రమా ఏకాదశి 2026: నవంబర్ 5న తులసి మొక్క దగ్గర ఈ 4 పనులు చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం!
హిందూ సంప్రదాయంలో రమా ఏకాదశికి ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. 2026 నవంబర్ 5, గురువారం రోజున రమా ఏకాదశి వ్రతాన్ని ఆచరించనున్నారు. ఈ పవిత్రమైన రోజున శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించడం, ఉపవాసం ఉండటం శుభప్రదంగా భావిస్తారు.
ఏకాదశి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఏకాదశి రోజుల్లో విష్ణుమూర్తిని పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందడానికి వీలవుతుంది. త్వరలోనే రమా ఏకాదశి రాబోతుంది. ఆ రోజు విష్ణుమూర్తిని భక్తిశ్రద్ధలతో ఆరాధించి ఉపవాసం ఉంటే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. అలాగే రమా ఏకాదశి నాడు ఈ పనులు చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది.

హిందూ మతంలో రమా ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ రోజు విష్ణుమూర్తితో పాటుగా లక్ష్మీదేవిని కూడా పూజించొచ్చు. రమా ఏకాదశి వ్రతాన్ని నవంబర్ ఐదు, గురువారం నాడు ఆచరించనున్నారు. ఆ రోజు తులసి పరిహారాలను కూడా చేయండి. అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. విష్ణుమూర్తి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.
రమా ఏకాదశి 2026: ఆ రోజు తులసి మొక్క దగ్గర ఈ ఐదు పనులు చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది!
తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు:
రమా ఏకాదశి నాడు తులసి మొక్క చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. ఐశ్వర్యం, సుఖ సంతోషాలు, ఆరోగ్యం కూడా కలుగుతాయి. ఇలా చేస్తే తులసి, విష్ణుమూర్తి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.
తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం:
రమా ఏకాదశి రోజు తులసి మొక్క దగ్గర స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. దీపం వెలిగించేటప్పుడు "ఓం తులసి దేవ్యే నమః" అనే మంత్రాన్ని పఠించండి. తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం వల్ల సానుకూల శక్తి వ్యాపిస్తుంది. సుఖం, సంతోషం, ఐశ్వర్యం కూడా లభిస్తాయి.
విష్ణుమూర్తికి తులసి దళాలు:
రమా ఏకాదశి నాడు విష్ణుమూర్తికి తులసి దళాలను సమర్పించండి. మతపరమైన విశ్వాసాల ప్రకారం తులసి అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతి. ఆ రోజు తులసి ఆకులను కోయకూడదని గుర్తుపెట్టుకోండి. ముందు రోజే తులసి ఆకులను కోసి భద్రపరచుకోండి.
తులసి మొక్క ముందు ఈ మంత్రాన్ని జపించండి:
రమా ఏకాదశి నాడు తులసి మొక్క దగ్గర "ఓం నమో భగవతే వాసుదేవాయ నమః" అని జపించండి. ఈ మంత్రాన్ని జపిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది.
ఈ మంత్రాన్ని జపించేటప్పుడు ప్రశాంతంగా కూర్చుని విష్ణుమూర్తిని ధ్యానించాలి.
ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది.
రమా ఏకాదశి నాడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు
మతపరమైన విశ్వాసాల ప్రకారం చూసినట్లయితే, ఏకాదశి నాడు తులసి ఆకులను కోయకూడదు. కనుక పూజకు అవసరమైన తులసి ఆకులను దశమి రోజే కోసుకోవడం మంచిది. తులసి మొక్కను పూజించేటప్పుడు పరిశుభ్రతను పాటించండి. అలాగే భక్తిశ్రద్ధలతో తులసి దేవిని పూజించడం వల్ల తులసి దేవి అనుగ్రహం లభించి సంతోషంగా ఉండొచ్చు.
తులసి మొక్క చుట్టూ ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. చెత్తచెదారం, చెప్పులు, డస్ట్‌బిన్ వంటివి తులసి మొక్క చుట్టుపక్కల ఉండకుండా చూసుకోండి. ఈ విధంగా తులసి పరిహారాలను రమా ఏకాదశి రోజు పాటించడం వల్ల విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, సమస్యలన్నీ తొలగిపోయి ప్రయోజనాలను పొందడానికి వీలవుతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


