హిందూ సనాతన ధర్మంలో కార్తీక మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో వచ్చే పర్వదినాలలో 'అక్షయ నవమి' అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ ఏడాది నవమి పర్వదినాన ప్రత్యేకంగా 'రవియోగం' ఏర్పడటం దీని విశిష్టతను మరింత పెంచుతోంది. ఈ రోజున ఉసిరి చెట్టును పూజించి, దానధర్మాలు చేయడం ద్వారా అక్షయమైన పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం.
పూజా విధానం - ఆచరించాల్సిన పద్ధతులు

ఈ నవమి రోజున తెల్లవారుజామునే తలస్నానం చేసి, ఉసిరి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించాలి.
ముందుగా ఉసిరి చెట్టు మొదట పచ్చి పాలు, ఆ తర్వాత జలంతో అభిషేకం చేయాలి. అనంతరం పసుపు, కుంకుమ, అక్షతలతో పూజించి, చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి.
ప్రదక్షిణలు చేసే సమయంలో చేతిలో పూలు లేదా అక్షతలు ఉంచుకుని, ప్రతి ప్రదక్షిణకు వాటిని సమర్పించడం ఆచారం.
ఈ చెట్టు నీడలోనే కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పర్వదినాన ఉసిరి కాయలను దానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.
పద్మ, స్కంద పురాణాల్లో ప్రస్తావన
ఉసిరి చెట్టు ఆవిర్భావం గురించి పద్మ పురాణం, స్కంద పురాణాలలో రెండు ప్రముఖ కథలు ప్రస్తావించబడి ఉన్నాయి. సముద్ర మథనం సమయంలో అమృతం బిందువులు భూమిపై పడటం వల్ల ఉసిరి చెట్లు ఉద్భవించాయని కొందరు నమ్ముతుండగా.. బ్రహ్మదేవుని కన్నీటి బిందువుల నుంచి ఈ వృక్షం పుట్టిందని పద్మ పురాణంలో ఉంది.
లక్ష్మీదేవి పూజ వెనుక ఉన్న ఆసక్తికర కథ
మరో పౌరాణిక గాథ ప్రకారం, ఒకసారి లోక కళ్యాణార్ధం భూమిపైకి వచ్చిన లక్ష్మీదేవి.. ఏకకాలంలో శివకేశవులను (విష్ణుమూర్తి, శివుడు) ఇద్దరినీ ఎలా పూజించాలనే దానిపై ఆలోచించింది. విష్ణువుకు తులసి, శివునికి బిల్వపత్రం ప్రీతిపాత్రమైనవి. ఈ రెండు లక్షణాలు ఏ చెట్టులో కనిపిస్తాయా అని వెతకగా.. శ్రీహరి, శివుడు ఇద్దరూ నివసించే ఉసిరి చెట్టు ఆమెకు కనిపించింది.
అదే రోజు లక్ష్మీదేవి ఉసిరి చెట్టు మూలాన విష్ణు, శివులను ఆరాధించింది. ఆమె భక్తికి మెచ్చి ప్రత్యక్షమైన ఆ దేవుళ్లకు అదే చెట్టు కింద భోజనం పెట్టి, ఆ తర్వాత తాను ప్రసాదంగా స్వీకరించింది. ఆనాటి నుంచే ఈ 'అక్షయ నవమి'ని జరుపుకుంటున్నారని ఇతిహాసాలు చెబుతున్నాయి.
ఆరోగ్యాభివృద్ధికి ఉసిరి సంజీవని
{{/usCountry}}అదే రోజు లక్ష్మీదేవి ఉసిరి చెట్టు మూలాన విష్ణు, శివులను ఆరాధించింది. ఆమె భక్తికి మెచ్చి ప్రత్యక్షమైన ఆ దేవుళ్లకు అదే చెట్టు కింద భోజనం పెట్టి, ఆ తర్వాత తాను ప్రసాదంగా స్వీకరించింది. ఆనాటి నుంచే ఈ 'అక్షయ నవమి'ని జరుపుకుంటున్నారని ఇతిహాసాలు చెబుతున్నాయి.
ఆరోగ్యాభివృద్ధికి ఉసిరి సంజీవని
{{/usCountry}}ఆధ్యాత్మికంగానే కాకుండా, ఆయుర్వేదంలో ఉసిరికాయను ఒక అద్భుతమైన ఔషధంగా పేర్కొన్నారు. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇది అగ్రగామిగా నిలుస్తుంది.