శనివారం పూజ: శనిదేవుడికి అత్యంత ప్రీతికరమైన పూలు ఇవే.. ఈ పూలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు!
హిందూ ధర్మంలో శనివారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శనిదేవుని అనుగ్రహం కోసం భక్తులు వివిధ రకాల పరిహారాలు చేస్తుంటారు. ముఖ్యంగా శనికి ఇష్టమైన అపరాజిత, మందారం, శమి పుష్పాలను సమర్పిస్తే సకల దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు.
చాలామంది శని పేరు చెప్తే భయపడిపోతారు. కానీ శని మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి చేసిన వారికి మంచి ఫలితాలను, చెడు చేసిన వారికి చెడు ఫలితాలను అందిస్తాడు. శనివారం శని మహారాజుకి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజున దేవుని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు వివిధ పూజలు, పరిహారాలను పాటిస్తూ ఉంటారు.

ఏలినాటి శని, అర్ధాష్టమ శని వంటి ప్రభావాల నుంచి బయట పడడానికి శనివారం ప్రత్యేక పూజలు చేస్తారు. మతపరమైన విశ్వాసాల ప్రకారం, శనివారం నాడు శని దేవుని శాస్త్రోక్తంగా పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే శనికి ఇష్టమైన పూలను కూడా శనివారం నాడు సమర్పించడం మంచిదేనా? దేవుడికి ఇష్టమైన పూల గురించి ఎప్పుడూ తెలుసుకుందాం.
శని దేవుడికి ఈ పూలంటే మహా ప్రీతికరం.. వీటిని శనివారం నాడు సమర్పించండి
అపరాజిత పూలు
శని దేవుడికి ఎంతో ఇష్టమైన ఈ పువ్వులను కచ్చితంగా శనివారం సమర్పించండి. ఈ నీలిరంగు పువ్వుని శనిదేవుడికి సమర్పించడం వలన శని దేవుడు ప్రసన్నమవుతాడు. శనివారం లేదా శని జయంతి వంటి ప్రత్యేక దినాల్లో శనిదేవుడికి 5, 7 లేదా 11 అపరాజిత పూలను సమర్పించండి. శని అనుగ్రహం కలుగుతుంది.
మందార పూలు
మందార పూలు కూడా శని దేవుడికి ఎంతో ప్రీతికరమైనవిగా భావిస్తారు. శనివారం నాడు శని దేవుడికి మందారం పూలను కచ్చితంగా సమర్పించండి. శని దోషం నుంచి ఉపశమనం కలిగి సంతోషంగా ఉండొచ్చు. మందారం పూలు సాధారణంగా ఎరుపు రంగులో ఉంటాయి. వీటిని అనేక దేవతామూర్తులకు సమర్పిస్తారు. శనిదేవుడికి కూడా మందార పూలను సమర్పించండి. గ్రహ శాంతి కూడా కలుగుతుంది. పూజతో పాటు సంయమనం, దానం, సేవ, సాయం చేయడం వంటివి కూడా పాటించండి.
శమీ పూలు
శనిదేవుడికి శమి పూలను కూడా సమర్పించడం మంచిదే. అలాగే శమి ఆకులు, శమి వేర్లను కూడా సమర్పిస్తూ ఉంటారు. వీటిని సమర్పించడం వలన శని బాధల నుంచి బయటపడే, శని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. కష్టాల నుంచి బయటపడొచ్చు. ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది.
శమి వృక్షానికి శని దేవుడితో ప్రత్యేక సంబంధం
శమి వృక్షానికి శని దేవుడితో ప్రత్యేక సంబంధం ఉంటుంది. కాబట్టి పూజించండి. దాని ఆకులను దేవుడికి సమర్పించండి. శమి చెట్టు కింద దీపారాధన చేయండి. దీంతో మంచి ఫలితాలను పొందవచ్చు. ప్రతికూల ప్రభావాల నుంచి కూడా బయటపడడానికి వీలవుతుంది.
జిల్లేడు పూలు
శనిదేవుడికి జిల్లేడు పూలను కూడా సమర్పించొచ్చు. వీటిని సమర్పించడం వలన మంచి ఫలితాలను చూడచ్చు. శివుడితో కూడా జిల్లేడు పూలతో సంబంధం ఉంటుంది. కాబట్టి శివుడికి కూడా ఈ పూలను సమర్పించవచ్చు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


