దీపావళికి ముందు వచ్చే రమా ఏకాదశి.. ఆ రోజు చేయాల్సిన పూజలు, దానధర్మాలు ఇవే!
ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. వాటిలో ఆశ్వయుజ మాసంలోని కృష్ణపక్ష ఏకాదశిని రమా ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున శ్రీమహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించడం విశేషంగా భావిస్తారు. భక్తిశ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించడం వల్ల పాపాలు తొలగి, కుటుంబంలో సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యం కలుగుతాయని విశ్వసిస్తారు.
ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఏకాదశి రోజు విష్ణువుని ఆరాధించడం వలన విష్ణువు అనుగ్రహం కలిగి, సుఖ సంతోషాలు కలుగుతాయి. ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష ఏకాదశిని రమా ఏకాదశి అని అంటారు.

దీపావళికి కొన్ని రోజుల ముందు వచ్చే ఈ ఏకాదశికి మన హిందూ సంప్రదాయంలో చాలా ప్రాధాన్యత ఉంది. ఆ రోజు విష్ణువుని, లక్ష్మీదేవిని ఆరాధించడం వలన శుభాలు కలుగుతాయి. రమా ఏకాదశి నాడు ఏం చేయాలి? విష్ణువుని ఆరాధించడం వలన కలిగే లాభాలు ఏంటి? వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రమా ఏకాదశి 2026 ఎప్పుడు వచ్చింది?
పంచాంగం ప్రకారం చూసినట్లయితే, ఏకాదశి నవంబర్ 05, గురువారం నాడు రమా ఏకాదశి వచ్చింది. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే విష్ణువు అనుగ్రహం కలుగుతుంది. పాపాలు తొలగిపోయి, సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయి.
రమా ఏకాదశి నాడు విష్ణువుని, లక్ష్మీదేవిని ఎందుకు ఆరాధించాలి?
రమా ఏకాదశికి లక్ష్మీదేవి పేరుతో సంబంధం ఉంది. కనుక ఆరోజు విష్ణువుని, లక్ష్మీదేవిని ఇద్దరినీ పూజించడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చు. ఈ వ్రతం గురించి పద్మ పురాణంలో కూడా చెప్పబడింది. ఆ రోజు ఉపవాసం ఉండి విష్ణువుని పూజిస్తే పాపాలన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ఆర్థిక సమృద్ధి కలుగుతుంది.
రమా ఏకాదశి పూజా విధానం
ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు ధరించిన తర్వాత దీపారాధన చేయాలి. అలాగే విష్ణువును, లక్ష్మీదేవిని భక్తితో పూజించాలి. దీప, ధూప, నైవేద్యాలను సమర్పించాలి. తులసి దళాలతో విష్ణువుని పూజించడం వలన అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
ఏకాదశి నాడు తులసి ఆకుల్ని కోయకూడదు. కనుక ముందు రోజే తులసి ఆకులను కోసి సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. సాయంత్రం కూడా విష్ణువుని, లక్ష్మీదేవిని భక్తితో పూజించాలి. స్తోత్రాలు పఠించాలి. భగవద్గీత చదివితే మంచిదే.
రమా ఏకాదశి ప్రాధాన్యత
ఏకాదశి వ్రతానికి ఉన్న ప్రాధాన్యత, ప్రత్యేకతలతో రమా ఏకాదశి కూడా ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంది. ఆ రోజు విష్ణువుని, లక్ష్మీదేవిని పూజించేవారు వారి అనుగ్రహాన్ని పొందవచ్చు. సుఖసంతోషాలు, ఐశ్వర్యం కూడా కలుగుతాయి. ఏకాదశి వ్రతం చేయడం వలన ఎంతో పుణ్యం లభిస్తుంది. పేదలకు అన్నదానం చేయడం, వస్త్రాలు, ధాన్యాలు దానం చేయడం కూడా మంచి ఫలితాలను అందిస్తాయి.
నిరాకరణ: ఈ వ్యాసంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలోని నిపుణుడిని సంప్రదించండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


