...
...
Next Story

అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం? అజ ఏకాదశి వ్రతానికి ఇంతటి మహిమ ఉందా!

అజ ఏకాదశి సోమవారం రావడంతో ఈసారి శ్రీమహావిష్ణువుతో పాటు పరమశివుడు, చంద్రుడి ఆరాధనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. చంద్ర దోషాలు ఉన్నవారు సోమవారం శివాభిషేకం చేయడం శుభప్రదమని నమ్మకం.

Published on: Sep 7, 2026, 09:30:20 IST
Advertisement

హిందూ ధర్మంలో ఏకాదశి వ్రతానికి అత్యంత విశిష్టత ఉంది. ముఖ్యంగా అజా ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువుతో పాటు పరమశివుడిని పూజించడం వల్ల రెట్టింపు ఫలితం లభిస్తుంది. ఈసారి అజా ఏకాదశి సోమవారం రావడంతో శివారాధనకు, చంద్ర పూజకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. జాతకంలో చంద్ర దోషాలు ఉన్నవారు ప్రతి సోమవారం శివునికి విశేష అభిషేకం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం? అజ ఏకాదశి వ్రతానికి ఇంతటి మహిమ ఉందా!
అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం? అజ ఏకాదశి వ్రతానికి ఇంతటి మహిమ ఉందా!

చాలామంది శుక్ల పక్షం, కృష్ణ పక్ష ఏకాదశుల మధ్య తేడా చూపిస్తుంటారు. కానీ, ఏకాదశి విషయంలో ఎలాంటి భేదభావం చూపించకూడదని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. నెలలోని రెండు ఏకాదశి వ్రతాలను ఆచరిస్తేనే పూర్తి ఫలితం దక్కుతుంది. కృష్ణ పక్ష ఏకాదశిని ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించే వారికి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుందని నమ్ముతారు.

ఏకాదశి వ్రత నియమాలు

వ్రతం ఆచరించే వారు కొన్ని కఠిన నియమాలను పాటించాల్సి ఉంటుంది. దశమి నాటి నుంచే నిష్ట ప్రారంభమవుతుంది. దశమి రోజున ఒకేసారి భోజనం చేయాలి. ఉప్పు, అన్నం, కందిపప్పు, మినపప్పు, వంకాయ, తేనె వంటి వాటికి దూరంగా ఉండాలి. ఏకాదశి రోజున పొరపాటున కూడా బియ్యం తీసుకోకూడదు.

ఏకాదశి రాత్రి జాగారం చేయడం ఉత్తమం. ఒకవేళ అది వీలుకాకపోతే కొంతసారైనా భగవన్నామ స్మరణ చేయాలి. రోజంతా కోపానికి దూరంగా ఉండి, నిద్రను తగ్గించి దైవ ధ్యానంలో గడపాలి. ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం వంటి పనులు చేస్తే వ్రత ఫలం లభించదు. అలాగే ఏకాదశి రోజున తులసి ఆకులను కోయకూడదు, నీరు పోయకూడదు. తులసి కోటను దర్శించుకుని దీపారాధన చేయడం మంచిది.

వ్రత సంకల్పం మరియు పూజా విధానం

ఏకాదశి మరుసటి రోజు అనగా ద్వాదశి తిథి రోజున ఉదయం 6:02 నుండి 8:33 గంటల మధ్యలో వ్రతాన్ని విరమించవచ్చు. పారణ చేసే ముందు ఆవుకు పచ్చి గడ్డిని తినిపించి, బ్రాహ్మణులకు దానధర్మాలు చేయడం ఆచారం. ఈ ఏడాది సెప్టెంబర్ 8న ప్రదోష వ్రతం కూడా వస్తోంది. ప్రదోష వ్రతం ఆచరించడం వల్ల విశేష పుణ్యఫలం దక్కుతుంది. ప్రదోష రోజున అన్నం తీసుకోకుండా పూజ పూర్తి చేయాలి. శివునికి చందనం లేపనం సమర్పించి సాయంత్రం ప్రదోష వ్రత కథను వినాలి.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks