సెప్టెంబర్ 7 సోమవారం రాశి ఫలాలు.. ఈ రాశులకు అదృష్టం, డబ్బు, ఉద్యోగంలో శుభ ఫలితాలు!
సెప్టెంబర్ 7, సోమవారం దినఫలాల ప్రకారం రాశులవారీగా ఫలితాలు భిన్నంగా ఉంటాయి. మేషం, కన్య, కర్కాటకం, సింహం, తుల, కుంభం రాశుల వారికి కెరీర్, ఆర్థికం, వ్యక్తిగత జీవితంలో అనుకూల పరిస్థితులు కనిపిస్తాయి. వృషభం, వృశ్చికం, మకరం, మీనం రాశుల వారు సంబంధాలు, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.
సోమవారం అంటేనే పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. హిందూ సంప్రదాయం ప్రకారం, సోమవారంతో కూడిన రోజుల్లో శివారాధన చేయడం వల్ల సకల కష్టాలు తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్ముతారు. గ్రహాలు మరియు నక్షత్రాల గమనాన్ని బట్టి రూపొందించిన సెప్టెంబర్ 7 దినఫలాల ప్రకారం, కొన్ని రాశుల వారికి ఈ రోజు అద్భుతమైన ఫలితాలు ఎదురుకాగా, మరికొన్ని రాశుల వారు అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. సోమవారం నాడు ఏ రాశివారి పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు వివరంగా చూద్దాం.

మేష రాశి
ప్రేమ జీవితంలో ఎదురయ్యే చిన్నపాటి సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకోవడం ద్వారా మనశ్శాంతి లభిస్తుంది. వృత్తిపరంగా ఈ రోజు మీకు అదృష్టం తోడుంటుంది. ఆఫీస్‌లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు దక్కుతుంది. చాలా కాలంగా ఆస్తులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కోర్టు వివాదాలను అనుకూలంగా మార్చుకోవడంలో విజయం సాధిస్తారు.
వృషభ రాశి
వ్యక్తిగత జీవితంలో భాగస్వామితో చిన్నచిన్న మనస్పర్థలు వచ్చినప్పటికీ, ప్రేమ బంధం మరింత బలపడుతుంది. కెరీర్‌లో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలి. ఇతరుల మాటలను శ్రద్ధగా వినడం ద్వారా సమస్యలకు సులభంగా పరిష్కారాలు దొరుకుతాయి.
మిథున రాశి
ఆరోగ్య పరంగా స్వల్ప అప్రమత్తత అవసరం. చిన్నపాటి అనారోగ్య సమస్యలు పలకరించవచ్చు. అయితే ఆర్థిక పరంగా ఎలాంటి లోటు ఉండదు. కార్యాలయంలో మీ పనితీరు అందరి ప్రశంసలను అందుకుంటుంది. ఆర్థిక మరియు ఆరోగ్య పరిస్థితులు రోజంతా అనుకూలంగా సాగిపోతాయి.
కర్కాటక రాశి
కార్యాలయంలో మీ సత్తా చాటుకునేందుకు ఇది సరైన సమయం. ఎదురయ్యే ప్రతి సవాల్‌ను సమర్థవంతంగా పరిష్కరిస్తారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ రోజు కలిసి వస్తుంది. గతంలో దూరమైన పాత నేస్తం లేదా భాగస్వామి మళ్లీ మీ జీవితంలోకి వచ్చే సూచనలున్నాయి.
సింహ రాశి
మనసుకు సంతోషాన్నిచ్చే అద్భుతమైన క్షణాలను అనుభవిస్తారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగడంతో పాటు వృత్తిగత విజయాలు కూడా తోడవుతాయి. డబ్బు ఖర్చు చేసేటప్పుడు కాస్త ఆచితూచి వ్యవహరించడం మంచిది. మీ జీవిత భాగస్వామితో కాస్త సమయం గడపడం ద్వారా బంధం బలపడుతుంది.
కన్యా రాశి
పూర్తిత్మవిశ్వాసంతో ఏ పనైనా సరే విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం, ప్రశంసలు దక్కే సమయం ఆసన్నమైంది. మీలోని ప్రత్యేక నైపుణ్యాలను, ప్రతిభను నలుగురి ముందు ప్రదర్శించడానికి నేడు మంచి అవకాశాలు లభిస్తాయి.
తులా రాశి
వృత్తి జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉండటం వల్ల కీలకమైన నిర్ణయాలు సులభంగా తీసుకోగలుగుతారు. అయితే ఆఫీస్‌లో సహోద్యోగుల విషయంలో కొద్దిగా అప్రమత్తంగా ఉండటం శ్రేయస్కరం.
వృశ్చిక రాశి
ఏ నిర్ణయమైనా తీసుకునేటప్పుడు మీ అంతరాత్మ చెప్పిన మాటకు ప్రాధాన్యత ఇవ్వండి. కొత్త పరిచయాలు, విభిన్న రంగాలను అన్వేషించడంలో మీ ఆసక్తి పెరుగుతుంది. మీ భావాలను ఇతరులకు స్పష్టంగా వ్యక్తంచేస్తారు. ప్రేమ వ్యవహారాలు సాధారణంగా సాగిపోతాయి.
ధనుస్సు రాశి
మీ వైవాహిక లేదా ప్రేమ జీవితాన్ని మరింత ఆనందంగా మలచుకోండి. బంధంలో వచ్చే సమస్యలను పరిణతితో, పెద్ద మనసుతో పరిష్కరించుకోండి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా, ఆరోగ్య పరంగా మాత్రం చిన్నపాటి ఆందోళన ఉండే అవకాశం ఉంది. శారీరకంగా శక్తివంతంగా ఉత్సాహంగా గడుపుతారు.
మకర రాశి
మీ జీవిత భాగస్వామి మీ వెన్నంటి నిలిచి అందించే సహకారానికి కృతజ్ఞతలు చెప్పేందుకు ఈ రోజు మంచి రోజు. సుఖదుఃఖాల్లో తోడుగా నిలిచిన వారికి మీ మనసులోని కృతజ్ఞతా భావాన్ని తెలియజేయండి. అయితే ఆర్థిక విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త వహించడం అవసరం.
కుంభ రాశి
జీవితంలో ఎదురయ్యే ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మీరు మానసికంగా సిద్ధంగా ఉంటారు. మీ కలలను నిజం చేసుకునే దిశగా అడుగులు వేయడానికి ఇది సరైన సమయం. మీలో ఉండే ఉత్సాహం ముందు ఏ అడ్డంకి కూడా నిలవలేదు.
మీన రాశి
మీరు పడిన కష్టానికి తగిన ఫలితాన్ని ఆస్వాదించే సమయం ఇది. అయితే జీవితం అంటే కేవలం విశ్రాంతి మాత్రమే కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అప్పుడప్పుడు మీ కంఫర్ట్ జోన్ దాటి బయటకు వచ్చి కొత్త సవాళ్లను, ప్రయత్నాలను ఆస్వాదించడం చాలా ముఖ్యం.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


