శారదీయ పూర్ణిమ రోజున చంద్రుడికి అర్ఘ్యాన్ని ఎలా సమర్పించాలి? చంద్రోదయ సమయంతో పాటు పూర్తి వివరాలు
అక్టోబర్ 25న శారదీయ పూర్ణిమ పర్వదినం వచ్చింది. ఈ పవిత్ర రాత్రి చంద్రునికి అర్ఘ్యం సమర్పించడం, వెనెల్లో పాయసం ఉంచడం వెనుక ఉన్న విశిష్టత, పూజా విధానం, ముహూర్తాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
హిందూ సనాతన ధర్మంలో ఆశ్వయుజ మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్ట స్థానం ఉంది. దీనినే శరద్ పూర్ణిమ, కొజాగరి పూర్ణిమ లేదా రాస పూర్ణిమ అని పిలుస్తారు. ఈ ప్రత్యేక రాత్రి చంద్రుడు తన పదహారు కళలతో పరిపూర్ణంగా ప్రకాశిస్తాడు.

పురాణాల ప్రకారం, శరద్ పూర్ణిమ నాడు ఆకాశం నుంచి అమృతం కురుస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ రోజు రాత్రి లక్ష్మీదేవి భూమ్మీదికి వచ్చి భక్తులను అనుగ్రహిస్తారని పండితులు చెబుతున్నారు. అందుకే ఈ పర్వదినాన ప్రత్యేక పూజలు, రాత్రి జాగరణ చేయడం ద్వారా సిరిసంపదలు వెల్లివిరుస్తాయని నమ్ముతారు. మానసిక ప్రశాంతతను ప్రసాదించే చంద్రదేవునికి ఈ రోజు అర్ఘ్యం సమర్పించడం ఆచారంగా వస్తోంది.
శారదీయ పూర్ణిమ 2026 తేదీ మరియు సమయం
పంచాంగం ప్రకారం, ఆశ్వయుజ శుక్ల పక్ష పౌర్ణమి తిథి అక్టోబర్ 25, 2026 నాడు ఉదయం 11:55 గంటలకు ప్రారంభమై, అక్టోబర్ 26, 2026 ఉదయం 09:41 గంటలకు ముగుస్తుంది. దీంతో అక్టోబర్ 25, ఆదివారమే పూర్ణిమ వ్రతాన్ని ఆచరించనున్నారు.
చంద్రదర్శనం, అర్ఘ్య ప్రదాన విధానం
శరద్ పూర్ణిమ నాడు సాయంత్రం వేళ అభ్యంగన స్నానం ఆచరించి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలి.
ఒక రాగి లేదా వెండి చెంబులో శుద్ధ జలం లేదా గంగాజలం తీసుకుని, అందులో కొద్దిగా పచ్చిపాలు, తెల్లని చందనం, ఒక తెల్లని పువ్వు వేయాలి. వీలైతే వెండి నాణెం కూడా వేయచ్చు.
చంద్రోదయం తర్వాత మిద్దెపైకి లేదా చంద్రుని వైపు చూస్తూ రెండు చేతులతో నీటిని నెమ్మదిగా ధారగా సమర్పించాలి. "పాదాల మీద నీరు పడకుండా కింద ఒక పాత్రను ఉంచాలి," అని వేద పండితులు సూచిస్తున్నారు. అర్ఘ్యం సమర్పించే సమయంలో 'ఓం చంద్రాయ నమః' లేదా 'చంద్రమసే నమః' మంత్రాలను జపించాలి. ఈ ఏడాది అక్టోబర్ 25న సాయంత్రం 4:55 గంటలకు చంద్రోదయం కానుంది.
శరద్ పూర్ణిమ రాత్రి వెన్నెలలో పాయసం ఉంచడం అత్యంత ముఖ్యమైన ఆచారం. రాత్రి 8:00 గంటల సమయం నుంచి పాయసాన్నివెన్నెల తాకేలా ఉంచాలి. లక్ష్మీదేవి, విష్ణుమూర్తులను పూజించిన తర్వాత పాయసాన్ని నివేదించాలి. ఈ పవిత్రమైన రోజున భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవిని, చంద్రదేవుడిని ఆరాధించడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ఆధ్యాత్మిక వేత్తలు వెల్లడించారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


