సంతాన ప్రాప్తి, సుఖ సంతోషాల కోసం రమా ఏకాదశి, గోవత్స ద్వాదశి పూజ.. ఈ రెండు రోజులు ఏం చెయ్యాలి?

హిందూ సంప్రదాయంలో కార్తిక మాసానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ఈ పవిత్ర మాసంలో వచ్చే ముఖ్యమైన పర్వదినాల్లో రమా ఏకాదశి, గోవత్స ద్వాదశి ప్రత్యేక ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. 2026లో నవంబర్ 5న రమా ఏకాదశి, నవంబర్ 6న గోవత్స ద్వాదశిని జరుపుకోనున్నారు. 

Published on: Nov 3, 2026, 12:30:16 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

హిందూ సంప్రదాయంలో కార్తిక మాసానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ పవిత్ర మాసంలో వచ్చే ప్రతి పండగకు, వ్రతానికి ఆధ్యాత్మికంగా ఎంతో విశేషం ఉంటుంది. ఇందులో భాగంగానే వచ్చే రోజుల్లో భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించే పవిత్ర పర్వదినం 'రమా ఏకాదశి'. ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన రమా ఏకాదశి వ్రతం రాగా, మరుసటి రోజు నవంబర్ 6న ద్వాదశిని జరుపుకోనున్నారు.

సంతాన ప్రాప్తి, సుఖ సంతోషాల కోసం రమా ఏకాదశి, గోవత్స ద్వాదశి పూజ.. ఈ రెండు రోజులు ఏం చెయ్యాలి?
సంతాన ప్రాప్తి, సుఖ సంతోషాల కోసం రమా ఏకాదశి, గోవత్స ద్వాదశి పూజ.. ఈ రెండు రోజులు ఏం చెయ్యాలి?

రమా ఏకాదశి ప్రాముఖ్యత.. పూజా విధానం

ఆచార్య పండితుల సూచనల ప్రకారం.. ఏకాదశి తిథి నవంబర్ 5 ఉదయం 10:10 గంటల వరకు ఉండి, ఆ తర్వాత ద్వాదశి ప్రవేశిస్తుంది. హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం, ఏకాదశి వ్రతాన్ని ఆచరించేటప్పుడు తిథులలో దశమి కలవకుండా, ద్వాదశి స్పర్శ ఉండే రోజును ప్రామాణికంగా తీసుకుంటారు. ఆశ్వయుజ కృష్ణ పక్షంలో వచ్చే ఈ పరమ పావనమైన ఏకాదశికి 'రమా' అనే పేరుంది. 'రమా' అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అని అర్థం.

సకల పాపాలను హరించే శక్తి ఈ ఏకాదశి వ్రతానికి ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువుతో పాటు మహాలక్ష్మిని పూజించడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని, అంతిమంగా వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. చింతామణి, కామధేనువు ఏ విధంగానైతే కోరిన కోర్కెలు తీరుస్తాయో, ఈ రమా ఏకాదశి వ్రతం కూడా సకల మనోరథాలను సిద్ధింపజేస్తుందని ప్రతీతి.

ప్రత్యేక యోగాలు.. గ్రహస్థితులు

ఈ పవిత్రమైన రోజున కొన్ని విశేషమైన ఖగోళ, ఆధ్యాత్మిక యోగాలు కుదురుతున్నాయి. జ్యోతిష్య గణన ప్రకారం, ఈ రోజు ఉత్తరఫాల్గుణి నక్షత్రంతో పాటు బాల్వ కరణం ఉదయం 10:36 గంటల వరకు ఉంటుంది. చంద్రుడు ఉదయం 9:34 గంటల వరకు సింహ రాశిలో సంచరించి, ఆ తర్వాత కన్యా రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ ప్రత్యేక గ్రహ స్థితి కారణంగా భక్తులకు పూజా ఫలం మరింత ఎక్కువగా లభిస్తుందని నమ్ముతారు.

గోవత్స ద్వాదశి విశేషాలు

రమా ఏకాదశి మరుసటి రోజైన నవంబర్ 6న 'గోవత్స ద్వాదశి'ని జరుపుకుంటారు. గోవును దైవంగా భావించే మన సంస్కృతిలో ఈ పండుగకు చాలా ప్రాధాన్యత ఉంది. సంతాన ప్రాప్తిని కోరుకునే దంపతులు ఈ రోజు ప్రత్యేకంగా ఆవును, దూడను పూజిస్తారు.

ఇంటా బయటా సుఖ శాంతులు, సిరి సంపదలు వెల్లివిరియాలని కోరుకుంటూ గోమాతను పూజించడం హిందూ సనాతన ధర్మం ఇస్తున్న అందమైన సందేశం. ఈ పర్వదినాన గోవులకు తలస్నానం చేయించి, కుంకుమ తిలకం దిద్ది, పచ్చి గడ్డి లేదా తగిన ఆహారం తినిపించడం అత్యంత పుణ్యప్రదమని పెద్దలు చెబుతుంటారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More