్తున్న వారికి కూడా బాగా కలిసి వస్తుంది.

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పులు తీరిపోతాయి. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఈ రాశి వారు కొత్త ప్రాపర్టీలను కొనుగోలు చేస్తారు. కొత్త బిజినెస్‌ను ప్రారంభించాలనుకునే వారికి కూడా ఇది అద్భుతమైన సమయం.

2.సింహ రాశి:

ధనస్సు రాశి వారికి ఈ గ్రహణం తర్వాత శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. అనేక లాభాలను పొందుతారు. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కూడా బాగా కలిసి వస్తుంది. తోటి ఉద్యోగస్తులను మీరు నడిపిస్తారు; వారి సపోర్ట్ ఉంటుంది. కొత్త అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. విజయవంతమైన జీవితాన్ని గడుపుతారు. విదేశీ ప్రయాణాలు చేస్తారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe